iDreamPost
android-app
ios-app

తమన్ ఏ సినిమా చేసినా తప్పని ఆడియో లీక్స్.. ఏంటిది?

  • Author ajaykrishna Updated - 04:21 PM, Sat - 16 September 23
  • Author ajaykrishna Updated - 04:21 PM, Sat - 16 September 23
తమన్ ఏ సినిమా చేసినా తప్పని ఆడియో లీక్స్.. ఏంటిది?

పాన్ ఇండియా సినిమాలు రూపొందించే క్రమంలో మేకర్స్.. లీక్స్ విషయంలో ఎంత జాగ్రత్త వహించాల్సి ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పుడున్న టెక్నాలజీకి సినిమాలు ఎక్కడ షూటింగ్ జరుపుకుంటున్నా.. లీక్స్ బెడద తప్పడం లేదు. అది చిన్న సినిమా అయినా.. పెద్ద సినిమా అయినా.. కంటెంట్ బయటికి వస్తే మేకర్స్ కష్టమంతా వృధా అయిన ఫీలింగ్ రాకపోలేదు. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఎక్కువగా లీక్స్ బారిన పడుతున్న సినిమా ఏదైనా ఉందంటే.. అది గేమ్ చేంజర్ అనే చెప్పాలి. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా.. దిల్ రాజు నిర్మాణంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోంది.

కాగా.. తాజాగా గేమ్ చేంజర్ నుండి ఓ మాస్ సాంగ్ ఆడియో లీక్ అయినట్లు సమాచారం. ప్రస్తుతం ఈ సాంగ్ లీక్ విషయం సోషల్ మీడియాలో, ఇండస్ట్రీ వర్గాలలో ఫుల్ వైరల్ అవుతోంది. సరే.. లీక్ అయ్యింది సాంగ్ లో క్లిప్ అయితే వేరు అనుకోవచ్చు.. కానీ, ఫుల్ సాంగ్ హై క్వాలిటీ ఆడియో బయటికి వచ్చిందని అంటున్నారు. ఇప్పటికే మూవీ టీమ్ అలెర్ట్ అయి.. డిలీట్ చేయిస్తున్నప్పటికీ.. విషయం ఆల్రెడీ చాలా దూరం వెళ్ళిపోయింది. ముఖ్యంగా ట్విట్టర్ లో సాంగ్ లీక్ విషయం హోరెత్తిపోతుంది. మొదట ఈ సాంగ్ గుంటూరు కారం మూవీది అని అన్నారు.. కానీ, తర్వాత గేమ్ చేంజర్ లోది అని టాక్ వచ్చింది. ఓ పాన్ ఇండియా మూవీ విషయంలో ఇలాంటి పొరపాటు జరగడం షాక్ కలిగిస్తుంది.

ఇదిలా ఉండగా.. గేమ్ చేంజర్ ఆడియో లీక్ తో మరోసారి అందరి దృష్టి మ్యూజిక్ డైరెక్టర్ తమన్ పై పడింది. ఈ మధ్యకాలంలో తమన్ ఏ సినిమా చేసినా.. ఆడియో లీక్స్ కామన్ అన్నట్లుగా పరిస్థితి మారిందని అంటున్నారు. ఎందుకంటే.. గతంలో తమన్ మ్యూజిక్ అందించిన సర్కారు వారి పాట, గాడ్ ఫాదర్ మూవీస్ నుండి చాలా లీక్స్ జరిగాయి. ఆ తర్వాత ఇప్పుడు గేమ్ చేంజర్ లీక్స్ చర్చనీయంశంగా మారింది. తమన్ ఏ సినిమా చేసినా.. ఆయా సినిమాలను లీక్స్ వెంటాడుతున్నాయి. దీనిపై ప్రస్తుతం మెగా ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. ఎందుకంటే.. డైరెక్టర్ శంకర్ గేమ్ చేంజర్ నుండి ఇప్పటిదాకా ఏ ఒక్క బిగ్ అప్డేట్ ఇవ్వలేదు. అలాంటి మూవీకి ఇలా జరగడం షాక్ కలిగిస్తుంది. ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన కియారా అద్వానీ నటిస్తుంది. మరి గేమ్ చేంజర్ లీక్స్ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

Jojobet GirişjojobetJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcio