iDreamPost
android-app
ios-app

అభిమానులు గర్వపడేలా సినిమాలు చేస్తా.. తారక్ ఎమోషనల్ నోట్

  • Published Oct 15, 2024 | 5:20 PM Updated Updated Oct 15, 2024 | 5:20 PM

దేవరతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు తారక్. 500 కోట్ల రూపాయల క్లబ్ లోకి చేరిపోయింది. దీంతో టీంకి, అభిమానులకు ధన్యవాదాలు తెలుపుతూ ఎమోషనల్ లెటర్ డ్రాప్ చేశాడు యంగ్ టైగర్.

దేవరతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు తారక్. 500 కోట్ల రూపాయల క్లబ్ లోకి చేరిపోయింది. దీంతో టీంకి, అభిమానులకు ధన్యవాదాలు తెలుపుతూ ఎమోషనల్ లెటర్ డ్రాప్ చేశాడు యంగ్ టైగర్.

  • Published Oct 15, 2024 | 5:20 PMUpdated Oct 15, 2024 | 5:20 PM
అభిమానులు గర్వపడేలా సినిమాలు చేస్తా.. తారక్ ఎమోషనల్ నోట్

దేవరతో అభిమానుల ఆకలి తీర్చేశాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఫ్యాన్స్ కూడా తారక్‌కు మంచి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు. సినిమాను హిట్ బాట పట్టించడమే కాకుండా.. 500 కోట్ల క్లబ్‌లోకి చేర్చారు. దసరా ముగిసినా కూడా థియేటర్లలో దేవర జోరు కొనసాగుతూనే ఉంది. సక్సెస్ ఫుల్‌గా దూసుకెళుతోంది. ఈ నేపథ్యంలో ఇంతటి ఘన విజయాన్ని అందించిన అభిమానులకు, ప్రేక్షకులకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు చెబుతూ సుదీర్ఘమైన పోస్టర్ పంచుకున్నారు మ్యాన్ ఆఫ్ ది మాసెస్. అలానే ఈ చిత్రంలో నటించిన నటీనటులు, టెక్నికల్ టీమ్‌కి ధన్యవాదాలు తెలిపారు. ప్రస్తుతం ఈ పోస్టర్ వైరల్ అవుతుంది. “దేవర పార్ట్ 1కి అందుతున్న అద్భుతమైన స్పందనకి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ సినిమా ఎప్పటికీ నా హృదయంలో ప్రత్యేక స్థానం కలిగి ఉంటుంది. నా సహ నటులైన సైఫ్ అలీ ఖాన్ సర్, జాన్వీ కపూర్, ప్రకాష్ రాజ్, శ్రీకాంత్ గారు .. అలానే ఇతర నటీనటులకి నా హృదయపూర్వక ధన్యవాదాలు. వారు తమ పాత్రలకి ప్రాణం పోసి.. మా కథకి జీవం ఇచ్చారు.

నా దర్శకుడు కొరటాల శివ గారికి ధన్యవాదాలు. ఈ కథను సృష్టించి ఆయన దిశానిర్దేశంతోనే ఈ ప్రాజెక్ట్ విజయవంతమైంది. అనిరుధ్ అద్భుతమైన సంగీతం, రత్నవేలు సర్ సినిమాటోగ్రఫీ, సాబు సర్ ప్రొడక్ష్ డిజైన్, యుగంధర్ గారు వీఎఫ్ఎక్స్, శ్రీకర్ ప్రసాద్ గారు ఎడిటింగ్‌తో ఈ చిత్రాన్ని అద్భుతంగా మలిచినందుకు ధన్యవాదాలు. ఈ సినిమాను విజయవంతంగా ప్రదర్శించిన పంపిణీదారులు, థియేటర్ ప్రదర్శకులకి ధన్యవాదాలు. నా సినీ పరిశ్రమ మిత్రులకి, వారు అందించిన ప్రేమకి ధన్యవాదాలు. అలాగే దేశవ్యాప్తంగా ఉన్న మీడియాకి మా సినిమాను విశేషంగా ప్రోత్సహించినందుకు కృతజ్ఞతలు. మా నిర్మాతలు సుధాకర్ మిక్కిలినేని, హరికృష్ణ కొసరాజు గారికి ఈ ప్రాజెక్టును విజయవంతంగా రూపొందించినందుకు ధన్యవాదాలు. ప్రపంచ నలుమూలల ఇంతటి ఆదరణ చూపిస్తున్న ప్రేక్షక దేవుళ్లకు నా ధన్యవాదాలు.’ అంటూ ఎక్స్ వేదికగా పోస్టు పంచుకున్నారు. `

“నా కుటుంబ సభ్యులైన నా అభిమానులందరికీ గత నెల రోజులుగా దేవర చిత్రాన్ని ఒక పండుగలా జరుపుకుంటున్నందుకు శిరస్సు వంచి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మీరు చూపించే ప్రేమ అభిమానమే నన్ను ఈ స్థాయికి చేర్చింది. మీరు ఎల్లప్పుడు గర్వపడే చిత్రాలు చేస్తూనే ఉండటానికి నా శాయశక్తులా ప్రయత్నిస్తాను. దేవర పార్ట్ 1 చిత్రాన్ని మీ భుజాలపై మోసి.. ఇంతటి ఘన విజయవంతంగా మార్చినందుకు కృతజ్ఞతలు” అంటూ తన డైహార్డ్ అభిమానులకు స్పెషల్‌గా కృతజ్ఞతలు చెప్పారు తారక్. లవ్ అంటూ తన సిగ్నచర్ తో కూడిన పోస్టర్ పంచుకున్నారు. దీనికి యాక్టర్ విజయ్ టీమ్ స్పందిస్తూ.. ఎన్టీఆర్‌కు, ఆయన టీంకి కంగ్రాట్స్ చెప్పింది.  ఇక తారక్ నెక్ట్  ప్రాజెక్టుల విషయానికి వస్తే.. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నాడు. అలాగే బాలీవుడ్ మూవీ వార్ 2లో కూడా యాక్ట్ చేస్తున్నాడు. వీటి తర్వాతే దేవర 2 ఉండబోతుంది. నెక్ట్స్  జూనియర్ ఎన్టీఆర్ చేయబోయే మూవీ ఎన్ని కోట్లు కొల్లగొడుతుందనుకుంటున్నారో  మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişjojobet girişCasibombetciograndpashabet