iDreamPost
android-app
ios-app

హెబ్బా ఈజ్ బ్యాక్.. ఈసారి ‘హనీమూన్ ఎక్స్ ప్రెస్’ తో!

  • Published Jan 25, 2024 | 7:36 PM Updated Updated Jan 25, 2024 | 7:36 PM

Hebah Patel: టాలీవుడ్ నటి హెబ్బా పటేల్ గురించి సినీ ప్రియులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. కుమారి 21 ఎఫ్ సినిమాతో కుర్రాళ్లను ఉర్రూతలూగించిన ఈ అమ్మడు.. తాజాగా హనిమూన్ సినిమాతో మరోసారి సందడి చేయనుంది.

Hebah Patel: టాలీవుడ్ నటి హెబ్బా పటేల్ గురించి సినీ ప్రియులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. కుమారి 21 ఎఫ్ సినిమాతో కుర్రాళ్లను ఉర్రూతలూగించిన ఈ అమ్మడు.. తాజాగా హనిమూన్ సినిమాతో మరోసారి సందడి చేయనుంది.

  • Published Jan 25, 2024 | 7:36 PMUpdated Jan 25, 2024 | 7:36 PM
హెబ్బా ఈజ్ బ్యాక్.. ఈసారి ‘హనీమూన్ ఎక్స్ ప్రెస్’ తో!

సినీ ఇండస్ట్రీలో చాలామంది హీరోయిన్లు  గ్లామర్ పాత్రలకే ప్రాధాన్యత ఇస్తుంటారు. ఇక తమ అందాలు ఆరబోయడంలో ఏమాత్రం వెనుకాడరు. కొందరు హీరోయిన్లు అయితే ఇండస్ట్రీలో నిలదొక్కునేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. లిప్ లాక్ సీన్, రోమాంటిక్ సీన్సు చేసేందుకు సైతం వెనుకాడరు. ఇప్పటికే ఎంతో మంది ఇలా తమ అందాలను ఆరబోస్తూ ఇండస్ట్రీలో నిలబడే ప్రయత్నం చేస్తుంటారు. ఆ కోవాలోనే  ఉన్నారు  హెబ్బా పటేలే. ప్రస్తుతం స్టన్నింగ్ లిప్ లాక్ సీన్స్ తో హెబ్బా ఈజ్ బ్యాక్ అనేలా అందరిని ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ అమ్మడు హనీమూన్ ఎక్స్ ప్రెస్ అనే సినిమాలో నటిస్తుంది.

టాలీవుడ్ ఇండస్ట్రీలో టాలెంటెడ్ హీరోయిన్లలో హెబ్బా పటేల్ ఒకరని చెప్పడానికి ఎలాంటి సందేహం లేదు. కెరీర్ స్టార్టింగ్ లో వరుస హిట్లతో లక్కీ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్నా.. అడపాదడపా సినిమాలు చేస్తోంది. వచ్చిన ఛాన్సులను వదులుకోకుండా మంచి పేరు సంపాదించేందుకు ట్రై చేస్తోంది. మళ్లీ తన కెరీర్‌ను గాడిన పడేసేందుకు తన వంతు ప్రయత్నం చేస్తోంది. స్పెషల్ సాంగ్స్, పాత్ర ప్రాధాన్యం ఉన్న మూవీస్ లో నటిస్తోంది. కన్నడలో తన సినీ కెరీర్ మొదలు పెట్టిన హెబ్బాకు.. తెలుగులోనే మంచి బ్రేక్ వచ్చింది. లెక్కల మాస్టార్ సుకుమార్ నిర్మించిన కుమారి 21 ఎఫ్ సినిమా మంచి హిట్ ను సాధించింది. ఈ మూవీ హెబ్బాకు ఫుల్ క్రేజ్ ను తెచ్చిపెట్టింది. ఆ తరువాత అనేక సినిమాల్లో నటించినా..మళ్లీ ఇప్పటి వరకు ఆమెకు ఆ రేంజ్ హిట్ పడలేదు. అయినప్పటికీ వరుసగా సినిమాలు చేస్తూ వెళుతోంది. గతంలో మెగా హీరో వరుణ్ తేజ్ మిస్టర్ మూవీలో కూడా ఒక డిఫరెంట్ రోల్ చేసింది.

hebba is back

ఇక కుమారి 21 ఎఫ్ చిత్రం విడుదలైనప్పుడు అందరూ ఒక విషయం గురించి మాట్లాడుకున్నారు. అది కూడా రాజ్ తరుణ్‌తో హెబ్బా పటేల్ లిప్‌లాక్‌ సీన్ల గురించి. సినిమాలోని కంటెంట్ ఒకటైతే, హెబ్బా ముద్దుల కేళి ఆమెను టాలీవుడ్‌లో విపరీతంగా పాపులర్ చేశాయని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.  ప్రస్తుతం హెబ్బా  చేతిల్లో ఐదు సినిమాలు ఉన్నాయి. శాసన సభ మూవీలో ఐటెం సాంగ్ చేస్తోంది. వీటితో పాటు  30 వెడ్స్ 21 సిరీస్ ఫేమ్ అయినా చైతన్యరావు సరసన హనీమూన్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. బాల రాజశేఖర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా త్వరలో విడుదల కానుంది ఈ సినిమా నుంచి తొలి పాటను మేకర్స్ విడుదల చేశారు. ఇందులో లిప్ లాక్ సీన్స్ తో హెబ్బా రచ్చ రచ్చ చేసింది.

“నిజమా.. నిజమా.. ఇది కనులు కలగాలి సాధ్యమా”  అనే సాంగ్ లో హెబ్బాల లిప్ లాక్ సీన్స్ తో అదరగొట్టింది. ఈ పాటను కళ్యాణి మాలిక్ , సింగర్ సునీత  పాడారు. ఈ పాట మెలోడీగా ఉంటూనే రొమాంటిక్ గా ఉండి సంగీత ప్రియులను తెగ ఆకట్టుకుంటోంది. లిరికల్ సాంగ్ రిలీజ్ చేసినా ఇందులో చైతన్య, హెబ్బా మధ్య కొన్ని రొమాంటిక్ సీన్లను కూడా మేకర్స్ చూపించారు. రొమాంటిక్ సీన్స్ లో హెబ్బా.. అబ్బా అనేలా  సూపర్ గా నటించింది. జలపాతాలతోపాటు కాంప్ ఫైర్ వద్ద హీరోతో ముద్దు సీన్లలో ఘాటుగా హెబ్బా నటించింది.  ఈ అమ్మడు తన ఎక్స్ ప్రెషన్స్ తో మతిపోగొడుతుందని నెటిజన్లు చెబుతున్నారు. హెబ్బా హీరోయిన్‌గా మరోసారి గ్లామర్ పంట పడించిందని పలువురు అభిప్రాయ పడుతున్నారు. మరి.. ఈ సాంగ్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet giriş