iDreamPost
android-app
ios-app

మురారీ రీ రిలీజ్‌ వేళ కృష్ణవంశీ ఆసక్తికర వ్యాఖ్యలు.. తను లేకపోతే ఈ సినిమా లేదు

  • Published Jul 19, 2024 | 12:50 PM Updated Updated Jul 19, 2024 | 12:50 PM

Krishna Vamsi: తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు మురారీ సినిమా రీ రిలీజ్ అయిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా రీ రిలీజ్ సందర్భంగా డైరెక్టర్ కృష్ణవంశీ మహేష్ అభిమానులతో సోషల్ మీడియాలో చిట్ చాట్ చేశారు. ఈ క్రమంలోనే ఓ నెటిజన్ అడిగన ప్రశ్నకు కృష్ణ వంశీ డబ్బు కోసం చేయనని నాకు నచ్చితే చేస్తానంటూ పలు తనదైన స్టైల్ ల్లో సమాధానం తెలిపారు.

Krishna Vamsi: తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు మురారీ సినిమా రీ రిలీజ్ అయిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా రీ రిలీజ్ సందర్భంగా డైరెక్టర్ కృష్ణవంశీ మహేష్ అభిమానులతో సోషల్ మీడియాలో చిట్ చాట్ చేశారు. ఈ క్రమంలోనే ఓ నెటిజన్ అడిగన ప్రశ్నకు కృష్ణ వంశీ డబ్బు కోసం చేయనని నాకు నచ్చితే చేస్తానంటూ పలు తనదైన స్టైల్ ల్లో సమాధానం తెలిపారు.

  • Published Jul 19, 2024 | 12:50 PMUpdated Jul 19, 2024 | 12:50 PM
మురారీ రీ రిలీజ్‌ వేళ కృష్ణవంశీ ఆసక్తికర వ్యాఖ్యలు.. తను లేకపోతే ఈ సినిమా లేదు

డైరెక్టర్ ‘కృష్ణ వంశీ’.. టాలీవుడ్ లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను తెరకెక్కించిన దర్శకుల్లో ఈయన కూడా ఒకరు. అయితే ప్రస్తుతానికి ఈయన అంతగా ఫామ్ లో లేరు. కానీ, ఒకప్పుడు మంచి క్లాసికల్ సినిమాలను ఇండస్ట్రీకి అందించి సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా.. తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు కృష్ణ వంశీ. అలాగే కెరీర్ ప్రారంభంలో కృష్ణ వంశీ చిత్రాలకు ఉండే క్రేజ్ వేరు. ఈ క్రమంలోనే స్టార్ హీరోలు కూడా ఈయనతో సినిమా చేయడానికి ఆసక్తి చూపేవారు. ఇకపోతే కృష్ణ వంశీ తెరకెక్కించిన సినిమాల్లో కమర్షియల్ గా ఆడకపోయినా సినిమా సింధూరం. కానీ ఈ సినిమాకు అప్పట్లో సఫరేట్ ఫ్యాన్ బేస్ ఉండేది.

ఇక క్లాసికల్ గా, కమర్షియల్ గా హిట్ కొట్టిన వాటిలో నిన్నే పెళ్లాడతా,అంత:పురం, మురారి, ఖడ్గం వంటి సినిమాలు ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవ్వడమే కాకుండా.. మంచి హిట్ అందుకున్నాయి. అలాగే కృష్ణ వంశీ కేరీర్ లో భారీ డిజాస్టర్ చిత్రాలు కూడా ఉన్నాయి.ఇక ఈయన చివరిగా రాఖీ సినిమా తర్వాత మళ్లీ ఇంతవరకు సూపర్ హిట్ అందుకున్న సినిమాలు లేవు. ఇలా విభన్న కథలతో ప్రేక్షకులను అలరించిన కృష్ణ వంశీ ఇప్పుడు కాస్త జోరు తగ్గించారనే చెప్పవచ్చు. ఇదిలా ఉంటే.. తాజాగా కృష్ణ వంశీ మూరారి సినిమా రీరిల్ సందర్భంగా..  సోషల్ మీడియాలో మహేష్ బాబు అభిమానులతో సరదాగా చిట్ చాట్ చేశారు. ఈ క్రమంలోనే మురారి నాటి రోజుల్న కఋష్ణ వంశీ తలుచుకున్నారు. అంతేకాకుండా.. పాటల కంపోజింగ్, సినిమా షూటింగ్ రోజుల గురించి ఫ్యాన్స్ అడుగుతుండటంతో కృష్ణవంశీ ఎక్స్ లో వాటికి సమాధానాలు చెబుతున్నారు. ఇంతలోనే ఓ నెటిజన్స్ అడిగినా ప్రశ్నకు కృష్ణ వంశీ డబ్బు కోసం సినిమా చేయనంటూ తనదైన శైలిలో సమాధానం తెలిపారు.

Murari

కృష్ణ వంశీ మహేష్ ఫ్యాన్స్ తో చిట్ చాట్ చేయడంతో.. మురారి సినిమా గురించి నెట్టింట బాగా ట్రెండ్ అయ్యింది. ముఖ్యంగా ఈ సినిమా కానీ, అందులో పాటలు కానీ అద్భుతంగా తెరకెక్కించారు కృష్ణ వంశీ. ఈ క్రమంలోనే మురారి సినిమా పాటల కోసం ఎంతలా కష్టపడాల్సి వచ్చిందో కృష్ణవంశీ చెప్పుకొస్తున్నాడు. అంతలోనే ఓ నెటిజన్ మురారి సినిమా మహేష్ బాబు కాకపోతే ఇంకెవరితో చేసి ఉండేవారని అడిగాడు. దానికి కృష్ణవంశీ తనదైన స్టైల్ లో సమాధానం తెలిపారు. ఈ సందర్భంగా కృష్ణవంశీ.. ‘ఎమోనండి నాకు తెలియదు, నాకేం అనిపిస్తే అదే చేస్తాను. ముఖ్యంగా నచ్చితే చేస్తాను కానీ, డబ్బు కోసమో, ఫేమ్ కోసమో మాత్రం చేయను.  చేసింది ఏదైనా సంతృప్తితో చేస్తాను’ అని ఆయన చెప్పుకొచ్చారు.

ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి. ఇక ఆయన చెప్పిన మాటల బట్టి అర్ధం అవుతుంది.  కృష్ణవంశీ మంచి కథకు ప్రాధ్యాన్యత ఇస్తారు కానీ, డబ్బు కాదు. అలాగే తన  కథకు ఏ హీరో సెట్ అవుతారో ఆయన ఊహించుకొని అద్భుతంగా తెరకెక్కిస్తారు. మరి, అటువంటి దర్శకుడి సినిమాలు ఇప్పుడు మిస్ అవుతున్నమంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇకపోతే కృష్ణ వంశీ చివరగా రంగమార్తాండ సినిమాతో ప్రేక్షకుల ముందకు వచ్చారు. కమర్షియల్‌గా అంత వర్కౌట్ కాకపోయినా ఆడియెన్స్‌ను మాత్రం మెప్పించింది.  మరి, ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కృష్ణ వంశీ కామెంట్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişjojobetJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişjojobet giriş