iDreamPost
android-app
ios-app

వెంకటేష్ చిన్న కూతురి పెళ్లి.. ఎప్పుడంటే..?

  • Published Mar 14, 2024 | 6:39 PM Updated Updated Mar 14, 2024 | 6:39 PM

టాలీవుడ్ ఇండస్ట్రీలో మరో బిగ్ ఫ్యామిలీ ఇంట భాజా భంజత్రీలు మోగనున్నాయి. టాలీవుడ్ టాప్ హీరోల్లో ఒకరైన దగ్గుబాటి వెంకటేశ్ అలియాస్ విక్టరీ వెంకటేష్ ఇంట పెళ్లి సందడి నెలకొంది.

టాలీవుడ్ ఇండస్ట్రీలో మరో బిగ్ ఫ్యామిలీ ఇంట భాజా భంజత్రీలు మోగనున్నాయి. టాలీవుడ్ టాప్ హీరోల్లో ఒకరైన దగ్గుబాటి వెంకటేశ్ అలియాస్ విక్టరీ వెంకటేష్ ఇంట పెళ్లి సందడి నెలకొంది.

  • Published Mar 14, 2024 | 6:39 PMUpdated Mar 14, 2024 | 6:39 PM
వెంకటేష్ చిన్న కూతురి పెళ్లి.. ఎప్పుడంటే..?

తెలుగు ఇండస్ట్రీలో పెళ్లిళ్ల సందడి నెలకొంది. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్.. ప్రియుడు జాకీ భగ్నానీని గత నెలలో మనువాడింది. అంతకు ముందు మరో నటి అస్మితా సూద్ గోవాలో పెళ్లి చేసుకుంది. నటి మీరా చోప్రా కూడా తాజాగా పెళ్లి పీటలు ఎక్కింది. ఈ బుధవారం యంగ్ హీరో కిరణ్ అబ్బవరం ఎంగేజ్ మెంట్ తన ప్రేయసి రహస్య గోరఖ్‌తో జరిగింది. ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీ సీనియర్ హీరో వెంకటేష్ ఇంట్లో పెళ్లి హడావుడి మొదలైంది. ఆయన చిన్న కుమార్తె హయవాహిని పెళ్లి పీటలు ఎక్కబోతుంది. గతంలోనే నిశితార్థ వేడుక జరిగిన సంగతి విదితమే. విజయవాడకు చెందిన డాక్టర్‌తో ఎంగేజ్ మెంట్ జరగ్గా.. ఆ ఫోటోలు వైరల్ అయ్యాయి. మహేష్ బాబు, చిరంజీవి ఆ వేడుకలకు హాజరయ్యారు. ఇప్పుడు పెళ్లి డేట్ ఫిక్స్ అయ్యింది.

ప్రముఖ నిర్మాత, సురేష్ ప్రొడక్షన్స్ అధినేత దివంగత దగ్గుబాటి రామానాయుడు వారసుల్లో ఒకరు వెంకటేష్. ఆయనకు నీరజతో వివాహం అయ్యింది. వీరికి ముగ్గురు కుమార్తెలు. ఓ కొడుకు. పెద్ద కుమార్తె ఆశ్రితకు హైదరాబాద్‌కు చెందిన వినాయక్ రెడ్డితో 2019లో జైపూర్‌లో వివాహం జరిగింది. దీనికి రామ్ చరణ్ దంపతులు హాజరయ్యారు. ఇన్‌ఫినిటీ ప్లాటర్ పేరుతో ఆశ్రిత యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్న సంగతి విదితమే. ఇన్ స్టాలో కూడా ఆమె రీల్స్ ట్రెండ్ అవుతుంటాయి. ఇక ఆయన రెండవ కుమార్తె హయవాహినికి గతంలో ఎంగేజ్ మెంట్ నిర్వహించారు కుటుంబ సభ్యులు. ఇప్పుడు పెళ్లి డేట్ ఫిక్స్ చేశారు. మార్చి 15న హైదరాబాద్ రామానాయడు స్టూడియోలో ఈ వివాహం జరగనున్నట్లు తెలుస్తోంది.

ఈ పెళ్లిని కూడా పెద్దగా హడావుడి చేయడం లేదట కుటుంబ సభ్యులు. కేవలం కుటుంబ సభ్యులు, సన్నిహితులు, కొంత మంది సినీ సెలబ్రిటీలకు మాత్రమే ఇన్విటేషన్లు అందినట్లు సమాచారం. ఇక ఆయనకు కాబోయే అల్లుడు.. విజయవాడలో ప్రముఖ డాక్టర్ అని తెలుస్తోంది. అత్యంత సింపుల్ గా ఈ వెడ్డింగ్ చేయనున్నట్లు సమాచారం. అయితే అధికారికంగా ఈ ప్రకటన రాలేదు.. పెళ్లి ఫోటోలు వచ్చేదాన్ని బట్టి ఈ విషయంపై క్లారిటీ ఉంటుంది. మూడో కుమార్తె భావన దగ్గుబాటి.. కొడుకు అర్జున్..చదువుకుంటున్నట్లు తెలుస్తోంది.  ఇక సినిమాల విషయానికి వస్తే.. ఈ ఏడాది సంక్రాంతి బరిలో సైంధవ్ చిత్రంలో పలకరించాడు వెంకటేష్.  ఇప్పటి వరకు 75 చిత్రాల్లో నటించారు.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss