iDreamPost
android-app
ios-app

హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌లో హారిక ఈమెనే..!

  • Published Oct 10, 2023 | 4:35 PM Updated Updated Oct 10, 2023 | 4:35 PM
  • Published Oct 10, 2023 | 4:35 PMUpdated Oct 10, 2023 | 4:35 PM
హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌లో హారిక ఈమెనే..!

ఏ రంగంలో లేని వారసత్వం సినిమా రంగానికి మాత్రమే సొంతం. సినీ హీరోలు, ఇతర టెక్నీషియన్ల పిల్లలు కూడా ఇదే ఇండస్ట్రీలో కొనసాగుతుండటం పరిపాటిగా వస్తుంది. అయితే ఒక్కొక్కరు ఒక్కో క్రాఫ్ట్‌లో రాణిస్తున్నారు. తెలుగు ఇండస్ట్రీలో సక్సెస్ ఫుల్‌గా సినిమాలు నిర్మిస్తున్న నిర్మాణ సంస్థలు అనేకం ఉన్నాయి. సురేష్ ప్రొడక్షన్, గీతా ఆర్ట్స్, మైత్రి మూవీ మేకర్స్, శ్రీ వెంకటేశ్వర సినీ క్రియేషన్స్, కొణిదెల ప్రొడక్షన్, హారిక అండ్ హాసిని, సితార ఎంటర్ టైన్ మెంట్ ఈ కోవకు చెందినవే. వీటిలో హారిక అండ్ హాసిని క్రియేషన్స్‌కు ఓ ప్రత్యేకత ఉంది. ఎక్కువగా ప్రముఖ దర్శకుడు త్రివ్రికమ్ శ్రీనివాస్ సినిమాలకు భాగస్వామ్యం అవుతూ ఉంటుంది ఈ నిర్మాణ సంస్థ.

ఈ ప్రొడక్షన్ హౌస్ అధినేత రాధా కృష్ణ. ఈ పేరు కన్నా చినబాబుగానే ఆయనకు ఇండస్ట్రీలో మంచి గుర్తింపు ఉంది.  అయితే ప్రతి బ్యానర్ వెనుక ఓ కథా కమామీషు ఉన్నట్లే.. హారిక అండ్ హాసినికి కూడా ఉంది. ఈ బ్యానర్‌లో హారిక ఎవరో అన్న విషయం తాజాగా బయటకు వచ్చింది. ఇంతకు ఆ హారిక ఎవరో కాదూ.. చినబాబు పెద్ద కుమార్తె. జూనియర్ ఎన్టీఆర్ బావ మరిది నార్నే నితిన్, సంగీత్ శోభన్, రాం నితిన్ మ్యాడ్ మూవీతో నిర్మాతగా మారింది ఆమె. సితార ఎంటర్ టైన్ మెంట్ అధినేత సూర్య దేవర నాగవంశీ ఆమెకు అన్నయ్య. ఈ సినిమా హ్యుమరస్ హిట్ కొట్టడంతో.. తొలిసారిగా మీడియా ముందు మాట్లాడింది హారిక.

 తొలిసారి మైకు పట్టుకున్న సమయంలో అందరిలానే బెరుకుగా మాట్లాడింది. ఈ సందర్భంగా సినిమా హిట్ చేసినందుకు సంతోషంగా ఉన్నానని మాట్లాడింది. అదే సమయంలో అన్నయ్య నాగవంశీ మరింత సపోర్టు ఇవ్వడంతో.. కాస్త బిడియంగానే తన స్పీచ్ ను ముగించేసింది. తనకు మద్దుతుగా నిలిచిన తండ్రికి, అన్నకు ధన్యవాదాలు తెలిపింది. హాసినికి నిర్మాతగా తనకు ఇదే మొదటి సినిమా. తండ్రి, అన్నయ్య ఉన్నారన్న ధైర్యంతో నిర్మాతగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ అమ్మాయి.. హీరోయిన్లకు తీసిపోని అందంతో ఆకట్టుకుంటోంది. మరీ ఫ్యూచర్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తుందా లేక నిర్మాతగా కొనసాగుతుందో వేచి చూద్దాం. ప్రస్తుతం హారిక, హాసిని బ్యానర్ పై గుంటూరు కారం తెరకెక్కుతున్న సంగతి విదితమే.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobet güncel girişgrandpashabetcasinolevantcasibomiptv satın alCasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişjojobet girişCasibom