iDreamPost
android-app
ios-app

‘సలార్’ చూపిన ఖాన్సార్ నగర్ ఎక్కడుందో తెలుసా?

  • Published Dec 23, 2023 | 11:55 AM Updated Updated Dec 23, 2023 | 11:55 AM

Salaar Movie: ప్యాన్ ఇండియా స్టార్‌ ప్రభాస్‌- ప్రశాంత్‌ నీల్‌ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘సలార్‌’ సినిమా శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయింది. అయితే ఈ సినిమాలోని ఓ నగరంపై అందరిలో ఆసక్తినెలకొంది.

Salaar Movie: ప్యాన్ ఇండియా స్టార్‌ ప్రభాస్‌- ప్రశాంత్‌ నీల్‌ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘సలార్‌’ సినిమా శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయింది. అయితే ఈ సినిమాలోని ఓ నగరంపై అందరిలో ఆసక్తినెలకొంది.

  • Published Dec 23, 2023 | 11:55 AMUpdated Dec 23, 2023 | 11:55 AM
‘సలార్’ చూపిన ఖాన్సార్ నగర్ ఎక్కడుందో తెలుసా?

ప్రస్తుతం రెండవ రోజు బాక్సాఫీస్ వద్ద ‘సలార్’ కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఎక్కడ చూసిన  అభిమానులు సలార్ నామ స్మరణే చేస్తున్నారు. చాలా గ్యాప్ తరువాత ప్రభాస్ ఒక డిఫరెంట్ లుక్ లో తెర పైన కనిపించి, తన గ్రేస్ తో ప్రేక్షకులకు పూనకాలు తెప్పించాడు. దీనితో ఎప్పటినుంచో ప్రభాస్ హిట్ కోసం ఎదురు చూస్తున్న అభిమానుల ఆకలి తీరింది. ఇంకా, అంతటా ‘సలార్’ సందడి వాతావరణమే కనిపిస్తోంది. అయితే, ఈ చిత్రంలోని ఓ ప్రాంతంపై ఇప్పుడు అందరికి ఆసక్తి నెలకొంది. ‘సలార్’ కథ అంతా కూడా ఖన్సార్ అనే నగరం చుట్టూ తిరుగుతుంది. మరి నిజంగా, ఈ ప్రాంతం ఉందా! లేదా కేవలం సినిమా కోసమే సృష్టించారా ! అనే సందేహాలు తలెత్తాయి. దీని గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

ఖన్సార్ అనే నగరం విషయానికొస్తే, ‘సలార్’ చిత్రంలో ఈ నగరం పాకిస్తాన్, గుజరాత్ మధ్య ఉన్నట్లుగా చూపించారు. అయితే, ఈ ఊహాజనిత నగరాన్ని దర్శకుడు కావాలని పెట్టాడో, లేదా దాని గురించి తెలుసుకుని పెట్టాడో తెలియదు కానీ.. ఖన్సార్ నిజంగానే ఉంది.  కానీ,  సినిమాలో చూపించిన విధంగానే సరిగ్గా ఆ ప్రదేశంలోనే ఖన్సార్ ఉందనుకుంటే..పొరపాటే. నిజానికి ఈ ఖన్సార్ ఇరాన్ లో ఉంది.

Where is Khansar Nagar in 'Salar'

ఇరాన్ దేశంలోని ఒక నగరాన్ని ఖాన్సార్ కౌంటీ అంటారు. ఇది ఇరాన్ లోని ఇస్ఫహాన్ ప్రావిన్స్ లో నెలకొంది. ఈ నగరంలో దాదాపు 22వేల మందికి పైగా పర్షియన్స్ నివసిస్తూ ఉంటారు. అయితే, సలార్ చిత్రంలో చూపించిన ఖాన్సార్ కు, అసలైన ఖాన్సార్ కౌంటీకి చాలా తేడా ఉంది. మరి, దర్శకుడు ప్రశాంత్ నీల్ ఏం చేసినా, అందులో ఎదో ఒక ప్రత్యేకతను కనబరుస్తూనే ఉంటాడు. ఈ నేపథ్యంలో ఖన్సార్ కథ బయటకు వచ్చింది. కాగా, ప్రస్తుతం ఓ రకంగా అంతటా సలార్ ప్రభంజనం సృష్టిస్తోందని చెప్పి తీరాలి. రిలీజైన మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది.

విమర్శలు కురిపించిన అందరిని ఒక్క దెబ్బతో సైలెంట్ అయ్యేలా చేసింది ‘సలార్’. విడుదలైన మొదటి రోజునే, ఊహించిన దానికంటే ఎక్కువ కలెక్షన్లను వసూళ్లు చేస్తోంది. వీకెండ్ రానుండడంతో సలార్ కలెక్షన్ల పై అంచనాలు ఇంకాస్త పెరిగాయి. ప్రభాస్ సలార్ పార్ట్- 1  థియేటర్లలో దుమ్ము రేపుతుండడంతో..  ఈ చిత్రం చూసిన వారికి  సెకండ్ పార్ట్ ఎప్పుడు వస్తుందనే ఆసక్తి మొదలైపోయింది. మరి.. సలార్ లో కనిపించిన ఖన్సార్ పై, రియాలిటీలో ఉన్న ఖాన్సార్ కౌంటీపై.. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetjojobetjojobetjojobetbetwooncasibomcasibomcasibombetcio giriş