iDreamPost
android-app
ios-app

వివాదాల్లో రాజ్ తరుణ్! కొత్త సినిమా బిజినెస్ ఎలా ఉందంటే?

  • Published Jul 24, 2024 | 3:54 PM Updated Updated Jul 24, 2024 | 3:54 PM

Raj Tarun: తాజాగా  రాజ్ తరుణ్  హీరోగా రామ్ భీమన దర్శకత్వంలో తెరకెక్కనున్న పురుషోత్తముడు మూవీలో నటించాడు. అయితే ఫ్యామిలీ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ స్టోరిగా రూపొందించిన ఈ మూవీ ఈనెల 26న థియేటర్లలో విడుదల కానుంది. అయితే తాజాగా ఈ మూవీకి సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగగా ఆ ఈవెంట్ లో రాజ్ తరుణ్ పాల్గొనలేదు. దీంతో రాజ్ తరుణ్ గురించి దర్శక, నిర్మాతలకు మీడియా ప్రతినిధుల నుంచి కొన్ని ప్రశ్నలు ఎదురవ్వగా.. వారు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

Raj Tarun: తాజాగా  రాజ్ తరుణ్  హీరోగా రామ్ భీమన దర్శకత్వంలో తెరకెక్కనున్న పురుషోత్తముడు మూవీలో నటించాడు. అయితే ఫ్యామిలీ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ స్టోరిగా రూపొందించిన ఈ మూవీ ఈనెల 26న థియేటర్లలో విడుదల కానుంది. అయితే తాజాగా ఈ మూవీకి సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగగా ఆ ఈవెంట్ లో రాజ్ తరుణ్ పాల్గొనలేదు. దీంతో రాజ్ తరుణ్ గురించి దర్శక, నిర్మాతలకు మీడియా ప్రతినిధుల నుంచి కొన్ని ప్రశ్నలు ఎదురవ్వగా.. వారు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

  • Published Jul 24, 2024 | 3:54 PMUpdated Jul 24, 2024 | 3:54 PM
వివాదాల్లో రాజ్ తరుణ్! కొత్త సినిమా బిజినెస్ ఎలా ఉందంటే?

గత కొన్ని రోజులుగా రాజ్ తరుణ్, లావణ్య వివాదం రోజుకొక ఎపిసోడ్ తో కొత్త ట్వీస్టులు అనేవి తెరపైకి వస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ కేసులో రాజ్ తరుణ్ తో పాటు హీరోయిన్ మాల్వీ మాల్హోత్రా ఆయన సోదరుడి పేర్లు కూడా పోలీసులు నమోదు చేసుకున్నారు. అయితే ఈ వివాదం ఇప్పటిలో ముగిసేలా లేకపోవడంతో.. రాజ్ తరణ్, మాల్వీ జంటగా నటించిన ‘తిరగబడరా సామి’ సినిమాను ఆగస్టు 2వ తేదీకి వాయిదా వేసిన విషయం తెలిసిందే. అయితే మరోపక్క ఈ సినిమాతో పాటు రాజ్ తరుణ్ పురుషోత్తముడు అనే మూవీలో కూడా నటించాడు. ఆ సినిమా  ఈనెల జూలై 26వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది. అయితే తాజాగా ఈ మూవీ ప్రమోషన్స్ నిర్వహించగా.. ఆ ఈవెంట్ కు రాజ్ తరుణ్ హాజరుకాలేదు. ఇక ఈ విషయంపై దర్శక, నిర్మతాలకు రాజ్ తరుణ్ గురించి పలు ప్రశ్నలు ఎదురవ్వగా ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.  ఆ వివరాళ్లోకి వెళ్తే..

తాజాగా  రాజ్ తరుణ్  హీరోగా రామ్ భీమన దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘పురుషోత్తముడు’ మూవీలో నటించాడు. కాగా, ఈ మూవీ జులై 26వ తేదీన థియేటర్స్ లోకి రాబోతుంది. అయితే ఇదొక ఫ్యామిలీ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ స్టోరిగా  రూపొందించారు.  అలాగే ఈ మూవీకి నిర్మాతగా రమేష్ వ్యవహరించారు. ఇకపోతే ఈ సినిమా కథ శ్రీమంతుడు,మహర్షి  కథలకు రిలేటెడ్ గా ఉంటుదని టాక్ వినిపిస్తోంది. ఈ విషయం పక్కన పెడితే.. తాజాగా పురుషోత్తముడు మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను చిత్ర యూనిట్ నిర్వహించారు. కానీ,  ఇందులో రాజ్ తరుణ్ కనబడలేదు. దీనిపై మీడియా ప్రతినిధులు నుంచి  దర్శక, నిర్మాతలకు రాజ్ తరుణ్ గురించి ప్రశ్నలు ఎదురైయ్యాయి. ఇందులో భాగంగానే ఓ జర్నలిస్ట్ రాజ్ తరుణ్ కారణంగా ఈ సినిమాకి బిజినెస్ పరంగా ఏమైనా నష్టం వచ్చిందా అని నిర్మాతను అడిగారు.

ఇక ఈ ప్రశ్నకు స్పందించిన నిర్మాత రమేష్ ఆసక్తికరంగా సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘తెలుగు ప్రేక్షకులు చాలా పరిణితితో ఆలోచిస్తారు. పైగా మూవీ కంటెంట్ ని, అందులో నటించిన యాక్టర్స్ పాత్రలని మాత్రమే చూసి సినిమాని సక్సెస్ చేస్తారు. అలాగే ఆ  సినిమా వెనుక 2 వేల మంది కార్మికుల కష్టం కూడా ఉంటుదని ప్రేక్షకులకి తెలుసు. కనుక కచ్చితంగా మా పురుషోత్తముడు సినిమాని ఆడియన్స్ ఆదరిస్తారని నమ్మకంగా ఉన్నామని చెప్పారు. అలాగే మూవీ బిజినెస్, రిజల్ట్ పై మేము ఎలాంటి అంచనాలు పెట్టుకోలేదు. క్వాలిటీ, కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు ఆటోమేటిక్ గా సక్సెస్ ఇస్తారని అన్నారు.

ఇక రాజ్ తరుణ్ విషయానికొస్తే.. తన వ్యక్తిగత సమస్యల కారణంగా ప్రమోషన్స్ లో పాల్గొనలేకపోయాడు. కానీ, వీడియో బైట్స్ ఇస్తామని చెప్పారు. అయితే ఫోన్ కి అందుబాటులో లేరు.  అలా అని ప్రమోషన్స్ మాత్రం ఆగవు. చాలా యాక్టివ్ గానే చేస్తున్నాం.  కాగా, ఇప్పటికే పురుషోత్తముడు కంటెంట్ ట్రైలర్, సాంగ్స్ తో ప్రేక్షకులకి చేరువ అయ్యిందని’ నిర్మాత తెలిపారు.  ఇక దర్శకుడు రామ్  భభీమన మాట్లాడుతూ.. ‘పురుషోత్తముడులో సినిమాలో హీరో పాత్రకి రాజ్ తరుణ్ పూర్తిగా న్యాయం చేసాడని, అతని విషయంలో మాకు ఎలాంటి అభ్యంతరాలు లేవని’ తెలిపారు. ఇదిలా ఉంటే.. ఏదీ ఏమైనా చాలా రోజుల తర్వాత రాజ్ తరుణ్ మళ్లీ బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో బిజీ అయిన సమయంలో ఈ వివాదాలు చుట్టుముట్టడంతో.. పెద్ద దెబ్బ పడిందని చెప్పవచ్చు.

మరొపక్క రాజ్ తరుణ్ మూవీ ప్రమోషన్స్ లో పాల్గొనక పోవడం ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ మారింది. పైగా ఈ విషయం పై  నెటిజన్స్, ఫ్యాన్స్ రాజ్ తరుణ్  ఏ తప్పు చేయకుండా..  ప్రమోషన్స్ లో పాల్గొనకపోవడం ఏమిటి అంటూ చర్చించుకుంటున్నారు. అయితే మరి కొందరు మాత్రం వివాదాల కారణంగా  ఈమెజ్ దెబ్బతినడంతో..  రాజ్ తరుణ్ బయటకు రావడంలేదని కామెంట్స్ చేస్తున్నారు.  మరి, రాజ్ తరుణ్ పురుషోత్తముడు మూవీలో ప్రమోషన్స్ లో పాల్గొనకపోవడం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.