iDreamPost
android-app
ios-app

యాంకర్ సుమ కుమారుడి మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన జక్కన్న

  • Published Oct 06, 2023 | 7:32 PM Updated Updated Oct 06, 2023 | 7:32 PM
  • Published Oct 06, 2023 | 7:32 PMUpdated Oct 06, 2023 | 7:32 PM
యాంకర్ సుమ కుమారుడి మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన జక్కన్న

యాంకర్ సుమ-రాజీవ్ కనకాల కుమారుడు రోషన్ వెండితెరపై అరంగేట్రం చేస్తున్నాడు. సినిమా రంగంలో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు. టాలీవుడ్ లో ఎంతమంది యాంకర్లు ఉన్నా యాంకర్ సుమ రేంజ్ వేరే లెవల్. టెలివిజన్ షోల నుంచి సినిమా ఈవెంట్ ల వరకు ఎందులో అయినా సుమ తన వాగ్దాటితో ఆధ్యాంతం ఆకట్టుకుంటుంది. మైక్ పట్టుకుందంటే చాలు గలగలా మాట్లాడుతూ వేదికపై సందడి చేస్తూ ప్రేక్షకుల్లో జోష్ నింపుతుంది యాంకర్ సుమ. మరోవైపు రాజీవ్ కనకాల సినిమాల్లో విభిన్నమైన పాత్రలు చేసి అభిమానుల్లో ప్రత్యేకమైన గుర్తింపు పొందాడు. ఇప్పుడు రోషన్ కనకాల తల్లిదండ్రుల అడుగుజాడల్లో నడిచేందుకు సిద్ధమయ్యాడు. ఇదివరకే చైల్డ్ ఆర్టిస్టుగా పలు సినిమాలు చేసిన రోషన్ ఓ సినిమా ద్వారా హీరోగా టాలీవుడ్ కి ఎంట్రీ ఇస్తున్నాడు.

తాజాగా రోషన్ కనకాల నటిస్తున్న సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను దర్శకధీరుడు రాజమౌళి సోషల్ మీడియా వేదికగా రిలీజ్ చేసి చిత్ర యూనిట్ కు శుభాకాంక్షలు తెలియాజేశారు. డైరెక్టర్ రవికాంత్ పేరుపు దర్శకత్వం వహిస్తున్న బబుల్ గమ్ సినిమాలో హీరోగా రోషన్ కనకాల హీరోయిన్ గా చెరుకూరి మానస చౌదరి నటిస్తోంది. ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ మరియు మహేశ్వరి మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కాగా ఈ చిత్రం ఫస్ట్ లుక్ ను రాజమౌళి విడుదల చేశారు.

ఈ సందర్భంగా జక్కన్న సోషల్ మీడియాలో.. ” నటుడిగా అరంగేట్రం చేసిన రోషన్ నీకు అభినందనలు… నీకంటూ ఒక సొంత గుర్తింపు తెచ్చుకొని రాజీవ్ మరియు సుమ గారు గర్వపడేలా చేయాలని కోరుకుంటున్నాను. మరియు బబుల్ గమ్ టీమ్ కు శుభాకాంక్షలు” అని తెలిపాడు. ఇక ఫస్ట్ లుక్ లో రోషన్, మానస రొమాంటిక్ గా హగ్ చేసుకుని చూయింగ్ గమ్ నములుతూ ఆకట్టుకున్నారు. ఫస్ట్ లుక్ పోస్టర్ రొమాంటిక్ గా ఉండడంతో యూత్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. మరి ఈ సినిమా ద్వారా రోషన్ కనకాల హిట్ అందుకుంటాడా లేదా అనేది తెలియాలంటే రిలీజ్ వరకు వేచి చూడాల్సిందే.

Jojobet GirişjojobetjojobetMadridbetMadridbetMadridbetMadridbetjojobetJojobetcasibomfixbetjojobetsüpertotobetsüpertotobetcasibomcasibomcasibom girişşanlıurfa konteynerbetciobetciobetcioGrandpashabetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobetjojobet giriş