iDreamPost
android-app
ios-app

చోటాకి హరీశ్ శంకర్ ఓపెన్ లెటర్.. చివర్లో పవర్ ఫుల్ వార్నింగ్!

Harish Shankar- Chota K Naidu: టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ హరీశ్ శంకర్.. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ చోటా కే నాయుడుకు ఓపెన్ లెటర్ రాశారు. ఆ లెటర్ లో వారి మధ్య జరుగుతున్న పరోక్ష యుద్ధం గురించి ప్రస్తావిస్తూనే.. ఇక్కడితో ఆపేయాలంటూ స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చారు.

Harish Shankar- Chota K Naidu: టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ హరీశ్ శంకర్.. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ చోటా కే నాయుడుకు ఓపెన్ లెటర్ రాశారు. ఆ లెటర్ లో వారి మధ్య జరుగుతున్న పరోక్ష యుద్ధం గురించి ప్రస్తావిస్తూనే.. ఇక్కడితో ఆపేయాలంటూ స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చారు.

చోటాకి హరీశ్ శంకర్ ఓపెన్ లెటర్.. చివర్లో పవర్ ఫుల్ వార్నింగ్!

టాలీవుడ్ సీనియర్ సినిమాటోగ్రాఫర్ చోటా కే నాయుడికి స్టార్ డైరెక్టర్ హరీశ్ శంకర్ రాసిన ఓపెన్ లెటర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తనని అసందర్భంగా ప్రస్తావించినా.. ఇకపై తన గురించి తక్కువ చేసి మాట్లాడినా ఊరుకునేది లేదు అనే అర్థం వచ్చేలా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. అలాగే ఆ లెటర్ లో ఆఖర్లో స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చారు. ఇకపై ఇదే కొనసాగితే.. కెలకాలి అనుకుంటే ఎనీ డే.. ఎనీ ప్లాట్ ఫామ్.. అయామ్ రెడీ అంటూ సినిమా స్టైల్ లో వార్నింగ్ కూడా ఇచ్చారు. ఈ లెటర్ వైరల్ కావడంతో అసలు వీళ్ల మధ్య గొడవేంటి? ఎందుకు ఇలా హరీశ్ శంకర్ ఓపెన్ గా లెటర్ రిలీజ్ చేశారు అంటూ ప్రశ్నిస్తున్నారు.

ఇటీవల చోటా కే నాయుడు ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఆ ఇంటర్వ్యూలో యాంకర్ హరీశ్ శంకర్ ప్రస్తావన తీసుకు రాకపోయినా చోటా కే నాయుడు రామయ్యా వస్తావయ్యా సినిమా గురించి ప్రస్తావిస్తూ కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆ సమయంలో హరీశ్ శంకర్ తన మాట వినేవాడు కాదని చెప్పుకొచ్చారు. తాను ఏదేదో చెప్తూ ఉండేవాడని.. తనకి ఎంత చెప్పినా వినకపోవడంతో.. కోపం వచ్చినా ఒక్క నిమిషం పాటు ఆలోచించి తను చెప్పిందే చేశానంటూ చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఈ విషయంపైనే హరీశ్ శంకర్ ఓపెన్ లెటర్ రాసుకొచ్చింది. తాను అనుకున్నది ముక్కు సూటిగా చెప్పే హరీశ్ శంకర్ ఈసారి గట్టిగానే రియాక్ట్ అయ్యాడు.

Harish vs chotaa

హరీశ్ శంకర్ లెటర్లో ఏం చెప్పాడంటే.. “వయసులో పెద్ద కాబట్టి.. గౌరవనీయులైన చోటా కే నాయుడు గారికి నమస్కరిస్తూ.. రామయ్యా వస్తావయ్యా చిత్రం వచ్చి దాదాపు దశాబ్దం దాటి పోయింది. ఈ పదేళ్లల్లో మీరు ఒక 10 ఇంటర్వ్యూలు ఇస్తే.. నేను ఒక 100 ఇచ్చి ఉంటాను. నేను ఎప్పుడూ నీ గురించి ఎక్కడా తప్పుగా మాట్లాడలేదు. కానీ, మీరు మాత్రం పలుమార్లు నా గురించి అవమానకరంగా మాట్లాడారు. మీకు గుర్తుందో లేదో.. ఒకానొక సందర్భంలో మిమ్మల్ని తీసేసి వేరే కెమెరామ్యాన్ తో షూటింగ్ చేద్దామని ప్రస్తావన వచ్చింది. కానీ రాజుగారు చెప్పడం మూలానో.. గబ్బర్ సింగ్ తర్వాత పొగరుతో పెద్ద కెమెరామ్యాన్ ని తీసేస్తున్నాడు అని పది మంది పలు రకాలుగా మాట్లాడతారు అని మథనపడుతూనే మీతో సినిమా పూర్తి చేశా.

ఆ సినిమా ఆశించిన విజయం సాధించకపోయినా ఏ రోజు ఆ నింద మీ మీద మోపలేదు. ఎందుకంటే గబ్బర్ సింగ్ వచ్చినప్పుడు నాది.. రామయ్యా వస్తావయ్యా వస్తే నీది అనే క్యారెక్టర్ కాదు నాది. మీరు మాత్రం ఇంటర్వ్యూ చేసే వ్యక్తి నా అడగకపోయినా, నా ప్రస్తావన రాకపోయినా, నాకు సంబంధం లేకున్నా, నా గురించి అవమానకరంగా మాట్లాడుతున్నారు. ఇలా చాలాసార్లు జరిగినా మౌనంగానే బాధ పడ్డాను. నా స్నేహితులు కావచ్చు, నన్ను అభిమానించే వాళ్లు కావచ్చు, నా ఆత్మ అభిమానాన్ని ప్రశ్నిస్తుండటంతో ఈ మాత్రం రాయాల్సి వచ్చింది. మీతో పని చేసిన అనుభవం నన్ను బాధ పెట్టినా.. మీ అనుభవంతో నేను కొన్ని విషయాలు నేర్చుకున్నాను. అందుకే మీరంటే నాకు ఇంకా గౌరవం ఉంది. దయచేసి ఆ గౌరవాన్ని కాపాడుకోండి. ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేయండి. కాదు కూడదు కెలుక్కుంటాను అంటే.. ఎనీ డే, ఎనీ ప్లాట్ ఫామ్, అయామ్ వెయిటింగ్” అంటూ హరీశ్ శంకర్ రాసుకొచ్చాడు.