iDreamPost
android-app
ios-app

Game Changer: గేమ్ ఛేంజర్.. శంకర్ ట్విస్ట్ ఇచ్చాడా? దిల్ రాజుకు కొత్త సమస్య?

  • Published Aug 24, 2024 | 1:17 PM Updated Updated Aug 24, 2024 | 1:17 PM

తాజాగా దిల్ రాజుకు గేమ్ ఛేంజర్ విషయంలో ఓ పెద్ద చిక్కువచ్చినట్లుగా తెలుస్తోంది. శంకర్ భారీ ట్విస్ట్ ఇచ్చాడని ఇండస్ట్రీలో టాక్. అసలు విషయం ఏంటంటే?

తాజాగా దిల్ రాజుకు గేమ్ ఛేంజర్ విషయంలో ఓ పెద్ద చిక్కువచ్చినట్లుగా తెలుస్తోంది. శంకర్ భారీ ట్విస్ట్ ఇచ్చాడని ఇండస్ట్రీలో టాక్. అసలు విషయం ఏంటంటే?

  • Published Aug 24, 2024 | 1:17 PMUpdated Aug 24, 2024 | 1:17 PM
Game Changer: గేమ్ ఛేంజర్.. శంకర్ ట్విస్ట్ ఇచ్చాడా? దిల్ రాజుకు కొత్త సమస్య?

దిల్ రాజు.. ఇండస్ట్రీలో హిట్ పల్స్ తెలిసిన నిర్మాతగా పేరొందాడు. ఆయన ఓ మూవీ నిర్మించాడటంటే.. అది గ్యారెంటీగా హిట్ అవుతుందన్న పేరు పరిశ్రమలో ఉంది. ప్రస్తుతం గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తో ‘గేమ్ ఛేంజర్’ అనే మూవీని నిర్మిస్తున్నాడు. స్టార్ డైరెక్టర్ శంకర్ ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నాడు. ఇక ఈ చిత్రం క్రిస్మస్ కానుకగా రిలీజ్ చేస్తామని దిల్ రాజు ప్రకటించాడు. ఇక్కడి వరకు అంతా సంతోషమే అయినా.. తాజాగా దిల్ రాజుకు ఓ పెద్ద చిక్కువచ్చినట్లుగా తెలుస్తోంది. శంకర్ భారీ ట్విస్ట్ ఇచ్చాడని ఇండస్ట్రీలో టాక్. అసలు విషయం ఏంటంటే?

‘గేమ్ ఛేంజర్’.. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్-శంకర్ కాంబోలో వస్తున్న పాన్ ఇండియా మూవీ. పొలిటికల్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రం డిసెంబర్ లో క్రిస్మస్ కానుకగా రిలీజ్ చేస్తామని ప్రొడ్యూసర్ దిల్ రాజు ప్రకటించారు. దాంతో చరణ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయ్యారు. ఇక షూటింగ్ కూడా పూర్తి అయినట్లు సమాచారం. కాగా.. రఫ్ కట్ చూసిన తర్వాత డైరెక్టర్ శంకర్ కొన్ని సీన్లను రీ షూట్ చేయాలని భావిస్తున్నట్లు దిల్ రాజుకు చెప్పారట. దాంతో దిల్ రాజుకు కొత్త చిక్కులు వచ్చిపడ్డాయి.

new tention for dil raju

కాగా.. ఈ రీ షూట్ కు రామ్ చరణ్ వి 4 నుంచి 5 రోజుల డేట్స్ కావాలట. అయితే దిల్ రాజు ఎలాగో అలా చరణ్ వి డేట్స్ తెస్తారు అనుకో.. కానీ శంకర్ షూట్ అంటే భారీ క్రూ, టెక్నీషియన్స్ ఇలా అన్ని విభాగాలకు సంబంధించిన వారి డేట్స్ తీసుకోవాలంటే చాలా కష్టంగా మారుతుంది. పైగా బడ్జెట్ కూడా పెరిగిపోతుంది. ఇవన్నీ ప్రస్తుతం దిల్ రాజుకు కొత్త తలనొప్పిని తెచ్చిపెడుతున్నాయి అంటున్నారు సినీ విశ్లేషకులు. షూటింగ్ పూర్తి అయ్యింది రిలీజ్ కు ఎలాంటి చిక్కులు ఉండవు అని భావించిన దిల్ రాజుకు శంకర్ ఊహించని ట్విస్ట్ ఇచ్చాడని ఈ విషయం తెలిసిన సినిమా లవర్స్ సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు. అయితే.. ఇలాంటి ఎన్నో సమస్యలను దిల్ రాజు పరిష్కరించే నేడు ఈ స్థాయిలో ఉన్నాడని, దీన్ని కూడా సాల్వ్ చేస్తాడని మరికొందరు అంటున్నారు. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibomgrandpashabet