iDreamPost
android-app
ios-app

Gaami: రికార్డ్స్‌ బ్రేక్‌ చేస్తోన్న గామి.. మూడో రోజు కలెక్షన్లు ఎంతంటే!

  • Published Mar 11, 2024 | 12:23 PM Updated Updated Mar 11, 2024 | 12:25 PM

విశ్వక్ కెరీర్ లోనే వన్ అఫ్ ది బెస్ట్ ఫిల్మ్ గా.. తాజాగా నటించిన ఫిల్మ్ "గామి" వుండబోతుందనే టాక్ బాగా వినిపిస్తుంది. ఈ సినిమా రెండు రోజుల కలెక్షన్స్ కూడా బాక్స్ ఆఫీస్ వద్ద కొత్త రికార్డును సృష్టించాయి. మొత్తం మూడు రోజుల్లో ఈ సినిమాకు వచ్చిన కలెక్షన్స్ అంత ఇంత కాదు.

విశ్వక్ కెరీర్ లోనే వన్ అఫ్ ది బెస్ట్ ఫిల్మ్ గా.. తాజాగా నటించిన ఫిల్మ్ "గామి" వుండబోతుందనే టాక్ బాగా వినిపిస్తుంది. ఈ సినిమా రెండు రోజుల కలెక్షన్స్ కూడా బాక్స్ ఆఫీస్ వద్ద కొత్త రికార్డును సృష్టించాయి. మొత్తం మూడు రోజుల్లో ఈ సినిమాకు వచ్చిన కలెక్షన్స్ అంత ఇంత కాదు.

  • Published Mar 11, 2024 | 12:23 PMUpdated Mar 11, 2024 | 12:25 PM
Gaami: రికార్డ్స్‌ బ్రేక్‌ చేస్తోన్న గామి.. మూడో రోజు కలెక్షన్లు ఎంతంటే!

మహా శివరాత్రి సంధర్బంగా గామి సినిమాను మార్చి 8న .. గ్రాండ్ గా థియేటర్స్ లో విడుదల చేశారు. ఈ సినిమాకు విద్యాధర్ రావు కగిత దర్శకత్వం వహించారు. కాగా, ఈ సినిమాలో చాందినీ చౌదరి, దయానంద్ రెడ్డి ప్రధాన పాత్రలలో నటించారు. ఈ సినిమా విడుదలైన మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ సంపాదించుకుని.. భారీ ఓపెనింగ్స్ ని రాబట్టింది. మొదటి రోజు ఈ సినిమా వరల్డ్ వైడ్ గా రూ.9.07 కోట్లను రాబట్టింది. ప్రస్తుతం గామి సినిమా టాలీవుడ్ ఇండస్ట్రీలో తన సత్తా చూపిస్తోంది. ఈ సినిమా రెండు రోజుల గ్రాస్ ఈవెన్ కలెక్షన్స్ అక్షరాలా రూ.15.1 కోట్లు. ఇక దీనిని బట్టి చెప్పేయొచ్చు ఈ సినిమాపై రానున్న రోజుల్లో కోట్ల వర్షం కురవబోతుందని. మరి, ఈ సినిమా మూడవ రోజు కూడా రికార్డు బ్రేక్ కలెక్షన్స్ ను రాబట్టిందట. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

ఫలితంతో సంబంధం లేకుండా విశ్వక్ మంచి కథలను ఎంపిక చేసుకుని .. ప్రతి సినిమాలో తనదైన వెర్షన్ ను డిఫరెంట్ గా ఆడియన్స్ కు చూపిస్తూ ఉంటాడు. ఇలా అతను పడిన ఆరేళ్ళ కష్టానికి ఫలితంగా ఈరోజు గామి సినిమా నిదర్శనంగా నిలిచింది. ముందుగా విడుదల చేసిన టీజర్ ,ట్రైలర్ ఈ సినిమా మీద అంచనాలు పెంచగా.. మొదటి షో నుంచే హిట్ టాక్ సంపాదించుకుంది. తక్కువ బడ్జెట్ తో ఈ సినిమాను రూపొందించిన కూడా.. ఈ సినిమాలో చూపించిన విజువల్ వండర్స్ అందరిని బాగా ఆకట్టుకున్నాయి. ప్రస్తుతం గామి ఇండస్ట్రీలో బాక్స్ ఆఫీస్ వద్ద సునామి సృష్టిస్తోంది. ఈ సినిమా వరల్డ్ వైడ్ థర్డ్ డే కలెక్షన్స్ ను మేకర్స్ తాజాగా ప్రకటించారు. ఈ క్రమంలో ఇప్పటివరకు గామి మూడు రోజులలో రూ. 20.3 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ను వసూళ్లు చేసింది.

gaami 3rd day collections 2

అంతే కాకుండా.. అమెరికాలో కూడా గామి హావ కొనసాగుతూనే ఉంది. గామి ప్రీమియర్స్ తో పాటు అమెరికాలో మొదటి రెండు రోజుల్లో $400K కంటే ఎక్కువే వసూళ్లు చేసిందట. ఇంకా రాబోయే రోజుల్లో తిరుగులేకుండా.. ఇంకా ఎక్కువ కలెక్షన్స్ నే రాబట్టనుంది గామి. మొత్తానికి విశ్వక్ సేన్ పాలిట జాక్ పాట్ లా కానుంది ఈ సినిమా. ఇక విశ్వక్ సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం ఈ హీరో గ్యాంగ్ ఆఫ్ గోదావరితో బిజీగా ఉన్నాడు. అతని రాబోయే ప్రాజెక్ట్స్ మీద ఇప్పుడు అందరికి భారీగా అంచనాలు పెరిగిపోయాయి. ఇక గ్యాంగ్ ఆఫ్ గోదావరితో పాటు .. విశ్వక్ కు లైన్ అప్ లో మరో రెండు ప్రాజెక్ట్స్ ఉన్నాయి. మరి, గామి సినిమా కలెక్షన్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet Girişcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetcasibomgrandpashabetmeritbet girişjojobet girişgrandpashabetgrandpashabet girişjojobet girişdeneme bonusuMadridbetMadridbetJojobetJojobetgrandpashabet girişholiganbetgrandpashabet