iDreamPost
android-app
ios-app

రెండు లయన్స్ తో ఓ టైగర్.. బాక్సాఫీస్ వార్!

  • Author ajaykrishna Updated - 11:41 AM, Wed - 4 October 23
  • Author ajaykrishna Updated - 11:41 AM, Wed - 4 October 23
రెండు లయన్స్ తో ఓ టైగర్.. బాక్సాఫీస్ వార్!

2023.. దసరా బాక్సాఫీస్ వార్ గట్టిగా ఉండబోతుంది. రెండు పాన్ ఇండియా మూవీస్ తో పాటు ఓ మాస్ సినిమా రేసులో దిగుతున్నాయి. ఆల్రెడీ అవేం సినిమాలో అర్థమైందిగా. బాలయ్య నటిస్తున్న భగవంత్ కేసరి ఒకటైతే.. మాస్ రాజా రవితేజ చేసిన ‘టైగర్ నాగేశ్వరరావు’ మరోటి.. దళపతి విజయ్ నటించిన ‘లియో’ మూడోది. ఈ మూడు సినిమాలు టాలీవుడ్ బాక్సాఫీస్ బరిలో పోటీ పడుతున్నాయి. కాగా.. ఇందులో బాలయ్య భగవంత్ కేసరి తెలుగులో మాత్రమే రిలీజ్ అవుతుండగా.. టైగర్, లియో రెండూ పాన్ ఇండియా రేంజ్ లో వివిధ భాషలలో రిలీజ్ అవుతున్నాయి. అయితే.. ఇప్పుడీ సినిమాల మధ్య పోటీ.. ఇండస్ట్రీలో ఆసక్తిరేపుతోంది.

దసరాకు తెలుగు రాష్ట్రాలలో పదిరోజులకు పైగా సెలవులు వస్తున్నాయి. సంక్రాంతి తర్వాత అంతటి పెద్ద పండుగ దసరానే. అందుకే ఫెస్టివల్ సీజన్ ని క్యాష్ చేసుకోవాలని ప్రతీ హీరో, దర్శకనిర్మాతలు ప్రయత్నం చేసేది. ఈసారి దసరా రెగ్యులర్ గా మాత్రం ఉండదని అర్ధమవుతుంది. ఎందుకంటే.. అఖండ, వీరసింహారెడ్డి లాంటి బ్లాక్ బస్టర్స్ తర్వాత.. బాలయ్య నుండి వస్తున్న సినిమా భగవంత్ కేసరి. కెరీర్ లో ఒక్క ప్లాప్ కూడా లేని దర్శకుడు అనిల్ రావిపూడి ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో కాజల్ అగర్వాల్, శ్రీలీల ఫిమేల్ లీడ్ రోల్స్ చేస్తున్నారు. మరి ఆల్రెడీ హైప్ క్రియేట్ చేసుకున్న కేసరి.. బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి.

ఇక రెండో తెలుగు సినిమా టైగర్ నాగేశ్వరరావు. రవితేజ హీరోగా పీరియడిక్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందుతోంది ఈ సినిమా. డెబ్యూ డైరెక్టర్ వంశీ తెరకెక్కిస్తున్న ఈ సినిమా అక్టోబర్ 20న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. రవితేజ కెరీర్ లోనే ఫస్ట్ పాన్ ఇండియా మూవీగా టైగర్ రిలీజ్ అవుతోంది. సో.. ఫ్యాన్స్ అయితే గట్టి హోప్స్ తో ఉన్నారు. కానీ.. సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి. వీటితో పాటు తమిళ డబ్బింగ్ సినిమాగా లియో వస్తోంది. దళపతి విజయ్, లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో రూపొందిన ఈ సినిమా.. అక్టోబర్ 19న రిలీజ్ అవుతోంది. ఇప్పటికే సినిమా ఫుల్ హైప్ క్రియేట్ చేసింది. అందుకు కారణం.. ఖైదీ, విక్రమ్ సినిమాలతో లోకేష్ క్రియేట్ చేసిన సినిమాటిక్ యూనివర్స్. మరి భగవంత్ కేసరి, టైగర్ లను లియో ఎలా తట్టుకుంటుందో చూడాలి. మరి ఈ మూడు సినిమాలలో మీరు ఏ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారో కామెంట్స్ లో తెలపండి.

gamdomCasibomJojobet Girişmarsbahis girişGrandpashabet Giriş