iDreamPost
android-app
ios-app

Sharwanand: వెకేషన్‌లో శర్వానంద్.. తొలిసారిగా కూతురు పిక్ రివీల్..!

  • Published Sep 03, 2024 | 3:33 PM Updated Updated Sep 03, 2024 | 3:33 PM

Sharwanand: ఇటీవల మనమే చిత్రంతో పలకరించిన శర్వానంద్.. ఇప్పుడు రెండు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. ఈ బిజీ టైంలో కూడా ఫ్యామిలీతో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నాడు. తాజాగా కూతురు పిక్ రివీల్ చేశాడు శర్వా.

Sharwanand: ఇటీవల మనమే చిత్రంతో పలకరించిన శర్వానంద్.. ఇప్పుడు రెండు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. ఈ బిజీ టైంలో కూడా ఫ్యామిలీతో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నాడు. తాజాగా కూతురు పిక్ రివీల్ చేశాడు శర్వా.

  • Published Sep 03, 2024 | 3:33 PMUpdated Sep 03, 2024 | 3:33 PM
Sharwanand: వెకేషన్‌లో శర్వానంద్.. తొలిసారిగా కూతురు పిక్ రివీల్..!

బ్యాచ్ లర్ లైఫ్‌కి గుడ్ బై చెప్పి వివాహ జీవితంలోకి అడుగుపెట్టాడు యంగ్ హీరో శర్వానంద్. గత ఏడాది జూన్ 3న ర‌క్షితా రెడ్డి మెడలో మూడు ముళ్లు వేసి ఫ్యామిలీ జోన్‌లోకి ఎంటర్ అయ్యాడు. ఈ ఏడాది మార్చిలో ఈ జంట తల్లిదండ్రులుగా ప్రమోట్ అయ్యారు. శర్వా-రక్షితా దంపతులకు పాప పుట్టగా.. ‘లీలా దేవి మైనేని’ అని నామకరణం చేశారు. పుత్రికోత్సాహంతో మునిగి తేలిపోయాడు ఈ టాలెంట్ హీరో. ఇటీవల మనమే చిత్రంతో పలకరించిన శర్వా.. ఇప్పుడు ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తున్నాడు. భార్య రక్షితా, కూతురు లీలాదేవితో కలిసి ట్రిప్‌ ఎంజాయ్ చేస్తున్నాడు. ఆ ఫోటోలను షేర్ చేసుకున్నాడు నటుడు శర్వానంద్. ఈ ఫోటోలో తొలిసారిగా పాప ఫేస్ రివీల్ చేశారు ఈ క్యూట్ కపుల్స్. అమ్మ ఒడిలో కూర్చుని తండ్రి వంక చూస్తూ చిరనవ్వులు చిందిస్తుంది లీలా.

భార్య, కూతురితో వెకేషన్ ఫోటోలను ఇన్ స్టా వేదికగా పంచుకున్నాడు శర్వా. ఒక ఫోటోలో కప్పులో కాఫీ మీద మిస్టర్ అండ్ మిసెస్ మైనేని అండ్ లీలా పిక్ పంచుకోగా.. మరో ఫోటోలో తన డాటర్ పిక్ షేర్ చేశాడు. ఇందులో శర్వా కూతురు ఎంతో క్యూట్‌గా కనిపిస్తుంది. బబ్లీ లుక్స్‌తో అచ్చు తండ్రిలానే కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా, పాప పుట్టిన తర్వాత ఫస్ట్ టైం ఈ దంపతులు ఫోటో రివీల్ చేయడం గమనార్హం. సాధారణంగా సెలబ్రిటీలు తమ పిల్లల ఫోటోలను రివీల్ చేయడానికి ఇష్టపడరు. ఒక వేళ ఫోటో పెట్టాల్సి వస్తే.. ఎమోజీలు యాడ్ చేసి పెడుతున్నారు. సొసైటి అటెన్షన్ వద్దనుకుని ఇలా చేస్తున్నారు. కానీ శర్వా అవేమి వినియోగించకుండా తన కూతురు పిక్ పంచుకున్నాడు. అయితే ఇది ఆఫ్ సైడ్ మాత్రమే రివీల్ అవుతుంది.

sarwandh vaciona pic

శర్వా కెరీర్ విషయానికి వస్తే.. స్మాల్ రోల్స్‌తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు ఈ కుర్రాడు. రామ్ చరణ్ లాంటి స్టార్ హీరో ఫ్రెండ్ అయినా, మెగా ఫ్యామిలీతో మంచి అనుబంధం ఉన్నా.. స్వయంకృషితో ఎదిగాడు. చిన్నచిన్న రోల్స్ చేస్తూనే హీరోగా మారి స్టార్ డమ్ తెచ్చుకున్నాడు. యువసేన నుండి సెకండ్ హీరో నుండి మెయిన్ హీరోకు మారాడు. గమ్యం తర్వాత పూర్తిగా కెరీర్ టర్న్ అయ్యింది. సినిమా హిట్స్ అండ్ ఫట్స్ తో సంబంధాలు లేకుండా సినిమాలు చేసుకుంటూ వస్తున్నాడు. ఒకే ఒక జీవితం, మనమే చిత్రాలతో ఇటీవల ప్రేక్షకులను పలకరించిన నటుడు.. యువీ క్రియేషన్స్, వంశీ ప్రజెంట్స్ పతాకంపై ఓ మూవీ చేస్తున్నాడు. ఇది అడ్వంచర్ స్పోర్ట్ డ్రామాగా తెరకెక్కుతున్నట్లు తెలుస్తుంది. అలాగే ఏకే ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై మరో మూవీ చేస్తున్నాడు.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişjojobet girişCasibombetciograndpashabet