iDreamPost
android-app
ios-app

Manamey Movie Trailer: డిఫరెంట్ క్యారెక్టర్స్.. డిఫరెంట్ జర్నీ! అదరగొట్టిన శర్వానంద్ ‘మనమే’ ట్రైలర్!

  • Published Jun 01, 2024 | 12:31 PM Updated Updated Jun 01, 2024 | 12:31 PM

సరికొత్త ఫ్యామిలీ కన్సెప్ట్ తో 'మనమే' అంటూ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు హీరో శర్వానంద్. కృతిశెట్టి హీరోయిన్ గా నటించిన ఈ చిత్ర ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. మరి ఆ ట్రైలర్ ఎలా ఉందో చూద్దాం పదండి.

సరికొత్త ఫ్యామిలీ కన్సెప్ట్ తో 'మనమే' అంటూ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు హీరో శర్వానంద్. కృతిశెట్టి హీరోయిన్ గా నటించిన ఈ చిత్ర ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. మరి ఆ ట్రైలర్ ఎలా ఉందో చూద్దాం పదండి.

  • Published Jun 01, 2024 | 12:31 PMUpdated Jun 01, 2024 | 12:31 PM
Manamey Movie Trailer: డిఫరెంట్ క్యారెక్టర్స్.. డిఫరెంట్ జర్నీ! అదరగొట్టిన శర్వానంద్ ‘మనమే’ ట్రైలర్!

శర్వానంద్.. తెలుగులో డీసెంట్ హీరోగా మంచి పేరుతో పాటుగా ఫ్యాన్ ఫాలోయింగ్ ను కూడా సొంతం చేసుకున్నాడు. ఇక శర్వా సినిమా వస్తుందంటే చాలు.. యూత్ తో పాటుగా ఫ్యామిలీ ఆడియన్స్ సైతం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉంటారు. వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ.. ఇండస్ట్రీలో ముందుకు సాగుతున్నాడు. ఇక ఇప్పుడు ‘మనమే’  అంటూ మరో ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ క్రమంలోనే ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ ను మేకర్స్ తాజాగా విడుదల చేశారు. ఆ ట్రైలర్ ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.

శర్వానంద్-కృతిశెట్టి జంటగా నటించిన లేటెస్ట్ మూవీ ‘మనమే’. డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య తెరకెక్కించిన ఈ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ జూన్ 7న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఈ క్రమంలోనే మూవీ మేకర్స్ ట్రైలర్ ను తాజాగా విడుదల చేశారు. రెండు నిమిషాల 15 సెకన్లు కట్ చేసిన ఈ ట్రైలర్.. ఆద్యంతం ఇంట్రెస్టింగ్ గా ఉంది. లేజీ నెస్ ఉన్న భర్త పాత్రలో శర్వానంద్ నటించగా.. ఆ భర్తను భరించే భార్యగా కృతిశెట్టి నటించింది. భార్య భర్తల మధ్య ఉండే అన్ని అనుబంధాలను ఈ మూవీలో చాలా చక్కగా చూపించినట్లు ట్రైలర్ లోనే తెలుస్తోంది.

కొడుకును నిర్లక్ష్యంగా చూసుకుంటున్నాడు అని భార్య ఎప్పుడూ తిట్టే  పాత్రలో శర్వా అద్భుతంగా నటించాడు. అతడికి పోటీగా తన నటనతో ఆకట్టుకుంది కృతి. కథ మెుత్తం శర్వా-కృతి, వీరి కొడుకు పాత్రల చుట్టే తిరుగుతుందని ట్రైలర్ చూస్తేనే అర్దమవుతుంది. డైలాగ్స్ సైతం ఆకట్టుకున్నాయి. వాటిని శర్వా చెప్పే తీరు ప్రేక్షకులకు తప్పకుండా నచ్చుంది. మెుత్తానికి ఈ ట్రైలర్ చూస్తే.. శర్వాకు హిట్ ఖాయమే అంటున్నారు ఫ్యాన్స్. ఈ మూడు పాత్రలతో పాటుగా రాహుల్ రామకృష్ణ, వెన్నెల కిశోర్, సీరత్ కపూర్, రాహుల్ రవింద్రన్ కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి అబ్దుల్ వహాబ్ సంగీతాన్ని అందించగా.. టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. మరి రెండు డిఫరెంట్ క్యారెక్టర్స్.. డిఫరెంట్ జర్నీని ‘మనమే’ మూవీ ద్వారా చూపించబోతున్నాడు డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య. మరి ట్రైలర్ చూసి ఎలా ఉందో.. మీ అభిప్రాయాలను తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetMadridbetJojobetHoliganbetMadridbetjojobet güncel girişgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişjojobet girişCasibombetciograndpashabet