iDreamPost
android-app
ios-app

‘ఎన్నెన్నో జన్మల బంధం’ సీరియల్ నటి కారు తీసుకొని ఉడాయించిన డ్రైవర్!

  • Author singhj Updated - 06:10 PM, Fri - 25 August 23
  • Author singhj Updated - 06:10 PM, Fri - 25 August 23
‘ఎన్నెన్నో జన్మల బంధం’ సీరియల్ నటి కారు తీసుకొని ఉడాయించిన డ్రైవర్!

సినిమాల అంత కాకపోయినా టెలివిజన్ నటులకు కూడా మంచి లెవల్లోనే ఫాలోయింగ్ ఉంటుంది. ముఖ్యంగా కుటుంబ ప్రేక్షకులు ఎక్కువగా టెలివిజన్ కార్యక్రమాలను ఇష్టపడుతుంటారు. అందులోనూ సీరియళ్లను ఇష్టపడే ఫ్యాన్స్ ఎక్కువ. కొన్ని సీరియళ్లకు, అందులోని నటులకు అయితే ఒక రేంజ్​లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. ప్రతి రోజూ సాయంత్రం కాగానే సీరియళ్ల కోసం టీవీల ముందు అతుక్కుపోతారు మహిళలు. మగవాళ్లు కూడా సీరియల్స్​ చూసినా.. వీటికి ఫిమేల్ ఫాలోయింగే అధికమని చెప్పాలి. తెలుగు రాష్ట్రాల్లోనూ టీవీ సీరియల్స్​కు మంచి మార్కెట్ ఉంది.

అప్పట్లో వచ్చిన ‘రుతురాగాలు’ దగ్గర నుంచి ఈమధ్య వచ్చిన ‘కార్తీక దీపం’ వరకు ఎన్నో సీరియల్స్​ను తెలుగు బుల్లితెర ప్రేక్షకులు అక్కున చేర్చుకున్నారు. వంటలక్క లాంటి క్యారెక్టర్​కు అయితే సినిమాల్లోని పాత్రల రేంజ్​లో అభిమానులు ఉండటం గమనార్హం. సీరియల్స్​తో పాటు ఆ నటులు చేసే ఇతర టెలివిజన్ కార్యక్రమాలనూ ఆడియెన్స్ ఫాలో అవుతూ ఉంటారు. వారిని సోషల్ మీడియాలోనూ అనుసరిస్తుంటారు. టెలివిజన్ నటుల జీవితాలకు సంబంధించిన విశేషాలను తెలుసుకునేందుకూ ఆసక్తి చూపిస్తుంటారు. సినీ స్టార్స్ మాదిరిగానే టెలివిజన్ ప్రముఖులకు సంబంధించిన విశేషాలను తెలుసుకునేందుకు ప్రేక్షకులు ఉత్సాహం కనబరుస్తుంటారు.

ఇదిలా ఉంటే.. ప్రముఖ తెలుగు టెలివిజన్ నటి కారు దొంగతనానికి గురవ్వడం హాట్ టాపిక్​గా మారింది. ఇటీవల బాగా ఫేమస్ అయిన ‘ఎన్నెన్నో జన్మల బంధం’ సీరియల్​లో అభి అక్కగా నటిస్తున్న నటి కారును ఆమె డ్రైవర్ తీసుకొని పరార్ అయ్యాడట. ఈ విషయాన్ని స్వయంగా ఆమెనే ఓ వీడియో ద్వారా అందరికీ తెలియజేశారు. రెగ్యులర్ డ్రైవర్ లీవ్​లో ఉండటంతో ఒక రిఫరెన్స్ ద్వారా కొత్త డ్రైవర్​ను బుక్ చేసుకున్నానని ఆమె తెలిపారు. అయితే తాను, తన అసిస్టెంట్ ఎక్కేలోపే ఆ డ్రైవర్ కారును తీసుకొని వెళ్లిపోయాడని అన్నారు. కారులో ఖరీదైన నగలు, ఫోన్లు, లగేజీ ఉన్నాయని నటి చెప్పారు. ఇతరుల సాయంతో బైక్ పై వెళ్లి ఆపితే గానీ అతడు వెనక్కి రాలేదన్నారు. ఈ రోజుల్లో ఎవ్వరినీ నమ్మే పరిస్థితి లేదని.. అందరూ జాగ్రత్తగా ఉండాలని ఆమె చెప్పుకొచ్చారు.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibomgrandpashabet