iDreamPost
android-app
ios-app

శతమానం భవతి సీక్వెల్.. శర్వానంద్ కి అన్యాయం.. కొడుక్కి ఛాన్స్

  • Published Mar 07, 2024 | 7:35 PM Updated Updated Mar 07, 2024 | 7:35 PM

Shatamanam Bhavati sequel: ఫ్యామిలీ సెంటిమెంట్ తో వచ్చే సినిమాలకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారు. అలాంటి సినిమాల్లో ఒకటి శతమానం భవతి. బంధాలు, అనుబంధాలతో కూడిన ఈ చిత్రం అప్పట్లో బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

Shatamanam Bhavati sequel: ఫ్యామిలీ సెంటిమెంట్ తో వచ్చే సినిమాలకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారు. అలాంటి సినిమాల్లో ఒకటి శతమానం భవతి. బంధాలు, అనుబంధాలతో కూడిన ఈ చిత్రం అప్పట్లో బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

  • Published Mar 07, 2024 | 7:35 PMUpdated Mar 07, 2024 | 7:35 PM
శతమానం భవతి సీక్వెల్.. శర్వానంద్ కి అన్యాయం.. కొడుక్కి ఛాన్స్

సినీ ఇండస్ట్రీలో కుటుంబ నేపథ్యంలో వచ్చే సినిమాలను ప్రేక్షకులు ఎప్పటికీ ఆదరిస్తూనే ఉంటారు. ఓ కుటుంబంలోని బంధాలు, అనుబంధాలు.. ఎమోషన్స్ వెండితెరపై చూస్తే ఆడియన్స్ బాగా కనెక్ట్ అవుతారు. ఆ తరం నుంచి ఈ తరం వరకు ఫ్యామిలీ సెంటిమెంట్ సినిమాలకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతుంటారు. సాధారణంగా సంక్రాంతి కానుకగా తెలుగు లో పెద్ద హీరోల సినిమాలు ధియేటర్లో సందడి చేస్తుంటాయి. ఆరేళ్ళ క్రితం సంక్రాంతి బరిలో స్టార్ హీరోల మూవీస్ తో పోటీగా నిలిచి బ్లాక్ బస్టర్ విజయం అందుకున్న మూవీ ‘శతమానం భవతి’. ఇటీవల శతమానం భవతి మూవీ సీక్వెల్ ప్రకటించారు నిర్మాత దిల్ రాజు. కాకపోతే ఈ మూవీలో కొన్ని మార్పులు చేర్పులు చేశారు.. అదేంటో చూద్దాం. వివరాల్లోకి వెళితే..

2017 లో సతీష్ వేగేశ్న దర్శకత్వంలో శర్వానంద్, అనుపమ పరమేశ్వరన్, ప్రకాశ్ రాజ్, జయసుధ ప్రధాన పాత్రలుగా ‘శతమానం భవతి’ సినిమా తెరకెక్కించారు. సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్ అయ్యింది. అంతేకాదు నేషనల్ అవార్డులను దక్కించుకుంది. ఈ మూవీలో ప్రతి ఒక్క క్యారెక్టర్ మనసులకు హత్తుకునేలా ఉంటుంది.  ఎలాంటి అంచనా లేకుండా చిన్న సినిమాగా రిలీజ్ అయిన శతమానం భవతి మంచి కమర్షియల్ హిట్ గా నిలిచింది. చిరంజీవి ఖైదీ నెంబర్ 150, బాలకృష్ణ నటించిన గౌతమి పుత్ర శాతకర్ణ లాంటి బిగ్గెస్ట్ మూవీస్ కి పోటీగా రిలీజ్ ప్రేక్షకాధరణ పొందింది. కుటుంబ అనుబంధాలు, ఆప్యాయతలకు పెద్ద పీట వేస్తూ తీసిన ఈ సినిమా విమర్శకుల నుంచి ప్రశంసలు పొందింది.

ఇదిలా ఉంటే ఈ నేషనల్ అవార్డు విన్నింగ్ మూవీ సీక్వెల్ రాబోతుంది. ‘శతమానం భవతి నెక్ట్స్ పేజీ’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. 2025 సంక్రాంతి కానుగా రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు నిర్మాత దిల్ రాజు. అయితే పార్ట్ వన్ లో శర్వానంద్ హీరోగా నటించిన విషయం తెలిసిందే. ఈ మూవీలో శర్వాకు మంచి మార్కులే పడ్డాయి. సీక్వెల్ లో కూడా ఈ హీరో ఉంటారని అందరూ ఊహించారు. కానీ నిర్మాత దిల్ రాజు మాత్రం పెద్ద ట్విస్ట్ ఇచ్చారు. ఈ మూవీ సీక్వెల్ కోసం దిల్ రాజు సోదరుడి కుమారుడు ఆశిష్ ని తీసుకున్నట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది. ఆశీష్ ‘రౌడీ బాయ్స్’ మూవీతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. త్వరలో లవ్ మీ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇటీవల ఆశిష్ వివాహం జరిగింది. అయితే శతమానం భవితి మూవీలో శర్వాను తీసుకోకపోవడానికి కారణాలు తెలియదు.. అభిమానులు మాత్రం అతనికి అన్యాయం జరిగిందని అభిప్రాయ పడుతున్నారు. సీక్వెల్ లో శర్వాని తీసుకుంటే మంచి హిట్ అవుతుందని.. ఆశిష్ తో వర్కౌట్ అవుతుందా? అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ విషయంపై దిల్ రాజు ఎలా స్పందిస్తారో చూడాలి. ఈ విషయంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet Girişen çok kazandiran casino sitelerigrandpashabet linkHoliganbetHoliganbetHoliganbetHoliganbetjojobetgrandpashabetJojobetJojobetMadridbetMadridbetjojobetJojobetjojobetgoldenbahiscasibomcasibomberlinbetcasibomcasibomcasibom girişchild pornjojobetjojobetcasibomJojobetbetciojojobetjojobet girişjojobet girişcasibomcasibombetistbetcio