iDreamPost
android-app
ios-app

‘సలార్’ పృథ్విరాజ్ చిన్నప్పటి పాత్రలో నటించిన ఈ కుర్రాడు ఎవరో తెలుసా?

  • Published Dec 23, 2023 | 4:38 PM Updated Updated Jun 29, 2024 | 10:58 AM

Salaar Movie: ప్రస్తుతం ఎక్కడ వినిపిస్తూ పేరు సలార్. ఈ సినిమాలోని పృథ్విరాజ్ చిన్నప్పటి పాత్రలో నటించిన ఓ కుర్రాడి గురించి నెటిజన్స్ తెగ సెర్చ్ చేస్తున్నారు. మరి.. అతడు ఎవరంటే..

Salaar Movie: ప్రస్తుతం ఎక్కడ వినిపిస్తూ పేరు సలార్. ఈ సినిమాలోని పృథ్విరాజ్ చిన్నప్పటి పాత్రలో నటించిన ఓ కుర్రాడి గురించి నెటిజన్స్ తెగ సెర్చ్ చేస్తున్నారు. మరి.. అతడు ఎవరంటే..

  • Published Dec 23, 2023 | 4:38 PMUpdated Jun 29, 2024 | 10:58 AM
‘సలార్’ పృథ్విరాజ్ చిన్నప్పటి పాత్రలో నటించిన ఈ కుర్రాడు ఎవరో తెలుసా?

సలార్..సలార్..సలార్.. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఎక్కడ చూసిన వినిపిస్తోన్న పేరు. ప్రశాంత్ నీల్, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ సలార్ మూవీ శుక్రవారం విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమా దెబ్బకు మిగిలిన సినిమాలు ఖాళీ అయ్యాయంటే అతిశయోక్తి కాదు. ప్రశాంత్ నీల్ డైరెక్షన్, ప్రభాస్ యాక్షన్ ఈ సినిమాకు అఖండ విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించాయి. ఇక ఈ సినిమాలోని ప్రతి ఒక్క పాత్ర అద్భుతంగా ఉంది. ముఖ్యంగా పృథ్విరాజ్ చిన్నతనం పాత్రలో నటించిన కుర్రాడు.. అందరి దృష్టిని ఆకర్షించాడు. ఇప్పుడు ఆ కుర్రాడు ఎవరా అని అందరు తెగ సెర్చ్ చేస్తున్నారు. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

ప్రస్తుతం ఎక్కడ చూసిన సలార్ మేనియానే కనిపిస్తోంది. ప్రభాస్  సినిమా హిట్ అయితే కాలర్ ఎగరేసుకుని తిరుగుదామా అని ఎదురు చూస్తున్న డార్లింగ్ ఫ్యాన్స్ కి సలార్ మూవీ తలెత్తుకునేలా చేసింది. మరీ ముఖ్యంగా  బాహుబలి తరువాత ఆ రేంజ్  హిట్లు లేకపోవడంతో అందరూ సలార్  సినిమాపైనే ఆశలు పెట్టుకున్నారు. వారు అంచనాలను, ఆశలను ఏమాత్రం నిరుత్సాహపర్చకుండా ప్రశాంత్ నీల్ తనదైన మార్క్ ను చూపించారు.

భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ పై దండయాత్ర చేస్తోంది. అంచనాలను మించి హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఇక ప్రభాస్ ఫ్యాన్స్ అన్నదానాలు చేస్తూ, టపాసులు పేలుస్తూ క్రిస్మస్, సంక్రాంతిని ముందే జరుపుకుంటున్నారు. ఇక ఈ సినిమాలో ప్రభాస్ కటౌట్ కి పిధా అవ్వని ప్రేక్షకుడు లేరని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇదంతా పక్కన పెడితే.. సలార్ సినిమాలోని  వారందరూ సూపర్ గా నటించారు. అయితే   మూవీలోని కొన్ని పాత్రలు ప్రేక్షకులను ప్రత్యేకంగా ఆకట్టుకున్నాయి. అలానే ఈ సినిమాలో పృథ్విరాజ్ చిన్నప్పటి పాత్రలో నటించిన ఓ కుర్రాడు  అందరి దృష్టిని తనవైపు తిప్పుకున్నాడు.

ఇప్పుడు ఆ పిల్లవాడి గురించి సోషల్ మీడియాలో ఒక వార్త చక్కర్లు కొడుతుంది. అలాగే  అతడి బయోడేటా తెలుసుకునే పనిలో నెటిజన్స్ ఉన్నారు. సలార్ సినిమాలో పృథ్విరాజ్ చిన్నప్పటి పాత్రలో చేసిన ఆ కుర్రాడు కూడా మన తెలుగు హీరో కొడుకు అని టాక్ వినిపిస్తోంది. అసలు విషయంలోకి వెళ్తే.. సలార్ సినిమాలో విలన్ పృథ్వీరాజ్ చిన్నప్పటి పాత్రలో చేసిన కుర్రాడి పేరు కార్తికేయ దేవ్. ఈ అబ్బాయి టాలీవుడ్ హీరో రవితేజ కజిన్ బ్రదర్ కొడుకు అని తెలుస్తోంది. అదే నిజమైతే.. ఆ కుర్రాడు రవితేజకి కూడా కొడుకే అవుతాడు.

ప్రస్తుతం దేవ్ 10వ తరగతి చదువుతున్నాడంట. ఇక సలార్ సినిమాలో పృథ్వి రాజ్ చిన్నప్పటి పాత్ర కోసం చాలా మందిని ఆడిషన్ చేశారంట. అందులో చివరికి కార్తికేయ దేవ్ ని ప్రశాంత్ నీల్ ఎంపిక చేశారని తెలుస్తోంది. ఇక ఈ సినిమా కోసం నెల రోజుల పాటు రిహార్సల్స్ చేసి 15 రోజుల్లో ఆ పాత్రకి సంబంధించిన షూటింగ్ ని  పూర్తి చేశారని కార్తికేయ దేవ్ ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి.. సలార్ మూవీలో నటించిన కార్తీకేయపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetMadridbetJojobetHoliganbetMadridbetjojobet güncel girişgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişjojobet girişCasibombetciograndpashabet