iDreamPost
android-app
ios-app

మాస్ట్రో ఇళయరాజా కాళ్లపై పడిన దేవిశ్రీ ప్రసాద్.. ఎందుకంటే?

  • Author singhj Published - 07:29 PM, Sat - 26 August 23
  • Author singhj Published - 07:29 PM, Sat - 26 August 23
మాస్ట్రో ఇళయరాజా కాళ్లపై పడిన దేవిశ్రీ ప్రసాద్.. ఎందుకంటే?

భారతీయ చలనచిత్ర పరిశ్రమలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే జాతీయ అవార్డుల్లో ఈసారి టాలీవుడ్ తన సత్తా చాటింది. ఒక పురస్కారం వస్తేనే గొప్ప అనుకుంటే.. ఏకంగా 10 అవార్డులు కొల్లగొట్టి అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తింది తెలుగు చిత్ర పరిశ్రమ. 2021 సంవత్సరానికి గానూ కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో టాలీవుడ్ సత్తా చాటింది. జాతీయ ఉత్తమ నటుడి పురస్కారానికి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఎంపికయ్యారు. ఆయన నటించిన ‘పుష్ప’ చిత్రానికి సంగీతం అందించిన దేవిశ్రీ ప్రసాద్​కు కూడా నేషనల్ అవార్డు దక్కింది.

‘పుష్ప’ సినిమాకు అందించిన సంగీతానికి గానూ దేవిశ్రీ ప్రసాద్ నేషనల్ అవార్డు గెలుచుకున్నారు. జాతీయ పురస్కారం రావడంతో దేవిశ్రీ సంబురాల్లో మునిగిపోయారు. ఆయనకు అందరూ విషెస్ చెబుతున్నారు. డీఎస్పీని పొగుడుతూ సోషల్ మీడియాలో నెటిజన్స్ పోస్టులు పెడుతున్నారు. వాళ్లందరికీ థ్యాంక్స్ చెప్పిన దేవిశ్రీ.. ఇవాళ తన గురువును కలసి ఆశీస్సులు తీసుకున్నారు. మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజాను కలిశారు డీఎస్పీ. ఆయన కాళ్ల మీద పడి ఆశీర్వాదం తీసుకున్నారు.

ఇళయరాజాను కలసిన విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు దేవిశ్రీ ప్రసాద్. ఇళయరాజాకు థ్యాంక్స్ చెప్పిన దేవిశ్రీ.. ఆయన తనకు స్ఫూర్తి అని చెప్పుకొచ్చారు. జాతీయ అవార్డుకు ఎంపికైన నేపథ్యంలో ఇప్పటివరకు సాగిన తన ప్రయాణానికి ఇళయరాజా ఇచ్చిన స్ఫూర్తే కారణమని దేవిశ్రీ పేర్కొన్నారు. మ్యూజిక్ మాస్ట్రోను దేవిశ్రీ కలసిన ఫొటోలు, వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. కాగా, 69వ జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో ‘పుష్ప’తో పాటు మరో టాలీవుడ్ మూవీ రచ్చ చేసింది. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’ ఏకంగా 6 అవార్డులకు ఎంపికై సంచలనం సృష్టించింది.