iDreamPost
android-app
ios-app

దేవర ముందు ఊరించే టార్గెట్.. రజనీ కాస్త కరుణిస్తే అది ఖాయం

  • Published Oct 07, 2024 | 4:22 PM Updated Updated Oct 07, 2024 | 4:22 PM

Devara Vs Vettaiyan : దేవర సినిమా గురించి అంతా పాజిటివ్ గానే నడుస్తుంది. ఏదేమైనా అందరికి కలిసి వచ్చేలా తారక్ తన భుజాల మీద దీనిని మోశాడు. మరి దసరా వరకు దేవరకు తిరుగులేదని అనుకున్నారు. కానీ ఇప్పుడు దీనికి రజినీకాంత్ చెక్ పెట్టేలా ఉన్నాడు. ఆ విషయాలేంటో చూసేద్దాం.

Devara Vs Vettaiyan : దేవర సినిమా గురించి అంతా పాజిటివ్ గానే నడుస్తుంది. ఏదేమైనా అందరికి కలిసి వచ్చేలా తారక్ తన భుజాల మీద దీనిని మోశాడు. మరి దసరా వరకు దేవరకు తిరుగులేదని అనుకున్నారు. కానీ ఇప్పుడు దీనికి రజినీకాంత్ చెక్ పెట్టేలా ఉన్నాడు. ఆ విషయాలేంటో చూసేద్దాం.

  • Published Oct 07, 2024 | 4:22 PMUpdated Oct 07, 2024 | 4:22 PM
దేవర ముందు ఊరించే టార్గెట్..  రజనీ కాస్త కరుణిస్తే అది ఖాయం

దేవరతో తారక్ ప్లాప్ దర్శకుల పాలిట వరంగా మారితే.. దేవరకు మాత్రం రిలీజ్ కు రెడీగా ఉన్న స్టార్ హీరోల సినిమాలన్నీ.. అదృష్టాన్ని ఇచ్చాయి. ఎందుకంటే దేవరకు పోటీగా ఏ సినిమా రిలీజ్ అవ్వలేదు. తెలుగులో మాత్రమే కాదు మిగిలిన ఏ భాషలోనూ కొత్త సినిమాలు రిలీజ్ అవ్వలేదు. దీనితో సింగల్ హ్యాండ్ తో అన్ని ఏరియాల థియేటర్స్ లో దేవర దున్నేసింది. ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర 600 కోట్ల దిశగా హై స్పీడ్ తో దూసుకుపోతుంది. దాదాపు డిసెంబర్ వరకు ఏ స్టార్ హీరో సినిమా రిలీజ్ కు రెడీగా లేదు. పైగా ఇప్పుడు దసరా హాలిడేస్ కూడా దేవరకు కలిసొచ్చాయి. కాబట్టి దేవరకు ఇక తిరుగులేదని అంతా ఫిక్స్ అయ్యారు. ప్రస్తుతం డెవరోడి ముందు ఊరించే రికార్డ్ ఉంది. ఇది కనుక క్రాస్ చేస్తే అభిమానులు ఉర్రూతలూగిపోవడం ఖాయం. కానీ ఇక్కడే ఓ చిక్కు కూడా ఉంది.

బాక్స్ ఆఫీస్ బరిలో హై స్పీడ్ తో దూసుకుపోతున్న దేవరకు.. బ్రేకులు వేయడానికి వచ్చేస్తున్నారు రజిని కాంత్. సూపర్ స్టార్ నటించిన వెట్టయ్యన్‌ సినిమాను అక్టోబర్ 10 న రిలీజ్ చేయనున్నారు మేకర్స్. ఈ సినిమాను తమిళంతో పాటు తెలుగు , హిందీ , కన్నడ భాషల్లో విడుదల చేయనున్నారు. ఇప్పటికైతే మూవీ గురించి అంత బజ్ ఏమి వినిపించడం లేదు. మూవీ రిలీజ్ కు ఇంకా కొద్దీ రోజుల సమయం మాత్రమే ఉంది. అయినా సరే ప్రమోషన్స్ విషయంలో ఎక్కడ ఎలాంటి హడావిడి లేదు . రజినీకాంత్ అనారోగ్యం కారణంగా ప్రమోషన్స్ లేవని కొందరు. సినిమాలో స్టఫ్ లేదు కాబట్టి ప్రమోషన్స్ లేవని మరికొందరు. ఇలా వెట్టయ్యన్‌ మూవీ గురించి రకరకాల డిస్కషన్స్ జరుగుతున్నాయి. ఏదేమైనా అక్కడున్నది సూపర్ స్టార్ కాబట్టి పాజిటివ్ టాక్ వచ్చే ఛాన్స్ లేకపోలేదు. ఒకవేళ అదే కనుక జరిగితే దేవర వెనక్కు తగ్గాల్సిందే. వచ్చిన రికార్డ్స్ తో సరిపెట్టాల్సిందే.

ప్రస్తుతానికైతే దేవర మ్యానియా థియేటర్ లో అదే ఊపుతో కొనసాగుతుంది. ఇది ఎంత కాలం కొనసాగుతుంది అనేది.. వెట్టయ్యన్‌ మూవీపైనే ఆధారపడి ఉంది. ఒకవేళ రజిని మూవీ ఏ మాత్రం నెగెటివ్ లేదా యావరేజ్ టాక్ వచ్చినా.. దేవర వేటను ఇంకెవరు ఆపలేరు. ఒక్కో రికార్డ్ నరుక్కుంటూ వెళ్తుంది. దేవర విడుదలయ్యి ఇన్ని రోజులు గడిచినా కూడా ఆ వేడి మాత్రం ఇంకా అలానే ఉంది. మరి మ్యాన్ ఆఫ్ ది మాసెస్ చేసిన మ్యాజిక్ అలాంటిది. ఊరికే పోతుందా ఆ కష్టం, కమిట్మెంట్. అందుకే ఫ్యాన్స్ కూడా దేవరను ఊహించిన దానికంటే ఒకింత ఎక్కువగానే హిట్ చేశారు. గర్వంగా మా బాస్ హిట్ కొట్టాడంటూ కాలర్ ఎగరేస్తున్నారు.  మరి రజిని కాంత్ కాస్త కనికరిస్తే.. దేవరోడు అనుకున్న టార్గెట్ రీచ్ అవుతాడు. ఏమౌతుందో చూడాలి. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişmeritbetcasibomJojobet girişcasibomJojobet GirişcasibomcasibomcasibomjojobetjojobetMadridbetMadridbetcasibom girişmatbet girişganobetpokerklasjojobetCasibomJojobetGrandPashaBet destekDeneme bonusu veren siteler 2026jojobet girişCasibom GirişGrandPashaBet ŞikayetJojobet GirişJojobet Giriş