iDreamPost

‘మనమే’తో భారీ రిస్క్ చేస్తున్న శర్వానంద్! ఇక ఆ దేవుడి దయ..

శర్వానంద్ లేటెస్ట్ గా నటించిన చిత్రం 'మనమే' జూన్ 7న గ్రాండ్ గా రిలీజ్ అవుతోంది. ఈ క్రమంలో మూవీలోని ఓ షాకింగ్ న్యూస్ వైరల్ గా మారింది. దాంతో ఈ సినిమాతో శర్వానంద్ భారీ రిస్క్ చేస్తున్నాడని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరి శర్వా చేస్తున్న ఆ రిస్క్ ఏంటి? పూర్తి వివరాల్లోకి వెళితే..

శర్వానంద్ లేటెస్ట్ గా నటించిన చిత్రం 'మనమే' జూన్ 7న గ్రాండ్ గా రిలీజ్ అవుతోంది. ఈ క్రమంలో మూవీలోని ఓ షాకింగ్ న్యూస్ వైరల్ గా మారింది. దాంతో ఈ సినిమాతో శర్వానంద్ భారీ రిస్క్ చేస్తున్నాడని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరి శర్వా చేస్తున్న ఆ రిస్క్ ఏంటి? పూర్తి వివరాల్లోకి వెళితే..

‘మనమే’తో భారీ రిస్క్ చేస్తున్న శర్వానంద్! ఇక ఆ దేవుడి దయ..

శర్వానంద్-కృతి శెట్టి జంటగా డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య తెరకెక్కించిన చిత్రం ‘మనమే’. యూత్ అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ ను టార్గెట్ చేసుకుని రొమాంటిక్ కామెడీ జోనర్ తో వస్తున్న ఈ చిత్రం జూన్ 7న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మూవీ టీమ్ ప్రమోషన్ కార్యక్రమాలను చేపట్టింది. ఈ క్రమంలోనే చిత్ర యూనిట్ పలు ఇంటర్వ్యూల్లో పాల్గొంటూ.. సినిమా గురించి ఆసక్తికర విషయాలు వెల్లడిస్తున్నారు. తాజాగా డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య మాట్లాడుతూ.. మూవీలో ఉన్న ఓ షాకింగ్ విషయాన్ని రివీల్ చేశాడు. దాంతో ఇది తెలిసిన శర్వా ఫ్యాన్స్,  మూవీ లవర్స్ శర్వ భారీ రిస్క్ చేస్తున్నాడు అంటూ బాధపడుతున్నారు. మరి ఆ రిస్క్ ఏంటి? పూర్తి వివరాల్లోకి వెళితే..

టాలీవుడ్ హీరో శర్వానంద్ కు ఫ్యామిలీ, యూత్ ఆడియన్స్ లో మంచి ఫాలోయింగ్ ఉంది. దాంతో అతడి నుంచి సినిమా వస్తుందంటే చాలు అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఈ క్రమంలోనే శ్రీరామ్ ఆదిత్య డైరెక్షన్ లో ‘మనమే’ అంటూ రొమాంటిక్ ఫ్యామిలీ కామెడీ డ్రామాతో జూన్ 7న రాబోతున్నాడు. ట్రైలర్ తోనే సినిమాపై భారీ హైప్ ను క్రియేట్ చేశారు మేకర్స్. కృతి శెట్టికి సైతం మంచి క్యారెక్టర్ పడింది. శర్వానంద్ కు పోటీగా ఇందులో నటించింది. అయితే ఈ చిత్రం గురించి ఓ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నాడు డైరెక్టర్. ఈ చిత్రంలో మెుత్తం 16 పాటలు ఉన్నాయంటూ బాంబ్ పేల్చాడు.

Maname

సాధారణంగా సినిమాలో మూడు పాటలు, ఆరు ఫైట్లు అన్న నానుడి ఉండనే ఉంది. కానీ ఈ ట్రెండ్ ను ఇప్పుడు అందరూ ఫాలో అవ్వట్లేదు అది వేరే విషయం అనుకోండి. అలాంటిది ఒకే సినిమాలో 16 పాటలు అంటే ప్రేక్షకులకు బోర్ కొడుతుంది కదా అంటున్నారు. అయితే ఈ 16 సాంగ్స్ పెద్దవి కావని, కథలో భాగంగా వచ్చే బీట్ సాంగ్స్ అని డైరెక్టర్ వివరించారు. ఎంత బీట్ సాంగ్స్ అయినా.. 16 అంటే కష్టమే డైరెక్టర్ సాబ్ అంటూ పెదవి విరుస్తున్నారు కామన్ ఆడియన్స్. అయితే ఖుషీ, హాయ్ నాన్న సినిమాలకు సంగీతం అందించిన అబ్దుల్ వహబ్ ఈ చిత్రానికి మ్యూజిక్ ఇచ్చారు. దాంతో ఫ్యాన్స్ కాస్త ధీమాగా ఉన్నారు. ఎందుకుంటే. అబ్దుల్ వహబ్ పాటలు ఎంత విన్నా.. వినాలనిపిస్తుంది. కానీ ఈ విషయం తెలిసిన కొందరు మాత్రం 16 సాంగ్స్ తో శర్వానంద్ భారీ రిస్క్ చేస్తున్నాడని, ఇక అతడిని ఆ దేవుడే కాపాడాలని కామెంట్స్ చేస్తున్నారు. మరి ఇన్ని సాంగ్స్ సినిమాలో పెట్టుకుని శర్వానంద్ రిస్క్ చేస్తున్నాడా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి