iDreamPost
android-app
ios-app

టిల్లు స్క్వేర్ లో అనుపమ గ్లామర్ షో వర్కౌట్ అవుతుందా?

  • Published Feb 15, 2024 | 12:38 PM Updated Updated Feb 15, 2024 | 12:38 PM

తాజాగా సిద్దు జొన్నలగడ్డ హీరోగా నటించిన టిల్లు స్క్వేర్ ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ లో ముఖ్యంగా అందరి చూపు అనుపమ వైపే ఉంది. మరి, ఈ సినిమాలో ఈమె పాత్ర ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి.

తాజాగా సిద్దు జొన్నలగడ్డ హీరోగా నటించిన టిల్లు స్క్వేర్ ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ లో ముఖ్యంగా అందరి చూపు అనుపమ వైపే ఉంది. మరి, ఈ సినిమాలో ఈమె పాత్ర ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి.

  • Published Feb 15, 2024 | 12:38 PMUpdated Feb 15, 2024 | 12:38 PM
టిల్లు స్క్వేర్ లో అనుపమ గ్లామర్ షో వర్కౌట్ అవుతుందా?

క్రేజీ హీరో సిద్దు జొన్నలగడ్డ హీరోగా మోస్ట్ అవైటెడ్ సీక్వెల్ టిల్లు స్క్వేర్ లో.. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఫస్ట్ లుక్ నుంచీ ఈ సినిమాలో తన ఇమేజ్ భిన్నంగా కనిపిస్తూ వచ్చిన అనుపమ, నిన్న ట్రైలర్ తో యువ ప్రేక్షకులని ఆకట్టుకునే విధంగా గ్లామర్ షో చేసి సర్ప్రైజ్ చేశారు. నిజానికి అ..ఆ, ప్రేమమ్ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన అనుపమ పరమేశ్వరన్ చాలా తొందరగానే స్టార్డం సంపాదించుకున్నారు. ఎక్కువగా హోమ్లీ పాత్రలకు పేరు తెచ్చుకున్న అనుపమ టిల్లు స్క్వేర్ తో పక్కా గ్లామర్ ఫీల్డ్ లోకి దిగారు.

ఎక్కువగా పక్కింటి అమ్మాయి తరహా క్యారెక్టర్స్ చేసిన అనుపమ టిల్లు స్క్వేర్‌లో బోల్డ్ అండ్ గ్లామరస్‌గా కనిపించారు. డీజే టిల్లుతో హీరో సిద్దు జొన్నలగడ్డకు మంచి పేరు వచ్చింది. ఇప్పుడు టిల్లూ స్క్వేర్ పై భారీ అంచనాలు ఉన్నాయి. ఫస్ట్ పార్ట్ లో రాధిక పాత్రలో నేహా శెట్టి అదిరిపోయేలా కనిపించి ప్రేక్షకులను అలరించారు. అయితే అనుపమ సీక్వెల్‌లో నేహను మించిపోయారు అనే చెప్పాలి. నిజానికి తను లిప్ లాక్ సీన్స్ కి ఓకే చెప్తారా లేదా అనే అనుమానం అందరిలో ఉండగా.. అందరి అంచనాలు దాటేసి ట్రైలర్ లోనే లిప్ లాక్ పెట్టారు చిత్ర నిర్మాతలు. ఇక సినిమాలో అనుపమ గ్లామర్ షో చూడటానికి చాలా మంది ప్రేక్షకులు సిద్ధంగా ఉన్నారు. మల్లిక్ రామ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి రామ్ మిర్యాల సంగీతం అందించారు. టిల్లు స్క్వేర్ చాలా కాలంగా మేకింగ్‌లో ఉంది. అయితే కాస్త లేట్ అయినప్పటికీ సినిమా ప్రేక్షకులను అలరిస్తుందని మేకర్స్ నమ్మకంగా ఉన్నారు.

అయితే ఒక వర్గం ప్రేక్షకులు మాత్రం అనుపమ పరమేశ్వరన్ ను గ్లామరస్ రోల్ లో చూడటం అంతగా బాగోదని అంటున్నారు. టిల్లు స్క్వేర్ కంటే ముందే రౌడీ బాయ్స్‌లో అనుపమ చేసిన లిప్‌లాక్‌లు చాలా మందిని ఆకట్టుకోలేదు, ఎందుకంటే ఆమెను పక్కింటి అమ్మాయి తరహా పాత్రల్లోనే చూడటానికి వారు ఇష్టపడుతున్నారు. ఇక టిల్లు స్క్వేర్ లో రొమాన్స్ మరియు బోల్డ్ డైలాగుల డోస్ రెట్టింపు చేస్తూ, అనుపమ పరమేశ్వరన్ నిన్న విడుదలైన ట్రైలర్‌లో అందరినీ షాక్ చేసారు. మరి సినిమాలో తన గ్లామర్ షో వర్కౌట్ అవుతుందా లేదా తెలియాలంటే మార్చి 29 వరకూ ఆగాల్సిందే.

Jojobet Girişgrandpashabetcasibomjojobetcasibomjojobetpokerklasmadridbetjojobetmatbet girişgrandpashabetDeneme Bonusu Veren Sitelergrandpashabet kayıp bonusugrandpashabet kayıp bonusugrandpashabet telegramgrandpashabet girişGrandpashabetGrandpashabetHiltonbetGrandpashabetjojobetjojobet girişcasibomcasibomgrandpashabetmarsbahis giriş