iDreamPost
android-app
ios-app

రాయన్ ట్రైలర్ రిలీజ్.. బ్రహ్మ రాక్షసుడిలా వస్తున్న ధనుష్!

  • Published Jul 16, 2024 | 8:51 PM Updated Updated Jul 16, 2024 | 8:51 PM

Dhanush Raayan Trailer Review In Telugu: ధనుష్ తన కెరీర్లో ఒక మైలురాయిని చేరుకోబోతున్నాడు. ధనుష్ 50వ చిత్రంలో మరికొన్ని రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పుడు ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు. మరి.. ఆ ట్రైలర్ ఎలా ఉందో చూద్దాం.

Dhanush Raayan Trailer Review In Telugu: ధనుష్ తన కెరీర్లో ఒక మైలురాయిని చేరుకోబోతున్నాడు. ధనుష్ 50వ చిత్రంలో మరికొన్ని రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పుడు ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు. మరి.. ఆ ట్రైలర్ ఎలా ఉందో చూద్దాం.

  • Published Jul 16, 2024 | 8:51 PMUpdated Jul 16, 2024 | 8:51 PM
రాయన్ ట్రైలర్ రిలీజ్.. బ్రహ్మ రాక్షసుడిలా వస్తున్న ధనుష్!

పాన్ ఇండియా లెవల్లో ఉన్న రేర్ యాక్టర్స్ లో ధనుష్ కూడా ఒకడు. తన కెరీర్లో ఒక మైలు రాయిని దాటబోతున్నాడు. ధనుష్ కెరీర్లో 50వ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాకి కథ, డైరెక్షన్ రెండూ హీరో ధనుష్ కావడం విశేషం. అలాగే ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. ఈ సినిమాకి ఏఆర్ రెహ్మాన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీలో సందీప్ కిషన్ కూడా కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఎందుకంటే రాయన్ లుక్ రిలీజ్ చేసినప్పటి నుంచే ఈ మూవీపై ఎన్నో ఊహాగానాలు ఉన్నాయి. పైగా ధనుష్ 50 కావడంతో ఇంకాస్త స్పెషల్ ఇంట్రెస్ట్ క్రియేట్ అయ్యింది. ఇప్పుడు ఈ ట్రైలర్ చూసిన తర్వాత ఆ ఇంట్రెస్ట్ రెట్టింపు అవుతుంది అనడంలో ఎలాంట సందేహం లేదు.

ధనుష్ రాయన్ రూపంలో మరో పాన్ ఇండియా మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ మూవీలో ధనుష్, ప్రకాశ్ రాజ్, ఎస్ జే సూర్య, సందీప్ కిషన్, సెల్వ రాఘవన్, అపర్ణా బాలమురళి, వరలక్ష్మి శరత్ కుమార్ వంటి స్టార్స్ కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు. అలాగే ఇందులో ధనుష్ లుక్స్ గురించి మాట్లాడుకోవాలి. ఎప్పుడూ గుండుతోనే కనిపిస్తున్నాడు. అలాగే చాలా వైలెంట్ గా కూడా ఉన్నాడు. ఈ ట్రైలర్ ని ఒక ఆటవిక సత్యంతో ఓపెన్ చేశారు. సెల్వరాఘవన్.. రాయన్ తో ఇలా చెప్తూ ఉంటాడు. అడవిలో సింహం, పులి నిజంగానే బలమైన జంతువులు. కానీ, వాటికంటే ఒక జంతువు మాత్రం చాలా ప్రమాదకారి అంటాడు. అది మరేదో కాదు తోడేలు. నేరుగా పోరాడితే సింహమే గెలుస్తుంది. కానీ, తోడేలు జిత్తుల మారిది గుంపుగా.. మాటేసి కొడుతుందని చెప్తాడు.

అంటే ఈ మూవీకి సంబంధించిన కొంత కథని ఈ పాయింట్ లోనే చెప్పేశారు. ఈ సమాజంలో ఎలా ఉండాలి.. ఎలా ఉండకూడదు అనే విషయాలను చెప్పు కొచ్చాడు. అలాగే సెల్వ రాఘవన్ ని ఒకరు బంధిస్తే.. అతడిని విడిపించేందుకు రాయన్ వస్తాడు. ఆ యాక్షన్ సీక్వెన్స్ ఎలివేషన్స్ అద్భుతంగా ఉన్నాయి. తప్పకుండా వస్తాడు.. ఒక బ్రహ్మ రాక్షసుడిలా వస్తాడు అనే డైలాగ్ కు ఫ్యాన్స్ కు గూస్ బంప్స్ వస్తాయి. మొత్తానికి ఈ సినిమా గ్యాంగ్ వార్, ఆధిపత్య పోరు అనే యాంగిల్ లో చూపిస్తున్నారు.

రాయన్ మాత్రం చాలా ప్రమాదకారి అనే విషయంపై క్లారిటీ ఉంది. ఇంక ఈ సినిమాలో కూడా సందీప్ కిషన్ సపోర్టింగ్ రోల్ చేస్తున్నాడు. ఇప్పటికే ధనుష్ తో కలిసి పని చేసిన అనుభవం సందీప్ కిషన్ కు ఉంది. కెప్టెన్ మిల్లర్ మూవీలో కూడా ఒక సపోర్టింగ్ రోల్ లో సందీప్ కిషన్ కనిపించాడు. ఈ మూవీలో కూడా ఫిరోషియస్ పాత్రలోనే కనిపించబోతున్నట్లు అనిపిస్తోంది. ఇంక ప్రస్తుతం ఈ సినిమా ట్రైలర్ యూట్యూబ్ లో ట్రెండ్ అవుతోంది. జులై 26న వరల్డ్ వైడ్ గా రాయన్ ని రిలీజ్ చేయబోతున్న విషయం తెలిసిందే. మరి.. మీకు ఈ రాయన్ ట్రైలర్ ఎలా అనిపించింగో కామెంట్ చేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetJojobetJojobetMadridbetMadridbetMadridbetjojobetcratosroyalbetbetgarantigrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom