iDreamPost
android-app
ios-app

అప్పుడు RRR.. ఇప్పుడు గుంటూరు కారం.. కుర్చీ మడత పెట్టి కొట్టడమే ఇక!

Kurchi Madathapetti Song: గుంటూరు కారం సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయి. త్రివిక్రమ్- మహేశ్ కాంబోలో వస్తున్న మూడో చిత్రానికి తెలుగు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది.

Kurchi Madathapetti Song: గుంటూరు కారం సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయి. త్రివిక్రమ్- మహేశ్ కాంబోలో వస్తున్న మూడో చిత్రానికి తెలుగు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది.

అప్పుడు RRR.. ఇప్పుడు గుంటూరు కారం.. కుర్చీ మడత పెట్టి కొట్టడమే ఇక!

ఒక్క టాలీవుడ్ అనే కాదు.. బాలీవుడ్ అయినా కోలీవుడ్ అయినా ఒక్కోసారి సినిమాకి ఎంతో నెగిటివిటీ వస్తుంది. ఎంత స్టార్ హీరో చిత్రమైనా కూడా కొన్నిసార్లు బ్యాక్ ఫైర్ అవుతూ ఉంటాయి. పోస్టర్, టీజర్, గ్లింప్స్ ఇలా ఎన్ని వచ్చినా కూడా అవన్నీ ప్రేక్షకుల్లో అంచనాలను పెంచకపోగా.. నెగిటివిటీనే పెంచుతుంటాయి. అలాంటి సమయంలో సినిమా టీమ్ ఒక మ్యాజిక్ చేస్తూ ఉంటుంది. అది ఎలాంటి మ్యాజిక్ అంటే ఒక్క సాంగ్ తో మొత్తం సినిమాపై వచ్చిన టాక్ నే మార్చేస్తుంటాయి. అలాంటి ఒక పరిస్థితి ఇప్పుడు గుంటూరు కారం సినిమా విషయంలో కనిపిస్తోంది. ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా ‘కుర్చీ మడతపెట్టి’ సాంగ్ సినిమా రేంజ్ నే మార్చేస్తోంది.

సాధారణంగా ఒక సినిమా వస్తోందంటే.. మెచ్చుకునే వారు ఎలా ఉంటారో.. ట్రోల్ చేసే వాళ్లు కూడా అలాగే ఉంటారు. అలా చిన్న హీరోల మూవీస్ మాత్రమే కాదు.. బడా బడా హీరోల చిత్రాలు కూడా ట్రోల్ అయిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఆ లిస్ట్ లో ఆర్ఆర్ఆర్, ఆదిపురుష్, సలార్ వంటి చిత్రాలు కూడా ఉన్నాయి. ఈ చిత్రాల విషయంలో కూడా సినిమా యూనిట్ ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా నెట్టింట మాత్రం ఫుల్ ట్రోలింగ్ నడిచేది. కానీ, ఒక్క పాట ఆ మొత్తం సినారియోని మార్చేసింది. ట్రిపులార్ చిత్రం సమయంలో సినిమాపై అంచనాలు, క్రేజ్ ఉన్నా కూడా బాహుబలి స్థాయి రెస్పాన్స్ అయితే రాలేదు.

ఎప్పుడైతే నాటు నాటు పాట విడుదలైందో.. కథ మొత్తం మారిపోయింది. అందరూ ట్రిపులార్ గురించే మాట్లాడటం మొదలు పెట్టారు. ఎక్కడ చూసినా ఈ నాటు నాటు పాటే కనిపించేది. సెలబ్రిటీలు, ఇన్ ఫ్లుఎన్సర్స్, మీమర్స్ అంతా ఈ పాటకు స్టెప్పులేస్తూ ఇరగదీసేశారు. ఒక్కసారిగా సినిమాపై క్రేజ్ పెరిగిపోవడం మాత్రమే కాదు.. ఆ పాటే ఆస్కార్ కూడా తెచ్చిపెట్టింది. ఆ తర్వాత ఆదిపురుష్ మూవీకైతే మొదట్లో భారీ అంచనాలు ఉన్నాయి. కానీ, టీజర్ చూసిన తర్వాత అంతా తలకిందులు అయ్యింది. అభిమానులు కూడా ఆగ్రహం వ్యక్తం చేసే పరిస్థితి వచ్చింది. కానీ, ఎప్పుడైతే జై శ్రీరామ్ సాంగ్ వచ్చిందో మళ్లీ మూవీపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. మొత్తం పాజిటివిటీ వచ్చేసింది.

రీసెంట్ బ్లాక్ బస్టర్ సలార్ పరిస్థితి కూడా అదే. ఎందుకో మూవీకి సరైన్ రెస్పాన్స్ రాలేదు. ఏముంది కేజీఎఫ్ లాగే ఉందిగా అంటూ చాలామంది లైట్ తీసుకున్నారు. కానీ, సూరీడే గొడుగు పట్టి సాంగ్ విడుదలవ్వగానే ఈ మూవీలో ఏదో మ్యాజిక్ ఉందని అందరూ నమ్మారు. ప్రభాస్- పృథ్వీరాజ్ ఫ్రెండ్ షిప్ కి ఆడియన్స్ మెస్మరైజ్ అయిపోయారు. అందుకు నిదర్శనం ఇప్పుడు వస్తున్న కలెక్షన్స్ చూస్తే చెప్పేయచ్చు. ఇప్పుడు ఇదే సీన్ గుంటూరు కారం సినిమా విషయంలో నిజమవుతోంది. గుంటూరు కారం పోస్టర్, సాంగ్స్ ఆడియన్స్ కి బాగా నచ్చేసినా కూడా.. ప్రేక్షకులు, నెటిజన్స్ మాత్రం ట్రోలింగ్ చేయడం చూశాం. కానీ, ఎప్పుడైతే కుర్చీని మడతపెట్టి సాంగ్ వచ్చిందో.. ఆ తర్వాత అందరూ గుంటూరు కారం సినిమా ఫ్యాన్స్ అయిపోయారు. అంతేకాకుండా సినిమాకి కూడా పాజిటివీటి పెరిగిపోయింది. ఇప్పుడు ఫ్యాన్స్ మాత్రమే కాకుండా.. మిగిలిన ప్రేక్షకులు కూడా ఈ మూవీ కోసం ఎదురచూస్తున్నారు. ఇంకేముంది.. సంక్రాంతికి థియేటర్లలో కుర్చీని మడతపెట్టి కొట్టడమే మిగిలుంది.