iDreamPost
android-app
ios-app

గేమ్ ఛేంజర్ కోసం గేరు మారుస్తున్న శంకర్.. ఏదో గట్టిగానే ప్లాన్ చేస్తున్నారు.. !

  • Published Oct 24, 2024 | 1:14 PM Updated Updated Oct 24, 2024 | 1:14 PM

Game Changer Movie Update : గేమ్ ఛేంజర్ సినిమా కోసం మెగా అభిమానులు చాలా ఈగర్ వెయిట్ చేస్తున్నారన్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి సరైన అప్డేట్ అయితే రాలేదు. దీనితో ఇప్పుడు శంకర్ గేర్ మారుస్తున్నట్లు తెలుస్తుంది. అదేంటో చూసేద్దాం.

Game Changer Movie Update : గేమ్ ఛేంజర్ సినిమా కోసం మెగా అభిమానులు చాలా ఈగర్ వెయిట్ చేస్తున్నారన్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి సరైన అప్డేట్ అయితే రాలేదు. దీనితో ఇప్పుడు శంకర్ గేర్ మారుస్తున్నట్లు తెలుస్తుంది. అదేంటో చూసేద్దాం.

  • Published Oct 24, 2024 | 1:14 PMUpdated Oct 24, 2024 | 1:14 PM
గేమ్ ఛేంజర్ కోసం గేరు మారుస్తున్న శంకర్.. ఏదో గట్టిగానే ప్లాన్ చేస్తున్నారు.. !

వందల కోట్ల బడ్జెట్, స్టార్ క్యాస్టింగ్.. పెట్టిన బడ్జెట్ కి, చూపిస్తున్న స్టార్ క్యాస్టింగ్ కు తగిన బజ్ మాత్రం ఇంకా రావడం లేదు. మూడేళ్ళ కు పైగా సినిమా నిర్మాణం , దర్శకుడిపై ఇండియన్ 2 ప్రభావం , మొదటి సాంగ్ మీద వచ్చిన నెగిటివిటి.. ఇలా అన్నీ గేమ్ ఛేంజర్ మూవీ పై బాగా ఎఫెక్ట్ చూపిస్తున్నాయి. దీనితో ఇలా కాదని ఎలా అయినా సినిమా ఏంటో ప్రూవ్ చేయాలనీ.. శంకర్ గేర్ మార్చేందుకు రెడీ అవుతున్నాడు. దీపావళికి టీజర్ ను రిలీజ్ చేసే టార్గెట్ తో.. సాలిడ్ టీజర్ కట్ పై ఫోకస్ పెట్టాడు. ప్రస్తుతం టీజర్ ఎడిటింగ్ పనులు జరుగుతున్నాయి. త్వరలో బిజినెస్ అగ్రీమెంట్స్ జరిగే టైం కాబట్టి.. ట్రేడ్ లో జోష్ రావాలంటే టీజర్ పాత్ర చాలా ఉంటుంది. అసలు కథ ఇది అని తెలిస్తేనే … ఆ రేంజ్ లో బిజినెస్ కూడా జరుగుతుంది.

ఈ క్రమంలో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి సుమారు 150 కోట్ల థియేట్రికల్ బిజినెస్ ను ఆశిస్తున్నారు. జరిగిన బిజినెస్ కు తగిన రికవరీ రావాలంటే మాత్రం పోటీ తక్కువగా ఉండాలి. కానీ సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నారు కాబట్టి కాంపిటీషన్ తప్పదు. విశ్వంభరతో రావాల్సిన చిరంజీవి డ్రాప్ అయ్యాడు. రేస్ లో బాలకృష్ణ , వెంకటేష్ , అజిత్ , సందీప్ కిషన్ లాంటి హీరోలు ఉన్నారు. వీరిలో ఎవరు తప్పుకుంటారు , ఎవరు ఉంటారనేది తేలాలంటే కాస్త టైమ్ పట్టేలా ఉంది. ఎలాగూ రామ్ చరణ్ కు గ్లోబల్ ఇమేజ్ ఉంది. కానీ అది కేవలం ఓవర్శిస్ మార్కెట్ లో మాత్రమే వర్క్ అవుట్ అవుతుంది. లోకల్ మాస్ ఆడియన్స్ వరకు గేమ్ ఛేంజర్ చేరుకోవాలంటే మాత్రం.. ఆ రేంజ్ మాస్ కంటెంట్ పబ్లిక్ లో చూపించాల్సిందే. ఇవన్నీ జరగాలంటే దానికి బలమైన పునాది టీజర్ తోనే మొదలవుతుంది.

ఒక్కసారి టీజర్ వదిలారంటే.. వెంటనే ప్రమోషన్స్ స్పీడ్ పెంచాల్సి ఉంటుంది. ఇక్కడ ఓ వైపు ఎలాంటి హడావిడి లేకుండానే పుష్ప 2 దుమ్ము దులిపేస్తుంది. అసలైన అప్డేట్ రాకుండానే వెయ్యి కోట్లకు పైగా ప్రీ రిలీజ్ జరిగిందన్న వార్త మీడియా , సోషల్ మీడియా అంతా కమ్మేసింది. అసలు ట్రైలర్ లేకుండానే పుష్ప 2 ఇలా రచ్చ చేస్తుందంటే.. ఈ బ్రాండ్ దేశవ్యాప్తంగా ఎలా పెరిగిందో అర్ధం చేసుకోవచ్చు. సేమ్ ఇలానే గేమ్ చెంజర్ కు కూడా జరిగితే అదే పదివేలు అని మెగా ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఇంకా గేమ్ ఛేంజర్ సినిమా రిలీజ్ కు 75 రోజుల సమయం మాత్రమే ఉంది. ప్రస్తుతం సాంగ్ రిలీజ్ లు, టీజర్ కట్స్ తో ఫస్ట్ గేర్ దగ్గర ఉన్న గేమ్ ఛేంజర్ బండి.. కనీసం టీజర్ రిలీజ్ తర్వాతైనా థర్డ్ గేర్ కు వెళ్ళిపోయి స్పీడ్ పెంచుతుందేమో చూడాలి. ఇప్పటివరకు అయితే కథపై ఎలాంటి క్లారిటీ లేదు. టీజర్ తర్వాత శంకర్ ఎలాంటి క్లారిటీ ఇస్తాడా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.