ఈ మధ్య కాలంలో సినిమాలు రిచ్‌గా తీయాలనే తపన, కోరిక మేకర్స్‌లో ఎక్కువగా కనిపిస్తోంది. అందుకే ఖర్చు ఎక్కువైనా వాళ్లు వెనక్కి పోవడం లేదు. కల్యాణ్ రామ్ కొత్త మూవీ ‘డెవిల్’ విషయంలోనూ మేకర్స్ ఇలాగే చేసినట్లు అర్థమవుతోంది.
ఈ మధ్య కాలంలో సినిమాలు రిచ్‌గా తీయాలనే తపన, కోరిక మేకర్స్‌లో ఎక్కువగా కనిపిస్తోంది. అందుకే ఖర్చు ఎక్కువైనా వాళ్లు వెనక్కి పోవడం లేదు. కల్యాణ్ రామ్ కొత్త మూవీ ‘డెవిల్’ విషయంలోనూ మేకర్స్ ఇలాగే చేసినట్లు అర్థమవుతోంది.
సినిమాలను రిచ్‌గా తీయాలనుకోవడం ఈ మధ్య కాలంలో బాగా పెరిగిపోయింది. పాన్ ఇండియా ట్రెండ్ మొదలవ్వడంతో మూవీస్‌ను బహు భాషల్లో రిలీజ్ చేయడం కామన్ అయిపోయింది. ఇతర భాషల్లో విడుదల చేయడం వల్ల ఒకవేళ అక్కడా హిట్టయితే ప్రాఫిట్స్ పెరుగుతున్నాయి. ఓటీటీ-టెలివిజన్ రైట్స్ రూపంలో రిలీజ్‌కు ముందే చాలా ఫిల్మ్స్ సేఫ్ అయిపోతున్నాయి. ఒకవేళ విడుదల తర్వాత కలెక్షన్స్ బాగా వస్తే ప్రాఫిట్ మరింత పెరిగే అవకాశం ఉంది. అందుకే మూవీస్ క్వాలిటీ విషయంలో మేకర్స్ ఎక్కడా కాంప్రమైజ్ అవుతున్నట్లు కనిపించడం లేదు. ఇతర భాషల్లోనూ విడుదల చేస్తున్నాం కాబట్టి పక్క ఇండస్ట్రీల నుంచి పేరొందిన స్టార్లను దింపుతున్నారు. అదే టైమ్‌లో ప్రతి ఫ్రేమ్ రిచ్‌గా ఉండాలని ప్రొడక్షన్ కాస్ట్‌ను కూడా పెంచేస్తున్నారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.
ఒక్కోసారి యాక్టర్స్ రెమ్యూనరేషన్స్కు ఎక్కువ డబ్బులు ఖర్చవుతుంటే.. కొన్నిసార్లు సెట్స్, ఫారెన్‌లో షూటింగ్, భారీ యాక్షన్, డ్యాన్స్ సీక్వెన్సుల వల్ల కాస్ట్ పెరుగుతోందని అంటున్నారు. ఏదేమైనా పెరిగిన ఖర్చుల వల్ల మూవీ బడ్జెట్ పెరగడం, థియేట్రికల్ రిలీజ్‌తో దాన్ని రికవర్ చేసుకోవడం చాలా సందర్భాల్లో కష్టంగా మారుతోంది. సినిమా బాగుందంటే కలెక్షన్స్ వస్తున్నాయి. బాగోలేదనే టాక్ వస్తే మాత్రం మొదటి రోజు ఈవెనింగ్ షోస్ నుంచే వసూళ్లు పడిపోతున్నాయి. అందుకే బడ్జెట్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని సీనియర్ ఫిల్మ్ మేకర్స్ చెబుతుండటం చూసే ఉంటారు. అయితే కథ-కథనాలు, స్టార్స్ ఉన్నారనే ధీమానో లేదా కాంబినేషన్స్ సెట్ అయ్యాయనే ఉద్దేశంతో భారీ బడ్జెట్లు పెట్టేందుకు వెనుకాడటం లేదు.
ఒక్కోసారి హీరోల రేంజ్‌కు మించి ఖర్చు పెట్టి.. అవి వెనక్కి రాబట్టేందుకు తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నారు. స్టార్ హీరో కల్యాణ్ రామ్ సినిమా విషయంలోనూ ఇప్పుడు అలాంటి సాహసమే చేస్తున్నట్లు కనిపిస్తోంది. మీడియం రేంజ్ హీరోగా పేరున్న కల్యాణ్ రామ్ ‘బింబిసార’తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. దీంతో ఆయన మూవీస్‌కు భారీ బడ్జెట్ పెట్టేందుకూ నిర్మాతలు డేర్ చేస్తున్నారు. కల్యాణ్ రామ్ కొత్త చిత్రం ‘డెవిల్’ను కూడా భారీ బడ్జెట్‌తో తెరకెక్కించినట్లు ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. అందుకు తగ్గట్లే తాజాగా విడుదలైన ఈ మూవీ ట్రైలర్ రిచ్‌గా ఉండటం విశేషం. ట్రైలర్‌ను బట్టి చూస్తే సినిమా కోసం మేకర్స్ భారీగా ఖర్చు పెట్టినట్లు అర్థమవుతోంది.
‘డెవిల్’ ట్రైలర్‌ను బట్టి చూస్తే మూవీకి దాదాపుగా రూ.50 కోట్ల వరకు బడ్జెట్ అయినట్లు కనిపిస్తోంది. ఒకవేళ అదే నిజమైతే ఈ మూవీ హిట్టవ్వాలంటే రూ.100 కోట్ల గ్రాస్ రాబట్టాలి. కల్యాణ్ రామ్ కెరీర్లో హయ్యెస్ట్ వస్తే గానీ ఆ నంబర్ రాదు. ‘బింబిసార’కు కూడా ఆ స్థాయిలో వసూళ్లు రాలేదు. ఇది ఒకరకంగా రిస్కీ గేమ్ అనే చెప్పాలి. దీంట్లో నెగ్గుకురావాలంటే స్టోరీ, స్క్రీన్‌ప్లే, యాక్టింగ్.. ఇలా అన్ని రకాలుగా ‘డెవిల్’ ఆకట్టుకోవాలి. అప్పుడే భారీ వసూళ్లు సాధ్యమవుతాయి లేకపోతే మాత్రం అంతేస్థాయిలో నష్టాలు మూటగట్టుకోవాల్సి ఉంటుంది. మరి.. ‘డెవిల్’తో కల్యాణ్ రామ్ ఆడుతున్న రిస్కీ గేమ్‌పై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: తలైవర్ 170 టైటిల్ టీజర్ రివ్యూ!