iDreamPost
android-app
ios-app

డేర్ చేసి దిగాల్సింది! డేట్ దొరక్క సతమతం అవుతున్నాడట!

  • Author ajaykrishna Published - 10:44 AM, Sat - 9 September 23
  • Author ajaykrishna Published - 10:44 AM, Sat - 9 September 23
డేర్ చేసి దిగాల్సింది! డేట్ దొరక్క సతమతం అవుతున్నాడట!

డీజే టిల్లు.. గతేడాది ఆరంభంలో ఈ సినిమా చేసిన హంగామా అంతా ఇంతా కాదు. ఇన్నాళ్లు పక్కన పెట్టిన యంగ్ టాలెంట్ ని.. ఒక్కసారిగా ఇండస్ట్రీ గుర్తించేసింది.. హత్తుకుంది. ఇండస్ట్రీలో పరిస్థితుల గురించి తెలిసిందే. హిట్టు కొడితే దగ్గరికి తీసుకుంటుంది.. అదే ప్లాప్స్ పడితే దగ్గరకు తీసుకోవడానికి కూడా ఆలోచిస్తుంది. అవన్నీ దాటుకొని డీజే టిల్లుతో బ్లాక్ బస్టర్ కొట్టి చూపించాడు సిద్ధు జొన్నలగడ్డ. ఆ సినిమాలో హీరోగానే కాకుండా రైటర్ గా కూడా సక్సెస్ అయ్యాడు. చాలా ఏళ్ల తర్వాత నటుడిగా, రైటర్ గా సంతృప్తినిచ్చే గుర్తింపు లభించింది. దీంతో వెంటనే.. డీజే టిల్లుకు సీక్వెల్ ని అనౌన్స్ చేశాడు.

సితార ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మిస్తున్న ఈ సీక్వెల్ టీమ్ లో కొన్ని మార్పులు జరిగాయి. మొదటి దర్శకుడు మారి.. మల్లిక్ రామ్ ఆన్ బోర్డు అయ్యాడు. మ్యూజిక్ డైరెక్టర్ గా రామ్ మిర్యాల సెట్ అయిపోయాడు. హీరోయిన్ గా మలయాళం బ్యూటీ అనుపమ.. ఫస్ట్ టైమ్ తనలోని గ్లామర్, బోల్డ్ అవతారంలో సర్ప్రైజ్ చేసింది. ఇంకేముంది అన్ని కుదిరాయి.. డీజే టిల్లు 2 మూవీ.. సెప్టెంబర్ రిలీజ్ అని అందరూ అనుకున్నారు. కానీ.. ఎవరు ఊహించని విధంగా సినిమాని వాయిదా వేశారు. ఎందుకంటే.. రేస్ లో స్కంద, చంద్రముఖి 2, మార్క్ ఆంటోనీ ఇలా చాలా సినిమాలే ఉన్నాయి. కట్ చేస్తే.. వాటిని దృష్టిలో పెట్టుకొని డీజే టిల్లు అక్టోబర్ కి వాయిదా వేసుకున్నట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి.

వాస్తవానికి డీజే టిల్లు ఎప్పుడో రావాల్సిన సినిమా. కానీ.. వివిధ కారణాల వల్ల వాయిదా వేస్తూ వస్తున్నారు. తీరా వినాయక చవితికి ఫిక్స్ అనుకుంటున్న టైమ్ లో డేట్ ఇంకా కన్ఫర్మ్ కాలేదని షాకింగ్ న్యూస్ తెలిసింది. దీంతో ఫ్యాన్స్ అంతా నిరాశకు లోనయ్యారు. సెప్టెంబర్ నుండి వాయిదా వేసుకొని టిల్లు తప్పు చేశాడని.. మంచి ఛాన్స్ మిస్ చేసుకున్నాడని అంటున్నారు. అందుకు కారణం లేకపోలేదు. ముందుగా సెప్టెంబర్ 15కి రిలీజ్ అనుకున్న స్కంద, చంద్రముఖి 2 సినిమాలు వాయిదా పడి సెప్టెంబర్ 28కి ఫిక్స్ అయ్యాయి. ఇప్పుడు ఉన్న ఒక్కగానొక్క మార్క్ ఆంటోని రిలీజ్ కోర్టు కేసులో చిక్కుకుంది. సో.. డీజే టిల్లు 2 ముందే చెప్పినట్లు డేర్ చేసుంటే.. సినిమాకి ఉన్న క్రేజ్ ప్రకారం.. ఈజీగా రూ. 20-25 కోట్లు వసూల్ చేసేదని అంచనా వేస్తున్నారు. ఓవైపు అక్టోబర్ లో చాలా సినిమాలు రెడీ అవుతున్నాయి. సో.. టిల్లు భాయ్ ఈసారి ఏ డేట్ కి వస్తాడో చూడాలి. మరి డీజే టిల్లు 2పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.