iDreamPost
android-app
ios-app

‘పుష్ప 2’ రిలీజ్ డేట్.. ఫ్యాన్స్ అంచనాలు నీరుగార్చేసిందా..?

  • Author ajaykrishna Updated - 01:39 PM, Tue - 12 September 23
  • Author ajaykrishna Updated - 01:39 PM, Tue - 12 September 23
‘పుష్ప 2’ రిలీజ్ డేట్.. ఫ్యాన్స్ అంచనాలు నీరుగార్చేసిందా..?

సాధారణంగా అభిమాన హీరోల సినిమాలు వస్తున్నాయంటే అభిమానులలో అంచనాలన్నీ వేరుగా ఉంటాయి. అది ఏ టైమ్ లో వస్తుందో.. ఏ టైమ్ లో వస్తే బాగుంటుందో కూడా అంచనాలు వేసేస్తుంటారు. కానీ.. అసలు నిర్ణయం మేకర్స్ చేతిలో ఉంటుంది కదా! వాళ్ళు ప్రకటించేదాకా ఎవరి ఊహగానాల్లో వారు ఉండిపోతారు. తీరా మేకర్స్ రిలీజ్ డేట్ ఊహించని డేట్ కి అనౌన్స్ చేశారంటే.. ముందునుండి అంచనాలు వేసిన ఫ్యాన్స్ అందరూ షాక్ అవుతుంటారు. నిజానికి ఫ్యాన్స్ అంచనాలు ఎలా ఉంటాయి.. ఒక సినిమా సమ్మర్ కి రాబోతుందని అంటే.. లేదు లేదు సంక్రాంతికే వస్తే బాగుంటుందని ఆశలు పెట్టుకుంటారు.

కట్ చేస్తే.. ఆ సినిమా సమ్మర్ కి నుండి ఇంకా వెనక్కి వెళ్ళిపోయి వేరే డేట్ లో వస్తుందని ప్రకటన వస్తుంది. దీంతో సంక్రాంతిపై.. ఆ తర్వాత సమ్మర్ పై ఆశలు పెంచుకున్న ఫ్యాన్స్ అంతా నిరాశకు గురవుతుంటారు. ఓకే.. ఫ్యాన్స్ అన్నాక ఆశలు నిరాశలు మామూలే. ఎందుకంటే.. ఇండస్ట్రీలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరు ఎక్స్ పెక్ట్ చేయలేరు. ఇప్పుడు పుష్ప 2 విషయంలో కూడా అదే జరిగింది. ఇండియా వైడ్ ఫ్యాన్స్ అందరూ ‘పుష్ప 2’ కోసం చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న ఈ పాన్ ఇండియా మూవీ.. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది.

2021లో విడుదలైన పుష్ప సినిమాకు ఇది సీక్వెల్. కాగా.. తాజాగా పుష్ప 2 రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు మేకర్స్. ఫ్యాన్స్ అంతా వచ్చే ఏడాది మార్చి, సమ్మర్ అంటూ లెక్కలు వేస్తున్నారు. కానీ.. సడన్ గా 2024 ఆగష్టు 15న రిలీజ్ అని ప్రకటించేసరికి ఆశ్చర్యపోతున్నారు. అయితే.. పుష్ప డేట్ అంత లాంగ్ వెళ్లిపోవడానికి ఓ కారణం వినిపిస్తుంది. అదేంటంటే.. పుష్ప 2 షూటింగ్ ఇంకా నలభై శాతమే అయ్యిందట. సో.. జనవరిలోపు టాకీ పార్ట్ పూర్తి చేసి ఆ తర్వాత మిగతా వర్క్ చేసేద్దామని ప్లాన్ చేసినట్లు సమాచారం. పుష్పకి తెలుగులో మిక్సడ్ టాక్, నార్త్ లో బ్లాక్ బస్టర్ టాక్ లభించింది. సో.. రెండు దృష్టిలో పెట్టుకొని.. ఫ్యాన్స్ అంచనాలను రీచ్ అవ్వాల్సి ఉంటుంది. కానీ.. ఏదేమైనా సమ్మర్ లో వస్తుందనుకున్న సినిమా ఆగష్టులో అనేసరికి.. సరే లేట్ అయినా పర్లేదు అదిరిపోవాలని ఫ్యాన్స్ ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు. మరి పుష్ప 2 గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

Jojobet GirişJojobetcasibomjojobetjojobetcasibomcasibomcasibomcasinomilyonşanlıurfa konteynerbetciobetcioGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetJojobetStarzJojobetStarzbetjojobet güncel girişgrandpashabetgrandpashabetgrandpashabetganobetcasibom girişbetciojojobetgrandpashabet girişcasibom