దేవర సినిమాకు NTRకు అన్ని కోట్ల రెమ్యునరేషనా?

Devara Movie: కొరటాల శివ-తారక్ కాంబోలో వచ్చిన సెకండ్ మూవీ దేవర. సెప్టెంబర్ 27న థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమా కోసం ఎవరెవరు ఎంతంత రెమ్యునరేషన్ తీసుకున్నారంటే...

Devara Movie: కొరటాల శివ-తారక్ కాంబోలో వచ్చిన సెకండ్ మూవీ దేవర. సెప్టెంబర్ 27న థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమా కోసం ఎవరెవరు ఎంతంత రెమ్యునరేషన్ తీసుకున్నారంటే...

థియేటర్లలో దేవర మేనియా మొదలైంది. చాన్నాళ్ల తర్వాత మ్యాన్ ఆఫ్ ది మాసెస్ జూనియర్ ఎన్టీఆర్‌ను తెరపై చూసిన అభిమానులు ఉబ్బితబ్బిబ్బు అయిపోతున్నారు. బాక్సాఫీసుకు అసలైన బాప్ వచ్చాడంటూ సంబరపడిపోతున్నారు. భారీ అంచనాల నడుమ పాన్ ఇండియా లెవల్లో విడుదలైన ఈ సినిమా పాజిటివ్ రివ్యూస్, రేటింగ్స్‌తో దూసుకెళుతుంది. డ్యూయల్ రోల్‌లో తారక్ అదిరిపోయిడంటూ పూనకాలు తెచ్చుకుంటున్నారు. ఆచార్య ప్లాప్ తర్వాత కొరటాల శివ గట్టి క్యంబాక్ ఇచ్చాడంటూ అంటున్నారు. అలాగే రాజమౌళి సెంటిమెంట్ బ్రేక్ చేశాడని పొంగిపోతున్నారు ఫ్యాన్స్. దేవరను రెండు పార్టులుగా తెరకెక్కిస్తోన్న సంగతి విదితమే. పార్ట్ 1 కోసం సుమారు రూ. 300 కోట్లను ఖర్చు పెట్టినట్లు తెలుస్తుంది. ఇదిలా ఉంటే.. ఈ సినిమా కోసం ఎవరెవరు ఎంతెంత రెమ్యునరేషన్ తీసుకున్నారన్న విషయం నెట్టింట్లో వైరల్ అవుతుంది.

ఈ సినిమా కోసం జూనియర్ ఎన్టీఆర్.. రూ. 60 కోట్లు తీసుకుంటున్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇది సినిమా మొత్తం బడ్జెట్‌లో దాదాపు 20 శాతమని తెలుస్తుంది. ఇక తొలిసారిగా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న బాలీవుడ్ యాక్టర్ సైఫ్ అలీఖాన్‌కు రూ. 10 కోట్లు చార్జ్ చేసినట్లు తెలుస్తోంది. ఒకప్పటి స్టార్ బ్యూటీ శ్రీదేవి తనయ.. జాన్వీ కపూర్ రూ. 5 కోట్లు చెల్లించారట. ఇక ప్రకాశ్ రాజ్ తన పాత్ర కోసం రూ. 1. 5కోట్లు తీసుకున్నారని టాక్ వినిపిస్తోంది. షైన్ టామ్ చాకోకు 50 లక్షల నుండి కోటి రూపాయలు ఇచ్చినట్లు సమాచారం. సెకండ్ హీరోయిన్ శృతి కూడా ఇంచుమించు ఇంతే చార్జ్ చేసినట్లు తెలుస్తుంది. ఇక శ్రీకాంత్‌కు 50 లక్షలు, మురళీ శర్మ, నరైన్‌లకు ఒక్కొక్కరికి 40 లక్షలు, కళైయరసన్‌లకు 25 లక్షలు పారితోషికం ఇచ్చినట్లు తెలుస్తుంది. ఇక దర్శకుడు కొరటాల శివ రూ. 30 కోట్ల వరకు అందుకున్నారని టాక్. ఇక మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్‌కు సైతం బాగానే ముట్టినట్లు ఇండస్ట్రీలో గట్టిగానే వినిపిస్తోంది.

ఇక దేవర విడుదల ముందే రికార్డులు సృష్టించింది. ఓవర్సీస్‌లో అడ్వాన్స్డ్ బుకింగ్ సేల్స్ లో అత్యంత వేగంగా మిలియన్ డాలర్ల క్లబ్‌లోకి చేరిన తొలి చిత్రంగా నిలిచింది. అలాగే చుట్టమల్లే చుట్టేస్తోంది సాంగ్ యూట్యూబ్‌ను షేక్ చేసేసింది. యూట్యూబ్‌లో అత్యంత వేగంగా 100 మిలియన్స్ వ్యూస్ సొంతం చేసుకున్న పాటగా నిలిచిపోయింది. అలాగే లాస్ ఏంజిల్స్‌లో జరుగుతున్న బియాండ్ ఫెస్ట్‌లో ప్రదర్శితం కానున్న తొలి భారతీయ చిత్రం కూడా దేవర కావడం విశేషం. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో అత్యధిక సంఖ్యలో డాల్బీ అట్మాస్ షోలను ప్రదర్శించనున్న తొలి భారతీయ చిత్రంగా నిలిచింది. అంతేనా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీగానే జరిగింది. ఓటీటీ, థియేటర్, శాటిలైట్ రూపంలో సుమారు రూ. 400 కోట్ల వరకు బిజినెస్ జరిగినట్లు సమాచారం. ఇక ఓటీటీ రైట్స్‌ను ప్రముఖ సంస్థ నెట్ ఫ్లిక్స్.. అత్యంత భారీ రేటుకు కొనుగోలు చేసింది. అన్ని భాషలకు సంబంధించి.. రూ. 150 కోట్లకు పైగా ఖర్చుపెట్టినట్లు తెలుస్తోంది.

Show comments