iDreamPost
android-app
ios-app

Devara Movie: ‘దేవర’ దావూదీ సాంగ్​పై ట్విస్ట్.. ఈ పాట సినిమాలో ఉండదా?

  • Published Sep 06, 2024 | 3:28 PM Updated Updated Sep 06, 2024 | 3:28 PM

Devara Movie, Daavudi Song, Jr NTR: ‘దేవర’ మూవీ నుంచి రీసెంట్​గా వచ్చిన దావూదీ సాంగ్ యూట్యూబ్​ను షేక్ చేస్తోంది. రికార్డు స్థాయిలో వ్యూస్ సాధిస్తూ దూసుకెళ్తోంది. ఇందులో తారక్-జాన్వీ వేసిన మాస్ స్టెప్స్ ఆడియెన్స్​ను ఊపేస్తున్నాయి.

Devara Movie, Daavudi Song, Jr NTR: ‘దేవర’ మూవీ నుంచి రీసెంట్​గా వచ్చిన దావూదీ సాంగ్ యూట్యూబ్​ను షేక్ చేస్తోంది. రికార్డు స్థాయిలో వ్యూస్ సాధిస్తూ దూసుకెళ్తోంది. ఇందులో తారక్-జాన్వీ వేసిన మాస్ స్టెప్స్ ఆడియెన్స్​ను ఊపేస్తున్నాయి.

  • Published Sep 06, 2024 | 3:28 PMUpdated Sep 06, 2024 | 3:28 PM
Devara Movie: ‘దేవర’ దావూదీ సాంగ్​పై ట్విస్ట్.. ఈ పాట సినిమాలో ఉండదా?

మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ నటించిన ‘దేవర’ చిత్రం ఈ నెలలోనే విడుదల కానుంది. రిలీజ్​కు ఇంకా మూడు వారాల సమయమే ఉంది. దీంతో ప్రమోషన్లలో జోరు పెంచారు మూవీ టీమ్. ఇప్పటికే సినిమా నుంచి బయటకు వచ్చిన టీజర్, సాంగ్స్ బాగా హల్​చల్ చేశాయి. ముఖ్యంగా పాటలు బిగ్ ఇంపాక్ట్ క్రియేట్ చేశాయి. మొదటగా వచ్చిన ఫియర్ సాంగ్ గూస్​బంప్స్ తెప్పించింది. ఆ తర్వాత వచ్చిన చుట్టమల్లే సాంగ్ అంతకంటే బిగ్ హిట్ అయింది. దీనిపై సోషల్ మీడియాలో చాలా మంది సెలెబ్రిటీలు రీల్స్ కూడా చేశారు. రీసెంట్​గా వచ్చిన దావూదీ సాంగ్ గత రెండు పాటలను మించిపోయింది. అయితే ఈ సాంగ్ విషయంలో ఇప్పుడో ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది. దావూదీ సాంగ్ సినిమాలో ఉండదా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

దావూదీ పాట సినిమాలో ఉండదని రూమర్స్ వస్తున్నాయి. మూవీ అయిపోయాక ఆఖర్లో రోలింగ్ టైటిల్స్​లో దీన్ని ప్లే చేస్తారని వినిపిస్తోంది. ఈ పాట సినిమాలో భాగం కాదని.. మూవీ చూసి వెళ్లిపోతున్న ఆడియెన్స్, ఫ్యాన్స్​లో మరింత జోష్ నింపేందుకు దీన్ని వాడుకోనున్నారని సమాచారం. అయితే దావూదీ సాంగ్ సినిమాలో ఏ సమయంలో వస్తుందనేది కచ్చితంగా తెలియదు. ఈ పాటను రోలింగ్ టైటిల్స్​లో ప్లే చేస్తామని మూవీ టీమ్ చెప్పలేదు. కానీ టాలీవుడ్ సర్కిల్స్​లో మాత్రం సాంగ్ చివర్లోనే వస్తుందని, సినిమాలో కాదని గట్టిగా వినిపిస్తోంది. ఇది తెలిసిన నెటిజన్స్ ఇదేం ట్విస్ట్ అంటున్నారు. అయితే ఈ సాంగ్ మూవీలో రాకపోయనా ఫర్వాలేదు, లాస్ట్​లో కిక్ ఇచ్చినా చాలని అంటున్నారు. సాంగ్ అదిరిపోయిందని, అనిరుధ్ బీట్స్​కు తారక్-జాన్వీ వేసిన మాస్ స్టెప్స్ వేరే లెవల్​లో ఉన్నాయని మెచ్చుకుంటున్నారు.

ఇక, దావూదీ సాంగ్ హంగామా మామూలుగా లేదు. ఈ పాట రికార్డు స్థాయిలో వ్యూస్ సాధిస్తూ యూట్యూబ్​ను షేక్ చేస్తోంది. 24 గంటల్లోనే దాదాపు 19 మిలియన్ల వ్యూస్ సొంతం చేసుకుంది. ఫ్యాన్స్​తో పాటు ఆడియెన్స్​కు బాగా ఎక్కేసిందీ పాట. మొదట రిలీజ్ చేసిన ఫియర్ సాంగ్, ఆ తర్వాత వచ్చిన చుట్టమల్లే కంటే ఇది ఇంకా హ్యూజ్ రెస్పాన్స్ దక్కించుకుంటోంది. వ్యూసే కాదు.. లైక్స్ పరంగానూ దావూదీ అదరగొడుతోంది. 24 గంటల్లో 458కే లైక్స్ మార్క్​ను రీచ్ అయింది. ‘దేవర’ నుంచి ఇంకా ట్రైలర్ రాలేదు. కానీ సాంగ్స్​తోనే ఎక్స్​పెక్టేషన్స్ ఆకాశానికి తాకుతున్నాయి. అది కూడా వస్తే ఇంక అంచనాలు ఏ రేంజ్​కు వెళ్తాయో ఊహించడం కూడా కష్టంగానే ఉంది. మరి.. దావూదీ సాంగ్ సినిమాలో ఉంటుందంటారా? లేదా రోలింగ్ టైటిల్స్​లో ప్లే చేస్తారా? మీరేం అనుకుంటున్నారో కామెంట్ చేయండి.