Swetha
Devara Movie Talk: దేవర రికార్డుల మోత మోగిపోనుంది. మొదటి నుంచి ఈ దేవరపై ఎంత హైప్ ఉందో.. అందరికి తెలిసిందే. కానీ ఒక్కసారి సినిమా రిలీజ్ అయినా తర్వాత మాత్రం ఎక్కడో కాస్త మిక్స్డ్ టాక్ వచ్చింది. కానీ ఇప్పుడు మాత్రం కాస్త చేంజ్ అవుతూ ఉంది. అదేంటో చూసేద్దాం.
Devara Movie Talk: దేవర రికార్డుల మోత మోగిపోనుంది. మొదటి నుంచి ఈ దేవరపై ఎంత హైప్ ఉందో.. అందరికి తెలిసిందే. కానీ ఒక్కసారి సినిమా రిలీజ్ అయినా తర్వాత మాత్రం ఎక్కడో కాస్త మిక్స్డ్ టాక్ వచ్చింది. కానీ ఇప్పుడు మాత్రం కాస్త చేంజ్ అవుతూ ఉంది. అదేంటో చూసేద్దాం.
Swetha
దేవరోడి ఊచకోత మొదలైంది. ఇలా థియేటర్స్ లో బొమ్మ పడిందో లేదో.. అలా మీడియా సోషల్ మీడియాను ఆక్రమించేసింది. ఏది ఓపెన్ చేసినా దేవర గురించే వార్తలు. నిజమే తారక్ ఆరేళ్ళ తర్వాత సోలోగా తారక్ స్క్రీన్ పై కనిపించబోతున్నాడనే ఉత్సాహంతో.. దేవరపై కొండత ఆశలు పెట్టుకున్నారు అభిమానులు. అంచనాలకు మించిన భారీ అంచనాలను దేవరపై నెలకొన్నాయి. దీనితో మొదటి షో తర్వాత కొన్ని మిక్స్డ్ టాక్స్ వినిపించాయి. దీనితో నార్మల్ ఆడియన్స్ కు కాస్త సందేహాలు మొదలయ్యాయి. సినిమా రిలీజ్ కు ముందు ఆహా ఓహో అంటూ హైప్ పెంచిన అభిమానులు..తీరా ఇప్పుడు ఇలా అంటున్నారేంటి అంటూ పెదవి విరుస్తున్నారు. కానీ ఇప్పుడు రెండు, మూడు షోస్ తర్వాత టాక్ చూస్తే మాత్రం.. రెస్పాన్స్ చేంజ్ అవుతూ వస్తుంది. అదేంటో చూసేద్దాం.
ప్రేక్షకులను కథలోకి తీసుకువెళ్లడంలో దర్శకుడు కాస్త ఫెయిల్ అయ్యాడు. దీనితో మొదటి 15 నిముషాలు నెమ్మదిగా సాగిపోయింది. ఫస్ట్ హాఫ్ లో యాక్షన్ సిక్వెన్స్ లు , ఫైట్ లతో దూసుకుపోయిన దేవర.. సెకండ్ హాఫ్ లో మాత్రం కాస్త ల్యాగ్ అయ్యాడు. ఇవన్నీ దేవర మొదటి షో స్టార్ట్ అయిన కొన్ని గంటల వరకు వినిపించిన టాక్స్. కానీ ఇప్పుడు టాక్ పూర్తిగా మారిపోయింది. నార్మల్ ఆడియన్స్ , ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వస్తుంది. దేవరోడి దెబ్బకు రికార్డ్స్ తిరగరాయడం ఖాయం. లాంగ్ రన్ లో థియేటర్స్ లో దేవర దున్నేస్తుంది. అనిరుధ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కు థియేటర్స్ లో మోత మోగిపోయింది. ఆచార్య తర్వాత దేవరతో సరైన దెబ్బ కొట్టాడు కొరటాల. ఇది ఇప్పుడు దేవర గురించి వినిపిస్తున్న బ్లాక్ బస్టర్ టాక్. సో దీనిని బట్టి కచ్చితంగా అనుకున్న రేంజ్ లో దేవర కలెక్షన్స్ కొల్లగొడుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
అయితే మొదటిలో దేవరకు అలాంటి టాక్ రావడం వెనుక కారణం లేకపోలేదు. ఫస్ట్ షోస్ అంటే దాదాపు థియేటర్ అంతా కూడా అభిమానులతో ఫుల్ అయిపోయి ఉంటుంది. సో ఫ్యాన్స్ ఎలాగూ ఇప్పటివరకు ఓ రేంజ్ లో ఊహించారు కాబట్టి.. అక్కడక్కడ కొన్ని ఎలిమెంట్స్ వారిని మెప్పించలేకపోవచ్చు. ఇది ఏ సినిమాలోనైనా సహజం. కానీ దర్శకుడు చెప్పినట్లుగా ఎలాంటి అంచనాలు పెట్టుకోకుండా థియేటర్ కు వెళ్ళి సినిమా చూస్తే మాత్రం.. ప్రేక్షకులు ఇంప్రెస్ అవ్వడం ఖాయం. ఇప్పుడు ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి వస్తున్న టాక్ కూడా ఇదే. మరి లాంగ్ రన్ లో దేవర ఎలాంటి రికార్డ్స్ ను బ్రేక్ చేస్తుందో చూడాలి. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.