iDreamPost
android-app
ios-app

హీరో రవితేజకి ప్రమాదం! ఏకంగా 12 కుట్లు! ఆలస్యంగా వెలుగులోకి!

  • Published Oct 13, 2023 | 12:52 PM Updated Updated Oct 13, 2023 | 12:52 PM
  • Published Oct 13, 2023 | 12:52 PMUpdated Oct 13, 2023 | 12:52 PM
హీరో రవితేజకి ప్రమాదం! ఏకంగా 12 కుట్లు! ఆలస్యంగా వెలుగులోకి!

సినిమా షూటింగ్స్‌లో నటీనటులు, టెక్నీషియన్లు గాయాలపాలు అవుతుంటారు. ఒక్కొక్కసారి అలాంటివి ప్రాణాల మీదకు తెస్తుంటాయి. నూతన్ ప్రసాద్, తమిళ నటుడు బాబు వంటి వ్యక్తులు సినిమా చిత్రీకరణలో దెబ్బలు తిని.. సినీ కెరీర్‌తో పాటు జీవితాన్ని కోల్పోయిన సంగతి తెలిసిందే. అయితే కొన్ని సార్లు ఎంత జాగ్రత్తగా ఉన్న అనుకోకుండా ప్రమాదాలు జరుగుతుంటాయి. సినిమా అంటే ఫ్యాషన్, పిచ్చితో ఉండే హీరోలు.. రియలిస్టిక్‌గా ఉండాలని రిస్క్ చేస్తుంటారు. ప్రతి హీరో ఏదో ఒక సందర్భంలో దెబ్బలు తినే ఉండుంటారు. తాజాగా మాస్ మహారాజా రవితేజ కూడా గాయపడ్డారట. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. టైగర్ నాగేశ్వరరావు సినిమా కోసం ఆయన చేసిన రిస్క్ గురించి చెప్పారు నిర్మాత అభిషేక్ అగర్వాల్.

తన ఈజీ నటనతో, క్యాచీ డైలాగ్స్‌తో కట్టిపడేస్తుంటారు రవితేజ. సినిమా సినిమాకు ట్రాన్ఫర్మేషన్ అవుతూ.. కొత్తగా కనిపిస్తూ అభిమానులను అలరిస్తూ ఉంటారు. అలాగే ఎంతటి రిస్క్ చేసేందుకు కూడా వెనకాడడు. తాజాగా ఆయన టైగర్ నాగేశ్వరరావు సినిమా చేస్తున్న సంగతి విదితమే. సువర్ట్ పురం దొంగ టైగర్ నాగేశ్వరరావు జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతుండగా.. రవితేజకు జరిగిన ప్రమాదం గురించి వెల్లడించారు నిర్మాత అభిషేక్. ‘ఈ సినిమాలోట్రైన్ దోపిడీ సీన్ చేసేటప్పుడు.. రైలు మీద నుండి లోపలికి దూకే షాట్ ఉంటుంది. ఆ షాట్ లో రవితేజ అదుపు తప్పి కింద పడ్డారు. మోకాలికి కొద్దిగా పైన దెబ్బ తగిలింది. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లాం. ఆపరేషన్ చేసి 12 కుట్లు వేశారు‘ అని చెప్పారు.

‘ఆ షాట్‌లో 400 మంది జూనియర్ ఆర్టిస్టులు ఉన్నారు. షూట్ వాయిదా వేస్తే నిర్మాతకు నష్టం వస్తుందని భావించి రెండు రోజుల్లోనే షూటింగ్‌కు వచ్చేశారు. రెస్టు తీసుకోమని చెప్పినా.. నిర్మాతకు నష్టం రాకూడదన్న కారణంతో నొప్పిని భరిస్తూ.. షూటింగ్‌లో పాల్లొన్నారు’ అని వెల్లడించారు. కాగా, షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా దసరా సందర్భంగా ఈ నెల 20న థియేటర్లలో సందడి చేయనుంది. ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్ మంచి రెస్పాన్స్ పొందింది. దర్శకుడు వంశీ తెరకెక్కిస్తున్న ఈ మూవీలో నుపూర్ సనన్, గాయత్రి భరద్వాజ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. జీవీ ప్రకాశ్ సంగీతాన్ని అందిస్తున్నారు.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişjojobet girişCasibombetciograndpashabet