iDreamPost
android-app
ios-app

KTR కారు అనుకొని దిల్ రాజు అల్లుడి కారు చోరీ! చివరికి..

  • Author ajaykrishna Published - 09:04 AM, Sat - 14 October 23
  • Author ajaykrishna Published - 09:04 AM, Sat - 14 October 23
KTR కారు అనుకొని దిల్ రాజు అల్లుడి కారు చోరీ! చివరికి..

టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు అల్లుడికి సంబంధించిన ఖరీదైన కారు చోరీకి గురైంది. ఏంటి.. ఏకంగా ప్రొడ్యూసర్ అల్లుడి కారునే దొంగిలించారని తెలిసి షాక్ అయిపోయారు పోలీసులు. అయినా.. అలర్ట్ అయిపోయి చోరీకి గురైన గంట వ్యవధిలోనే కారు జాడను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం ఈ విషయం ఇండస్ట్రీ వర్గాలలో హాట్ టాపిక్ గా మారింది. ఆ వివరాల్లోకి వెళ్తే.. దిల్ రాజు అల్లుడు అర్చిత్ రెడ్డి శుక్రవారం ఉదయం జూబ్లీహిల్స్ లోని దసపల్లా హోటల్ కి వెళ్లారట. సుమారు రూ. కోటి డెబ్భై లక్షలు విలువైన పోర్షె కారు అది. ఆ కారులో అర్చిత్ రెడ్డి దసపల్లా హోటల్ కి వెళ్లారని తెలుస్తుంది.

అక్కడికి వెళ్ళాక కారు పక్కన పెట్టి హోటల్ లోపలికి వెళ్లి.. పని చూసుకొని వచ్చేలోపు కారు కనిపించలేదట. దీంతో వెంటనే జూబ్లీహిల్స్ హిల్స్ పోలీసులకు సమాచారం అందించగా.. ఘటన స్థలానికి డిఐ వీరశేఖర్, డిఎస్సై రాజశేఖర్ చేరుకొని వివరాలు సేకరించారు. వెంటనే తమ సిబ్బందిని అలర్ట్ చేసి.. సీసీ కెమెరా ఫుటేజ్ చెక్ చేశారు. కారు జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వద్ద సిగ్నల్ జంప్ చేసిందని.. కేబిఆర్ ఉద్యానవనం వైపు వెళ్లిందని గుర్తించారు. అప్పటికి కేబిఆర్ వైపు ట్రాఫిక్ పోలీసులను అప్రమత్తం చేసి.. కారును స్వాధీనం చేసుకొని, నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

అనంతరం నిందితుడి గురించి ఆరా తీయగా.. తాను ఆకాష్ అంబానీని మీట్ అవ్వడానికి వెళ్తున్నట్లు చెప్పాడట. తాను ఆకాష్ అంబానీ పర్సనల్ అసిస్టెంట్ అని.. హృతిక్ రోషన్ తో కలిసి కేటిఆర్ కారు తీసుకొని వెళ్లాలని తనకు సూచించినట్లు చెప్పుకొచ్చాడు. నిందితుడు మన్సూరాబాద్ ఏరియాకు చెందిన మల్లెల సాయి కిరణ్ గా గుర్తించారు పోలీసులు. అయితే.. కేటీఆర్ కారు కోసం అని చెప్పేసరికి షాక్ అయిన పోలీసులు.. అతని కుటుంబ సభ్యులకి కాల్ చేశారు. సాయి కిరణ్ కి మతిస్థిమితం లేదని, బ్రెయిన్ లైఫ్ ఫౌండేషన్ సంస్థలో చికిత్స పొందుతున్నాడని వారు తెలిపారు.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetHoliganbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetbetwoon girişgrandpashabetEscortes BelgiqueGrandpashabetCasibomGrandpashabet Girişgrandpashabet