iDreamPost
android-app
ios-app

దేవర గ్లింప్స్ డేట్ ఫిక్స్.. ఆసక్తి రేపుతోన్న పోస్టర్

  • Published Jan 01, 2024 | 11:57 AM Updated Updated Jan 01, 2024 | 11:57 AM

ఆర్ఆర్ఆర్ మూవీ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ నటిస్తోన్న చిత్రం దేవర. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నాడు. వీరిద్దరి కాంబోలో రాబోతున్న రెండవ చిత్రం ఇది. శ్రీదేవి తనయ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది.

ఆర్ఆర్ఆర్ మూవీ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ నటిస్తోన్న చిత్రం దేవర. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నాడు. వీరిద్దరి కాంబోలో రాబోతున్న రెండవ చిత్రం ఇది. శ్రీదేవి తనయ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది.

  • Published Jan 01, 2024 | 11:57 AMUpdated Jan 01, 2024 | 11:57 AM
దేవర గ్లింప్స్ డేట్ ఫిక్స్.. ఆసక్తి రేపుతోన్న పోస్టర్

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్- దర్శకుడు కొరటాల శివ కాంబినేషనల్‌లో వస్తున్న రెండవ చిత్రం దేవర. అతిలోక సుందరి, దివంగత నటి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ ఈ చిత్రం ద్వారా టాలీవుడ్‌లోకి తెరంగేట్రం చేస్తోంది. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. ఇప్పటికే విడుదల చేసిన పోస్టర్లు సినిమాపై హైప్ క్రియేట్ చేశాయి. ఈ మూవీ ఈ ఏడాది ఏప్రిల్‌లో విడుదల కానుంది. అయితే న్యూ ఇయర్ సందర్భంగా తారక్ అభిమానులకు చిత్ర యూనిట్ సర్ ప్రైజ్ ప్లాన్ చేసింది. ఈ మూవీకి సంబంధించిన కొత్త అప్ డేట్ ఇచ్చింది. దేవర సినిమా గ్లింప్స్ విడుదల తేదీని ప్రకటించింది. దానికి సంబంధించిన పోస్టర్‌ను ఎన్టీఆర్ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.

జనవరి 8వ తేదీన గ్లింప్స్ విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది చిత్ర యూనిట్. ఈ పోస్టర్‌లో తారక్ నయా లుక్స్‌లో కనిపిస్తున్నాడు. తొలి పోస్టర్‌లో బ్లాక్ డ్రెస్సులో కత్తిపట్టి సీరియస్ లుక్స్‌లో కనిపించిన యంగ్ టైగర్.. ఈ పోస్టర్‌లో క్లాస్‌గా టక్ చేసుకుని దర్శనమిచ్చాడు. సముద్రాన్ని చీల్చుకుంటూ వస్తున్న నావలో ఎన్టీఆర్ కనిపించాడు. అయితే ఇటీవల డెవిల్ ప్రమోషన్స్ సందర్భంగా దేవర మూవీ నిర్మాత, హీరో కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ.. దేవర టీజర్ వేరే లెవల్ అంటూ చెప్పుకొచ్చాడు. దీంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయిపోయారు. ఇప్పుడు ఈ మూవీ గ్లింప్స్ డేట్ ఫిక్స్ చేశారు. జనతా గ్యారేజ్ తర్వాత వీరిద్దరూ కాంబోలో రాబోతున్న మూవీ కావడంతో సినిమాపై అంచాలు విపరీతంగా పెరిగిపోయాయి.

ఇక ఈ  చిత్రాన్ని రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు కొరటాల. ఈ మూవీలో తారక్‌ను ఢీ కొట్టబోతున్నాడు ఆదిపురుష్ విలన్ సైఫ్ అలీఖాన్.  దేవ‌ర మూవీని దాదాపు మూడువందల కోట్ల బడ్జెట్‌తో హరి కొసరాజు, సుధాక‌ర్ మిక్కిలినేనితో క‌లిసి  క‌ళ్యాణ్ రామ్ నిర్మిస్తున్నాడు. ఈ మూవీకి అనిరుధ్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ పిక్చర్ ఏప్రిల్ 5న విడుదల కానుంది. ఆర్ఆర్ఆర్ మూవీ తర్వాత ఎన్టీఆర్ నుండి రాబోతున్న మూవీ ఇదే. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఈ పోస్టర్ ను చూసి..ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇక గ్లింప్స్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.  ఇప్పటి వరకు విడుదల చేసిన పోస్టర్లను చూస్తుంటే.. సినిమా ఎలా ఉండబోతుందని భావిస్తున్నారో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet Girişcasibomjojobetjojobetcasibomcasibomcasibomgrandpashabetşanlıurfa konteynerbetciobetcioHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetJojobetJojobetJojobetjojobetgrandpashabetgrandpashabetgrandpashabetganobetcasibom girişbetciojojobetgrandpashabet giriş