iDreamPost
android-app
ios-app

విజయ్ దేవర కొండ మూవీ కోసం.. తారక్ , బాలకృష్ణ ?

  • Published Aug 24, 2024 | 12:09 PM Updated Updated Aug 24, 2024 | 12:09 PM

NTR or Balakrishna Voice Over For VD12 Movie: ప్రస్తుతం విజయ్ దేవరకొండ గౌత‌మ్ తిన్న‌నూరి దర్శకత్వంలో ఓ ప్రాజెక్ట్ తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ అప్ డేట్ వచ్చేసింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

NTR or Balakrishna Voice Over For VD12 Movie: ప్రస్తుతం విజయ్ దేవరకొండ గౌత‌మ్ తిన్న‌నూరి దర్శకత్వంలో ఓ ప్రాజెక్ట్ తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ అప్ డేట్ వచ్చేసింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

  • Published Aug 24, 2024 | 12:09 PMUpdated Aug 24, 2024 | 12:09 PM
విజయ్ దేవర కొండ మూవీ కోసం.. తారక్ , బాలకృష్ణ ?

ఇండస్ట్రీ లో ఉన్న యంగ్ హీరోలలో విజయ్ దేవర కొండ కూడా ఒకరు. రెండు మూడు సినిమాలతోనే ఇండస్ట్రీలో తనకంటూ ఓ మార్క్ ను సెట్ చేసుకున్నాడు. ఇక విజయ్ దేవర కొండ నుంచి ఆఖరిగా వచ్చిన మూవీ ఫ్యామిలీ స్టార్ . థియేటర్ లో ఈ సినిమా అంతంత మాత్రంగా అనిపించుకున్న సరే ఓటీటీ లో మాత్రం అదరగొట్టింది. ఇప్పుడు విజయ్ దేవర కొండ.. గౌతమ్ తిన్న‌నూరి దర్శకత్వంలో ఓ క్రేజి ప్రాజెక్ట్ తో బిజీగా ఉన్నారు. ఆల్రెడీ వీడీ 12 అనే వర్కింగ్ టైటిల్ తో.. ఈ సినిమాను అనౌన్స్ చేశారు. ఈ క్రమంలో తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ బజ్ వినిపిస్తుంది. ఆ వివరాలేంటో చూసేద్దాం.

విజయ్ దేవరకొండ ప్రస్తుతం నటిస్తున్న చిత్రం నుంచి.. ఇటీవల ఓ పోస్టర్ ను కూడా రివీల్ చేశారు మేకర్స్. ఈ సినిమాను సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యానర్స్ పై.. సూర్యదేవ‌ర నాగ‌వంశీ ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇక లేటెస్ట్ గా ఈ సినిమా నుంచి వినిపిస్తున్న బజ్ ఏంటంటే.. విజయ్ దేవర కొండ మూవీ టైటిల్ , టీజర్ కు.. జూనియర్ ఎన్టీఆర్ లేదా బాలకృష్ణ వాయిస్ ఓవర్ అందించనున్నట్లు సమాచారం. అంటే విజయ్ క్యారెక్టర్ ను వీరిలో ఒకరి వాయిస్ తో పరిచయం చేయనున్నారు. మరి చివరిగా ఎవరిని కన్ఫర్మ్ చేస్తారనే దానిపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. త్వరలోనే ఈ విషయంపై అధికారిక ప్రకటన చేయనున్నారు మేకర్స్. మరి రానున్న రోజుల్లో ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి అప్ డేట్స్ వస్తాయో వేచి చూడాలి.

ఇక వీడి 12 వర్కింగ్ టైటిల్ తో ఉన్న ఈ మూవీని.. మార్చి 28 2025 న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు.. ఆల్రెడీ అనౌన్స్ చేశారు మేకర్స్. దాదాపు రూ.80 కోట్ల బడ్జెట్ తో ఈ మూవీ తెరకెక్కనుంది. ఇప్పటికే డెబ్భై శాతం షూటింగ్ పూర్తయినట్లు సమాచారం. ఇక ఈ సినిమాతో పాటు విజయ్ మరొక రెండు సినిమాలకు కూడా.. గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది. రాజావారు రాణిగారు మూవీ డైరెక్టర్ రవికిరణ్ కోలా దర్శకత్వంలో ఓ సినిమా, టాక్సీవాలా మూవీ డైరెక్టర్ ఫేమ్ రాహుల్ సాంకృత్యాన్ కాంబోలో మ‌రో మూవీ కి ఓకే చెప్పినట్లు తెలుస్తుంది. ఇక ఈసారి విజయ్ ప్రేక్షకులకు ఎలాంటి ఎంటర్టైన్మెంట్ ను అందిస్తాడో వేచి చూడాలి. మరి వీడి 12 మూవీ విషయంలో తాజాగా వినిపిస్తున్న బజ్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

jojobetjojobet girişjojobetjojobet girişjojobetjojobet girişjojobet güncel giriş