Prashanth Varma: ప్రశాంత్ వర్మ.. ఇండియన్ సినిమాకి దొరికిన మరో రాజమౌళి!

ప్రశాంత్ వర్మ: ది మోస్ట్ అండర్ రేటెడ్ డైరెక్టర్.. భారీ బడ్జెట్, బడా స్టార్ దొరకడమే లేటు.. దొరికితే ఉంటాది.. సినీ జాతరే. చూడ్డానికి మామూలుగా ఉన్నా లోపల ఒక లావాని దాచిపెట్టుకున్న ఒక పెద్ద అగ్నిపర్వతం ప్రశాంత్ వర్మ. ఒక్కసారి బయటకొస్తే రచ్చే.

ప్రశాంత్ వర్మ: ది మోస్ట్ అండర్ రేటెడ్ డైరెక్టర్.. భారీ బడ్జెట్, బడా స్టార్ దొరకడమే లేటు.. దొరికితే ఉంటాది.. సినీ జాతరే. చూడ్డానికి మామూలుగా ఉన్నా లోపల ఒక లావాని దాచిపెట్టుకున్న ఒక పెద్ద అగ్నిపర్వతం ప్రశాంత్ వర్మ. ఒక్కసారి బయటకొస్తే రచ్చే.

ప్రశాంత్ వర్మ.. నిజానికి ఒక అండర్ రేటెడ్ డైరెక్టర్. రాజమౌళిలా ఇంత పెద్ద టాలెంట్ పెట్టుకుని ఒక చిన్న డైరెక్టర్ గా ఉండిపోతున్నారేమో అనిపిస్తుంది. మొదటి సినిమా నుంచి చూస్తే ప్రశాంత్ వర్మ టాలెంట్ ఏంటో అర్థమవుతుంది. అ! మూవీతో ఒక్కసారిగా అందరినీ విస్మయానికి గురి చేశాడు. ఆ తర్వాత కల్కితో కమర్షియల్ బాట పట్టిన ప్రశాంత్.. జాంబీ రెడ్డి సినిమాతో డీసెంట్ హిట్ అందుకున్నాడు.చిన్న సినిమాలతోనే అద్భుతాలు క్రియేట్ చేస్తున్నదీ యంగ్ డైరెక్టర్. తక్కువ బడ్జెట్ లో.. చిన్న ఆర్టిస్టులతో వండర్స్ క్రియేట్ చేస్తున్నాడు. ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్ గా చూసిన తేజని జాంబీ రెడ్డి మూవీతో హీరోని చేశాడు. ఇప్పుడు హనుమాన్ సినిమాతో సూపర్ హీరోని చేశాడు. ఇదే ప్రశాంత్ వర్మ చేతిలో స్టార్ హీరో పడితే.. ఆ హీరో యూనివర్సల్ హీరో అయిపోడా? ఇదే ప్రశాంత్ వర్మకి భారీ బడ్జెట్ ఇస్తే హాలీవుడ్ కి, టాలీవుడ్ కి మధ్య ఉన్న చిన్న గీత చెరిగిపోదా? ప్రశాంత్ కి ఒక భారీ బడ్జెట్, స్టార్ హీరో దొరికితే ఇండస్ట్రీలో మరో రాజమౌళి అవ్వడా? రాజమౌళిలా అద్భుతాలు సృష్టించలేడా? అసలు ప్రశాంత్ వర్మకి భారీ బడ్జెట్, బడా స్టార్ క్యాస్ట్ ఇవ్వడానికి ఉన్న అర్హతలు ఏంటి అనేది ఇప్పుడు పరిశీలిద్దాం. 

కంటెంట్:

ప్రశాంత్ వర్మ తీసింది నాలుగు సినిమాలే కదా.. అందులో ఒకటి హనుమాన్ ఇప్పుడే కదా రిలీజ్ అయ్యింది. అంత తోపా అని అనుకోవడానికి ఏముంది అని అనుకుంటే పొరపాటే. హనుమంతుడికి తన శక్తి తనకు ఎలా తెలియదో.. ప్రశాంత్ వర్మ శక్తి ఏంటో మనకి తెలియదు. అవును ప్రశాంత్ వర్మ బుర్ర చిన్నదేం కాదు. మొదటి సినిమాతోనే ఔరా అనిపించాడు. అసలు ఒక కథని ఇలా కూడా తీయొచ్చా అని అబ్బురపరిచాడు. సరే కల్కితో ఒక అడుగు వెనక్కి వేసి ఉండవచ్చు. కానీ ఎప్పుడైతే హనుమాన్ సినిమాని తీయాలని పూనుకున్నాడో అప్పుడే వందడుగులు ముందుకేశాడు ప్రశాంత్ వర్మ. హనుమాన్ సినిమాకి ఇవాళ ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. కంటెంట్ తో పాటు అక్కడున్న విజువల్ వండర్ కి మంత్రముగ్ధులైపోతున్నారు. ముఖ్యంగా లాస్ట్ 20 నిమిషాలు రోమాలు నిక్కబొడుచుకునే విధంగా హనుమాన్ పతాక సన్నివేశాన్ని చిత్రీకరించాడని ప్రశంసలు దక్కుతున్నాయి. ఇది ప్రశాంత్ వర్మకి కంటెంట్ పరంగా ఉన్న ఒక అర్హత. ఇది చాలదా.. ప్రశాంత్ వర్మ ఏంటో చెప్పడానికి. ఇది చాలదా.. కంటెంటే అల్టిమేట్ గా కాలర్ ఎగరేస్తుంది అని చెప్పడానికి. 

క్వాలిటీలో కాంప్రమైజ్ కాకపోవడం:

ఏ రంగంలో అయినా క్వాలిటీ మేటర్స్. క్వాలిటీయే మాట్లాడుతుంది. ప్రశాంత్ వర్మకి 10 కోట్లు ఇచ్చి సినిమా తీయమన్నా.. 100 కోట్లు ఇచ్చి సినిమా తీయమన్నా గానీ రెండు సినిమాలకి ఒకే విధంగా పని చేస్తాడు. ఉన్న దాంట్లో ఎంత బాగా ప్రెజెంట్ చేయచ్చు అనేది ప్రశాంత్ వర్మలో అతి పెద్ద క్వాలిటీ. ఇక అవుట్ పుట్ క్వాలిటీలో కాంప్రమైజ్ కాకపోవడం అనేది అతని సినీ డీఎన్ఏలోనే లేదని అతని మూవీ లైబ్రరీ చూస్తేనే తెలుస్తుంది. ఈ విషయం తాజాగా హనుమాన్ తో మరోసారి ప్రూవ్ అయ్యింది. ఎక్కడ హనుమాన్ సినిమా.. ఎక్కడ 50 కోట్ల బడ్జెట్. ఏమైనా సంబంధం ఉందా? 50 కోట్ల బడ్జెట్ లో 500 కోట్ల బడ్జెట్ సినిమాకి సరితూగే సినిమా తీయడం సాధ్యమేనా? కానీ ప్రశాంత్ వర్మ అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించాడు. 50 కోట్లకి ఈరోజుల్లో ఏమొస్తుంది? ఒక భారీ సినిమాలో పాట ఖర్చు అది. కానీ ఆ బడ్జెట్ లోనే హనుమాన్ వంటి విజువల్ వండర్ తీసి ఔరా అనిపించాడు.

మీకో విషయం తెలుసో లేదో..  హనుమాన్ మూవీ బడ్జెట్ ఆదిపురుష్ బడ్జెట్ లో 10 శాతం మాత్రమే. ‘ఆదిపురుష్ బడ్జెట్ 500 కోట్లు పైనే. చివరికి అది మిగిల్చింది పెయినే’. ఇదే బడ్జెట్ ప్రశాంత్ వర్మకిస్తే హాలీవుడ్ రేంజ్ లో గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్ పెట్టి హైలీ అప్రిషియేటెడ్ మూవీ తీస్తాడు. ఈ 10 శాతం బడ్జెట్ తోనే ప్రశాంత్ వర్మ ఇంత మ్యాజిక్ చేస్తే.. ఒక్కసారి 500 కోట్లు బడ్జెట్ ఇస్తే సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో ఊహించుకోవడం కూడా కష్టమే. ఎందుకంటే ప్రశాంత్ వర్మ ఊహలు ఎక్స్ ట్రీమ్. రాజీ పడకపోవడం, ఉన్న దాంట్లో అద్భుతాలు సృష్టించడం తెలిసిన ప్రశాంత్ వర్మ ఒక్కసారి గీత దాటితే ప్రభంజనమే. ఇది చాలదా ప్రశాంత్ వర్మ వర్త్ అని చెప్పడానికి. 

క్రియేటివ్ జీనియస్:

ప్రశాంత్ వర్మ బుర్రలో హాలీవుడ్ రేంజ్ స్టఫ్ ఉందని మూవీ హిస్టరీ చూస్తేనే తెలుస్తుంది. ఆ విషయాన్ని హనుమాన్ సినిమా చెప్పకనే చెబుతుంది. రాజమౌళి తర్వాత ఆ రేంజ్ విజన్ ఉన్న దర్శకుడిగా ప్రశాంత్ వర్మ మార్కులు కొట్టేశాడు. మహాభారతం సినిమా తీద్దామనుకున్నా అని అన్నప్పుడే ప్రశాంత్ వర్మ గట్స్ ఏంటో అర్థం చేసుకోవాలి. ఎప్పుడైతే రాజమౌళి తానే మహాభారతం తీద్దామనుకుంటున్నా అని చెప్పారో అప్పుడే ప్రశాంత్ వర్మ డ్రాప్ అయ్యాడు. మహాభారతం సినిమా తీయాలంటే ఎంత విజన్ ఉండాలి. ఆ రేంజ్ విజన్ లేకపోతే ప్రశాంత్ వర్మ.. తన డ్రీమ్ మాహాభారతం అని ఎలా చెబుతాడు. కాబట్టి ఈ విషయంలో ప్రశాంత్ వర్మ బడా స్టార్స్ తో భారీ బడ్జెట్ సినిమా తీసే అర్హతను సంపాదించేసుకున్నాడు. 

భారీ బడ్జెట్, బడా స్టార్ దొరకడమే లేటు:

స్టార్ కానటువంటి తేజతో హనుమాన్ అనే సూపర్ హీరో మూవీ చేసి వావ్ అనిపించాడు. తనకు ఇచ్చిన తక్కువ బడ్జెట్ లో వండర్స్ క్రియేట్ చేశాడు. ఈరోజు హనుమాన్ పాన్ వరల్డ్ మూవీగా విడుదలైంది. అన్ని వైపుల నుంచి ఈ సినిమాకి పాజిటివ్ టాక్ వస్తుంది. మరోసారి తెలుగు సినిమా సత్తా చాటే సినిమా అవుతుందని అంటున్నారు. మరి ఇలాంటి సినిమా తీసిన ఇంత టాలెంటెడ్ డైరెక్టర్ కి భారీ బడ్జెట్, స్టార్ హీరో దొరకడమే ఆలస్యం.. వన్స్ దొరికితే మాత్రం ర్యాంపే. అవతార్ కంటే గొప్ప సినిమా చేస్తా అని ప్రశాంత్ వర్మ అంత కాన్ఫిడెంట్ గా చెప్పాడంటే.. అతనికి ఆ బాట వేయాల్సిన అవసరం సినీ పరిశ్రమకు ఎంతైనా ఉంది. అప్పుడే తెలుగు సినిమా స్థాయి మరింత పెరుగుతుంది. అప్పుడే హాలీవుడ్, టాలీవుడ్ మధ్య ఉన్న గీత పూర్తిగా చెరిగిపోతుంది. హనుమాన్ తో ఇప్పటికే మరో రాజమౌళి దొరికాడని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. రాజమౌళికి దొరికినట్టు బడ్జెట్, స్టార్ క్యాస్ట్ దొరికితే ప్రశాంత్ వర్మకు తిరుగుండదు. ఇండస్ట్రీకి.. కాదు కాదు ఇండియన్ సినిమాకి మరో రాజమౌళి దొరికినట్టే. మరి ఈ విషయంలో మీరేమంటారు?

Show comments