Nidhan
Shankar: ఏస్ డైరెక్టర్ శంకర్ తీసిన ‘భారతీయుడు 2’ చిత్రం ఇటీవలే ఆడియెన్స్ ముందుకు వచ్చింది. దీంతో ఇప్పుడు కంప్లీట్ ఫోకస్‌ను ‘గేమ్ ఛేంజర్’ వైఫు షిఫ్ట్ చేస్తున్నారాయన.
Shankar: ఏస్ డైరెక్టర్ శంకర్ తీసిన ‘భారతీయుడు 2’ చిత్రం ఇటీవలే ఆడియెన్స్ ముందుకు వచ్చింది. దీంతో ఇప్పుడు కంప్లీట్ ఫోకస్‌ను ‘గేమ్ ఛేంజర్’ వైఫు షిఫ్ట్ చేస్తున్నారాయన.
Nidhan
శంకర్.. ఇండియన్ సినిమాలో ఎప్పటికీ గుర్తుండిపోయే పేర్లలో ఒకటి. ఎన్నో బ్లాక్‌బస్టర్స్‌తో పాన్ ఇండియా రేంజ్లో ఆడియెన్స్‌ను ఆయన అలరించారు. ‘భారతీయుడు’, ‘జెంటిల్మన్’, ‘అపరిచితుడు’, ‘బాయ్స్’, ‘శివాజీ’, ‘రోబో’ లాంటి అద్భుతమైన సినిమాలతో ప్రేక్షకుల మనసుల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు. దాదాపుగా ఆయన తీసిన మూవీస్ అన్నీ విజువల్ వండర్సే. మ్యూజిక్, సినిమాటోగ్రఫీ, గ్రాఫిక్స్.. ఇలా అన్నింటి పరంగా శంకర్ తన ఫిల్మ్స్‌తో ఆడియెన్స్‌కు కొత్త ఎక్స్‌పీరియెన్స్ ఇస్తారు. అయితే ఎన్నో ఏళ్ల పాటు టాప్ డైరెక్టర్‌గా కొనసాగిన ఆయన ఈ మధ్య కాస్త డల్ అయ్యారు. తన రేంజ్‌కు తగ్గట్లుగా హిట్లు అందుకోలేకపోతున్నారు. ఇటీవల రిలీజైన ‘భారతీయుడు 2’ కూడా అభిమానుల అంచనాలను అందుకోలేకపోయింది.
కల్ట్ క్లాసిక్ లాంటి ‘భారతీయుడు’కు సీక్వెల్‌గా తెరకెక్కిన ‘భారతీయుడు 2’తో శంకర్ స్ట్రాంగ్‌గా కమ్‌బ్యాక్ ఇస్తారని ఫ్యాన్స్ భావించారు. కానీ ఆయన మ్యాజిక్‌ను రిపీట్ చేయలేకపోయారు. ఈ సినిమా ఫస్ట్ డే మార్నింగ్ షో నుంచే డివైడ్ టాక్ తెచ్చుకుంది. కథ, కథనం బాగోకపోవడం, బోరింగ్‌గా ఉండటంతో ‘భారతీయుడు 2’ బాక్సాఫీస్ వద్ద అనుకున్న స్థాయిలో దండయాత్ర చేయలేకపోయింది. దీంతో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు. ‘భారతీయుడు 2’ ఎఫెక్ట్ ‘గేమ్ ఛేంజర్’ మీద ఉంటుందేమోనని ఆందోళన చెందుతున్నారు. అయితే టెన్షన్ పడాల్సిన అవసరం లేదని అంటున్నారు ఏస్ డైరెక్టర్ శంకర్.
‘గేమ్ ఛేంజర్’ ఎలా ఉండబోతోందో హింట్ ఇచ్చారు శంకర్. చరణ్ చిత్రం కోసం చాలా కష్టపడ్డానని అన్నారు. ఇది కంప్లీట్ మాస్ మూవీ అని తెలిపారు. మాస్ ఫిల్మ్ అయినా చాలా ఎంటర్టైనింగ్గా ఉంటుందని చెప్పారు. ‘గేమ్ ఛేంజర్ పక్కా మాస్ ఫిల్మ్. ఇందులో నా స్టైల్ కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. ఇది చాలా ఎంటర్టైనింగ్గా సాగిపోయే చిత్రం. ఈ మూవీ కోసం ఎంతగానో కష్టపడ్డా’ అని శంకర్ చెప్పుకొచ్చారు. ‘గేమ్ ఛేంజర్’ పక్కా మాస్ ఫిల్మ్ అంటూ శంకర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఇది చూసిన నెటిజన్స్.. చెర్రీ ఫ్యాన్స్‌కు మాస్ ట్రీట్ కన్ఫర్మ్ అని అంటున్నారు. ‘గేమ్ ఛేంజర్’కు ఎదురుండదని చెబుతున్నారు. మరి.. ‘గేమ్ ఛేంజర్’ కోసం ఎంతో శ్రమించానంటూ శంకర్ చేసిన వ్యాఖ్యలపై మీ ఒపీనియన్‌ను కామెంట్ చేయండి.