iDreamPost
android-app
ios-app

దీప్తి సునైనాకు యాక్సిడెంట్ అంటూ వార్తలు.. క్లారిటీ ఇచ్చిన నటి!

  • Author singhj Published - 08:42 PM, Sat - 9 September 23
  • Author singhj Published - 08:42 PM, Sat - 9 September 23
దీప్తి సునైనాకు యాక్సిడెంట్ అంటూ వార్తలు.. క్లారిటీ ఇచ్చిన నటి!

టిక్​ టాక్, డబ్ స్మాష్​ వీడియోల ద్వారా సోషల్ మీడియాలో మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో దీప్తి సునైనా ఒకరు. ఆ తర్వాత యూట్యూబ్​లో కూడా ఆమె హల్​చల్ చేశారు. షార్ట్ ఫిల్మ్స్, రీల్స్, టిక్​ టాక్.. ఇలా దేన్నీ వదలకుండా అందివచ్చిన ఛాన్సులను వాడుకుంటూ పోయారు. మంచి పాపులారిటీ తెచ్చుకోవడంతో బిగ్​బాస్​ షోలో పాల్గొనే అవకాశాన్ని దక్కించుకున్నారీ మిల్కీ బ్యూటీ. ఆ షోతో తన క్రేజ్​ను మరింత పెంచుకున్నారు. షణ్ముఖ్ జశ్వంత్​తో ప్రేమ వ్యవహారం ద్వారా కూడా దీప్తి పేరు వార్తల్లో బాగా వినిపించింది.

ప్రస్తుతం యూట్యూబ్​లో షార్ట్​ ఫిల్మ్స్​తో పాటు కవర్ సాంగ్స్ చేస్తున్న దీప్తి సునైనాకు యాక్సిడెంట్ అయ్యిందని వార్తలు వచ్చాయి. క్షణాల్లో ఈ న్యూస్ బాగా వైరల్ అయిపోయింది. దీంతో నిజంగానే దీప్తికి ప్రమాదమైందని చాలా మంది అనుకున్నారు. అయితే ఒక ఫాలోవర్ ఈ వార్తను దీప్తి దృష్టికి తీసుకెళ్లాడు. దీంతో ఆమె తాజాగా క్లారిటీ ఇచ్చారు. తాను ప్రమాదానికి గురయ్యానంటూ వార్తలు రావడానికి ముఖ్య కారణం ఒక యూట్యూబ్ వీడియో అని ఆమె స్పష్టం చేశారు. ఆ వీడియోలో తనకు యాక్సిడెంట్ అయినట్లు ఉంటుందన్నారు దీప్తి సునైనా.

అది నిజమైన యాక్సిడెంట్ కాదని దీప్తి సునైనా చెప్పుకొచ్చారు. దాదాపు ఏడెనిమిదేళ్ల కింద ‘అలియా ఖాన్’ అనే షార్ట్ ఫిలిం చేశానని.. అందులోని క్లిప్​ను ఇలా తనకు యాక్సిడెంట్ అయిందని వార్తలు సృష్టించేందుకు వాడుతున్నారని ఆమె తెలిపారు. తనకు ఏమీ అవ్వలేదని.. ప్రస్తుతం చాలా బాగున్నానని దీప్తి సునైనా పేర్కొన్నారు. ఇలాంటి అసత్య వార్తలు సృష్టించడం సరికాదని ఆమె మండిపడ్డారు. యాక్సిడెంట్ వార్తలపై స్వయంగా దీప్తి క్లారిటీ ఇవ్వడంతో ఆమె ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు.

ఇదీ చదవండి: OTTలోకి వచ్చేసిన తెలుగు టైమ్ ట్రావెల్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Jojobet GirişmeritbetmeritbetholiganbetHoliganbet girişcasibomJojobet GirişcasibomjojobetjojobetcasibomholiganbetMadridbetMadridbetJojobet GirişcasibomHoliganbet GirişOnwin Girişdeneme bonusu veren sitelerCasibom Girişhttps://www.hoteltarobafoz.com.br/superbetincasibomholiganbet girişdirect to wallet crypto swap