iDreamPost
android-app
ios-app

తలైవర్ 170 టైటిల్ టీజర్ రివ్యూ!

Thalaivar 170 Title Teaser: రజినీకాంత్ సినిమా వస్తోందంటే వరల్డ్ వైడ్ గా ప్రేక్షకుల్లో ఒక ఉత్సాహం నెలకొంటుంది. ఇప్పుడు తలైవర్ 170కి సంబంధించి టైటిల్ టీజర్ ని విడుదల చేశారు.

Thalaivar 170 Title Teaser: రజినీకాంత్ సినిమా వస్తోందంటే వరల్డ్ వైడ్ గా ప్రేక్షకుల్లో ఒక ఉత్సాహం నెలకొంటుంది. ఇప్పుడు తలైవర్ 170కి సంబంధించి టైటిల్ టీజర్ ని విడుదల చేశారు.

తలైవర్ 170 టైటిల్ టీజర్ రివ్యూ!

ప్రస్తుతం ఇండియన్ సినిమా ప్రేక్షకులు సూపర్ స్టార్, తలైవర్ పుట్టిన రోజుని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. స్టార్లు ఎంత మంది ఉన్నా సూపర్ స్టార్ ఒకరే ఉంటారు అన్నట్లుగా దశాబ్దాలుగా రజినీకాంత్ సినిమా ప్రపంచాన్ని ఏలుతున్నారు. ఆయన నటనలోనే కాదు.. వ్యక్తిత్వంలో కూడా సూపర్ స్టార్ అని మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన పుట్టిన రోజు సందర్భంగా అభిమానులకు లైకా ప్రొడక్షన్స్ ఒక అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చింది. ఆయన చేయబోతున్న 170 చిత్రానికి సంబంధించిన టైటిల్ టీజర్ ను విడుదల చేసింది. అలాగే కథకు సంబంధించి కూడా ఒక క్లారిటీని ఇచ్చింది.

ఈ తలైవర్ 170 టైటిల్ వెట్టాయన్ గా ప్రకటించారు. ఈ సినిమాలో కూడా రజినీకాంత్ కాప్ రోల్ ప్లే చేస్తున్నారే అవిషయం ఫస్ట్ షాట్ చూడగానే తెలిసిపోతుంది. అయితే ఇందులో జైలర్ గా చేస్తున్నారా? లేక పోలీసు ఆఫీసర్ గా కనిపిస్తారా అనే విషయం తెలియాల్సి ఉంది. స్టైల్ పరంగా ఈ మూవీ కూడా నెక్ట్స్ లెవల్లో ఉండబోతోందనే విషయం అర్థమైపోతోంది. ప్రస్తుతం ఈ టైటిల్ టీజర్లో కేవలం రజినీకాంత్ క్యారెక్టర్ ని మాత్రమే ఎస్టాబ్లిష్ చేశారు. యాక్షన్ పరంగా మాత్రం ప్రేక్షకుల అంచనాలను ఎక్కడా తగ్గించలనే అనిపిస్తోంది. అలాగే ఈ సినిమాలో కాస్టింగ్ చూస్తే అందరికీ మతులు పోతాయి. ఎందుకంటే ఈ మూవీలో అమితాబ్ బచ్చన్, రానా దగ్గుబాటి, ఫహద్ ఫాజిల్, మంజూ వారియర్, కిశోర్, రితికా సింగ్, దసరా విజయన్, జీఎం సుందర్, రావు రమేశ్ ఇలా చాలా మందే ఉన్నారు. ఇంక ఈ మూవీకి కూడా అనిరుధ్ మ్యూజిక్ ని అందిస్తున్నాడు. టైటిల్ టీజర్ లోనే ఈ మూవీలో మ్యూజిక్ ఎలా ఉండబోతోందో ఒక క్లారిటీ ఇచ్చాడు. ఒక మంచి బ్యాగ్రౌండ్ స్కోర్ తో ఇప్పటికే అనిరుధ్ ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నాడు. మరి.. తలావైర్ 170 మూవీ వెట్టాయన్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişMadridbetMariobetmeritbetmeritbet girişcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetCasibomCasibomGrandpashabetcasibomgrandpashabetmeritbet girişgrandpashabetjojobet girişcasibom girişgrandpashabet