ఈ చిన్నారి.. అమాయకమైన నటనతో కట్టిపడేసే స్టార్ హీరోయిన్.. ఎవరో తెలుసా..?

ఈ చిన్నారి.. అమాయకమైన నటనతో కట్టిపడేసే స్టార్ హీరోయిన్.. తెలుగులో నేరుగా సినిమా చేసినప్పటికీ రాని గుర్తింపు.. ఓ డబ్బింగ్ చిత్రం ద్వారా వచ్చింది. ఇంతకు ఆమె ఎవరంటే..?

ఈ చిన్నారి.. అమాయకమైన నటనతో కట్టిపడేసే స్టార్ హీరోయిన్.. తెలుగులో నేరుగా సినిమా చేసినప్పటికీ రాని గుర్తింపు.. ఓ డబ్బింగ్ చిత్రం ద్వారా వచ్చింది. ఇంతకు ఆమె ఎవరంటే..?

ఈ ఫోటోలో తదేకంగా చూస్తున్న ఈ పాపని గుర్తుపట్టారా..? అమాయకమైన నటనతో ఫస్ట్ మూవీతోనే ఆకట్టుకుంది ఈ బ్యూటీ. కానీ ఇప్పుడు తెలుగులో అంతగా కనిపించడం లేదు. ఈమె కూడా మలయ మారుతమే. అంటే మలయాళ ఇండస్ట్రీ నుండి వచ్చిన ముద్దుగుమ్మే అని అర్థం. ఇంతకు ఆ చిన్నది ఎవరంటే.. జర్నీ మూవీలో తన నటనతో ఆకట్టుకున్న అనన్య. ఇందులో అముద క్యారెక్టర్‌లో ఎంతో క్యూట్‌గా కనిపిస్తుందో కదా. ఈ ఫోటోలో ఉంది కూడా ఆ బ్యూటీనే. అంతకు ముందు మలయాళం, తమిళంలో ఎన్ని సినిమాలు చేసినా.. ఆమెకు గుర్తింపునిచ్చింది మాత్రం జర్నీ సినిమా అనే చెప్పాలి. అయితే ఈ చిత్రం కన్నా ముందే కృష్ణుడు హీరోగా వచ్చిన అమాయకుడు అనే చిత్రంలో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది ఈ నటి. అయితే ఆ సినిమా వచ్చినట్లు, పోయినట్లు కూడా తెలియకపోవడంతో ఈ నటి రిజిస్టర్ కాలేదు.

జర్నీ సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరయ్యింది. ఇందులో టాలీవుడ్ స్టార్ హీరో శర్వానంద్‌కు పెయిర్‌గా కనిపిస్తుంది. ఈ సినిమాకు ఆమె బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్స్ కింద ఫిల్మ్ ఫేర్ కూడా అందుకుంది. దీని తర్వాత ఆమెకు మరిన్ని అవకాశాలు రావడం ఎక్కువయ్యాయి. పలు మలయాళ, తమిళ్, కన్నడ చిత్రాలు చేసింది కానీ తెలుగులో అమాయకుడు తర్వాత కనిపించేందుకు చాలా లాంగ్ గ్యాప్పే తీసుకుంది. 2016 త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన అఆ మూవీలో యాక్ట్ చేసింది. నితిన్ చెల్లెలిగా, సమంతకు మరదలి పాత్రలో మెరుస్తుంది. ఆ తర్వాత మళ్లీ మహేష్ బాబు మహర్షిలో తళుక్కుమంది. స్టార్ హీరోల సినిమాలు చేసినప్పటికీ.. స్టార్ హీరోల సరసన యాక్ట్ చేయలేదు ఈ బ్యూటీ.

అనన్య అసలు పేరుఅయిల్య. తండ్రి గోపాల కృష్ణన్ నాయర్.. ప్రముఖ ప్రొడ్యూసర్. చిన్నప్పడు పై బ్రదర్ అనే మూవీలో మెరిసిన అనన్య.. ఆ తర్వాత చదువులపై దృష్టి పెట్టింది. కేవలం చదువులే కాదు ఆమె ఆటల్లోనూ దిట్టే. ఆర్చరీలో స్టేట్ చాంపియన్ షిప్ గెలిచింది. ఆ తర్వాత తన పేరును అనన్యగా మార్చుకుని 2008లో పాజిటివ్ అనే మూవీతో కెరీర్ స్టార్ట్ చేసింది. కానీ ఆమె నటిగా గుర్తింపునిచ్చింది తమిళ చిత్రం. సీక్రెట్ పోలీస్, షికార్, ఒరు స్మాల్ ఫ్యామిలీ, సీనియర్స్, డాక్టర్ లవ్, కాందహార్, సీనియర్స్, డాక్టర్ లవ్, కుంజలియన్, మాస్టర్స్, నాటోడిమన్నన్, టియాన్ వంటి చిత్రాల్లో నటించింది. తమిళం, తెలుగు, కన్నడ భాషా చిత్రాల్లో నటించింది. అనన్యకు మోటార్ సైకిల్ రేసింగ్ అంటే కూడా చాలా ఆసక్తి. అనన్య బుల్లెట్ మోటార్ సైకిల్ నడపడంలో నిపుణురాలు కూడా. 2012లో అంజనేయన్ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. ప్రస్తుతం ఆమె చేతిలో మూడు ప్రాజెక్టులున్నాయి.

Show comments