iDreamPost
android-app
ios-app

మెగాస్టార్ పక్కన కూర్చొన్న ఈమె ఎవరో గుర్తు పట్టారా..?

  • Published Feb 01, 2024 | 4:55 PM Updated Updated Feb 01, 2024 | 4:55 PM

తన డ్యాన్సులతో, నటనతో తెలుగు ఆడియన్స్ ఫిదా చేశారు మెగాస్టార్ చిరంజీవి. ఆయనకు అభిమాన గణం ఎక్కువ. ఇండస్ట్రీలోకి రావాలనుకుంటున్న వారికి ఆయనొక స్పూర్తి మంత్రం. కళామతల్లికి ఆయన చేసిన సేవలకు గానూ పద్మ విభూషణ్ తో సత్కరించింది కేంద్ర ప్రభుత్వం.

తన డ్యాన్సులతో, నటనతో తెలుగు ఆడియన్స్ ఫిదా చేశారు మెగాస్టార్ చిరంజీవి. ఆయనకు అభిమాన గణం ఎక్కువ. ఇండస్ట్రీలోకి రావాలనుకుంటున్న వారికి ఆయనొక స్పూర్తి మంత్రం. కళామతల్లికి ఆయన చేసిన సేవలకు గానూ పద్మ విభూషణ్ తో సత్కరించింది కేంద్ర ప్రభుత్వం.

  • Published Feb 01, 2024 | 4:55 PMUpdated Feb 01, 2024 | 4:55 PM
మెగాస్టార్ పక్కన కూర్చొన్న ఈమె ఎవరో గుర్తు పట్టారా..?

మెగాస్టార్ చిరంజీవి గురించి ఎంత చెప్పినా తక్కువే. తెలుగు చిత్ర పరిశ్రమకు దక్కిన అరుదైన ఆణిముత్యాల్లో చిరు ఒకరు. ఆయనొక నటనా శిఖరం. నటన, డ్యాన్సులతో టాలీవుడ్ ఇండస్ట్రీ గురించి దశ దిశలా చర్చించుకునేలా చేసిన నటుడాయన. 150 పైగా సినిమాలు చేసిన మెగాస్టార్.. కళామతల్లి ముద్దుబిడ్డగా మారిపోయారు. నిర్విరామంగా తెలుగు పరిశ్రమకు సేవలు అందిస్తూనే ఉన్నారు. ఆయన చేసిన కృషికి తగిన ఫలితం దక్కింది. దేశ రెండవ అత్యున్నత పౌర పురస్కారం పద్మ విభూషణ్‌తో సత్కరించింది కేంద్ర ప్రభుత్వం. చిరంజీవికి ఈ పురస్కారం దక్కడం పట్ల ఆయన అభిమానులే కాదూ తెలుగు చిత్ర పరిశ్రమ సంతోషాన్ని వ్యక్తం చేస్తోంది. అలాగే ఆయనను సినీ, రాజకీయ ప్రముఖులు కలిసి అభినందనలు తెలియజేస్తున్నారు.

ప్రస్తుతం ఈ పురస్కారం ఇచ్చిన ఆనందంలో ఉన్నారు మెగాస్టార్. అలాగే 156వ చిత్రం విశ్వంభర కోసం ప్రిపేర్ అవుతున్నారు. ఇప్పటికే షూటింగ్ స్టార్ కాగా, ఈ రోజు నుండే ఆయన సెట్స్‌లో అడుగుపెట్టబోతున్నారని టాక్. బింబిసార డైరెక్టర్ వశిష్ట మల్లిడి.. విశ్వంభరకు దర్శకత్వం వహిస్తున్నాడు. చిరు కెరీర్‌లోనే భారీ బడ్జెట్ మూవీగా తెరకెక్కబోతుంది. యువీ క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో చిరంజీవి పేరు టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలుస్తుంది. ఈ క్రమంలో ఓ పిక్ వైరల్ అవుతుంది. ఇదిగో ఇదే ఆ ఫోటో. ఇందులో  కలర్ ఫుల్ షర్ట్ ధరించిన చిరు.. ఏదో తీక్షణంగా ఆలోచిస్తున్నట్లు అనిపిస్తుంది. అయితే ఇదే పిక్ లో ఆయన పక్కన ఓ మహిళ కూర్చొని కనిపిస్తున్నారు. ఆమె ఎవరో గుర్తు పట్టారా..?

కాస్త కళ్లు పెద్దవి చేసి చూస్తే చెప్పేస్తారు.. ఆమె చిరంజీవి అర్థాంగి సురేఖ అని. 1980లో ఫిబ్రవరి 20న వీరి వివాహం జరిగింది. సురేఖ ప్రముఖ హాస్య నటుడు అల్లు రామలింగయ్య తనయ, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సోదరి అన్న సంగతి తెలిసిందే. అన్ని విషయాల్లో చిరంజీవికి తోడు నీడుగా, అండగా నిలుస్తూ వచ్చారు సురేఖ. ఈ ఫోటోలో వీరిద్దర్నీ చూస్తుంటే మేడ్ ఫర్ ఈచ్ అదర్ అనిపిస్తుంది కదూ.  ఈ పిక్‌లో సురేఖ చాలా సింపుల్ లుక్, సగటు మధ్య తరగతి గృహిణిలా కనిపిస్తున్నారు. ఈ దంపతులకు ముగ్గురు పిల్లలు. సుస్మిత, శ్రీజ,రామ్ చరణ్. రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ మూవీతో గ్లోబల్ స్టార్ అయ్యారు. ఇటీవల ఈ చిరంజీవి దంపతులు తాతయ్య, నాన్నమ్మలుగా ప్రమోటైన సంగతి విదితమే. చరణ్-ఉపాసన దంపతులకు గత ఏడాది పాప జన్మించింది. ఇక పెద్ద కుమార్తె సుస్మిత నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టారు. ఈ ఫోటోలో ఈ దంపతులను చూడగానే.. మీకు ఏమనిపిస్తుందో కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetjojobet girişbetcioJojobetJojobetJojobetjojobetgrandpashabetcasibomcasibom