iDreamPost
android-app
ios-app

Mokshagna: టాలీవుడ్ లోకి మోక్షజ్ఞ ఎంట్రీ.. అన్న NTR ఎమోషనల్ పోస్ట్!

Jr NTR Wishes To Mokshagna: నందమూరి మోక్షజ్ఞ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. ప్రశాంత్ వర్మ దర్శకతంలో టాలీవుడ్ లోకి రాబోతున్నాడు. ఈ సందర్భంగా తారక్ ఒక ఎమోషనల్ పోస్ట్ చేశాడు. తమ్ముడికి శుభాకాంక్షలు కూడా చెప్పాడు.

Jr NTR Wishes To Mokshagna: నందమూరి మోక్షజ్ఞ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. ప్రశాంత్ వర్మ దర్శకతంలో టాలీవుడ్ లోకి రాబోతున్నాడు. ఈ సందర్భంగా తారక్ ఒక ఎమోషనల్ పోస్ట్ చేశాడు. తమ్ముడికి శుభాకాంక్షలు కూడా చెప్పాడు.

Mokshagna: టాలీవుడ్ లోకి మోక్షజ్ఞ ఎంట్రీ.. అన్న NTR ఎమోషనల్ పోస్ట్!

నందమూరి ఫ్యామిలీ నుంచి టాలీవుడ్ లోకి మరో హీరో ఎంట్రీ ఇప్పుడు అఫీషియల్ అయిపోయింది. బాలయ్య ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన మోక్షజ్ఞ ఎంట్రీ అధికారికంగా ఖరారు అయిపోయింది. మొదటి నుంచి అందరూ ఊహించిన విధంగానే ప్రశాంత్ వర్మతో నందమూరి మోక్షజ్ఞ డెబ్యూ సినిమా చేయబోతున్నాడు. ప్రశాంత్ వర్మ యూనివర్స్ లో మోక్షజ్ఞ ఇప్పుడు ఒక సూపర్ హీరోగా రాబోతున్నాడు. ఒక డెబ్యూ హీరోకి ఇలాంటి స్క్రిప్ట్ దొరకడం అంటే అంత చిన్న విషయం కాదు. పైగా ఈ విషయంలో బాలయ్య ఫ్యాన్స్ డబుల్ ఖుషీగా ఉన్నారు. మోక్షజ్ఞకు ఇంతకంటే మంచి ఎంట్రీ మూవీ దొరకదు అంటున్నారు. ఈ విషయంలో మోక్షజ్ఞ అన్న.. గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ కూడా స్పందించాడు. తమ్ముడి ఎంట్రీపై ఎమోషనల్ కూడా అయ్యాడు.

సాధారణంగానే ఎన్టీఆర్ కు ఫ్యామిలీతో బాండింగ్, ఎమోషన్స్ ఎక్కువ అనే విషయం తెలిసిందే. ముఖ్యంగా బ్రదర్స్ కి చాలా క్లోజ్ గా ఉంటాడు. అలాగే మోక్షజ్ఞ అంటే కూడా తారక్ కు ప్రత్యేకమైన అభిమానం అని అందరికీ తెలిసిందే. ముఖ్యంగా మోక్షజ్ఞ- ఎన్టీఆర్ ఎంతో ఆప్యాయంగా ఉంటారు. మరోసారి వారి బాండింగ్ ఏంటి అనేది అభిమానులకు చాటి చెప్పినట్లు అయ్యింది. నందమూరి ఫ్యామిలీ నుంచి టాలీవుడ్ లోకి మరో యంగ్ హీరో ఎంట్రీ ఇస్తున్న నేపథ్యంలో మోక్షజ్ఞకు ఎన్టీఆర్ తన శుభాకాంక్షలు, ఆశీస్సులను అందజేశాడు. అందుకు సంబంధించి సోషల్ మీడియాలో ఒక పోస్ట్ కూడా చేశాడు. మోక్షజ్ఞ మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్ ని షేర్ చేస్తూ రియాక్ట్ అయ్యాడు. ఆ మాటలు చూస్తే తారక్ కాస్త ఎమోషనల్ అయ్యాడు అని అర్థమైపోతోంది.

ఎన్టీఆర్ తన పోస్టులో మోక్షజ్ఞకు ఈ విధంగా శుభాకాంక్షలు తెలిపాడు. “ఈ సినిమా ప్రపంచంలోకి అడుగుపెడుతున్న నీకు శుభాకాంక్షలు. నీ జీవింతలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభిస్తున్న నేపథ్యంలో.. అన్ని దైవిక శక్తులు సహా తాతగారి ఆశీస్సులు- సహకారం నీకు తోడుగా ఉండాలి. హ్యాపీ బర్త్ డే మోక్షు” అంటూ తారక్ చెప్పుకొచ్చాడు. ఎన్టీఆర్ మాటల్లో ఆనందం.. మోక్షు అనే ఆ పిలుపో ఆప్యాయత స్పష్టంగా కనిపిస్తోంది. తన సోదరుడు హీరోగా తన ప్రయాణాన్ని ప్రారంభిస్తున్న తరుణంలో తారక్ ఎమోషనల్ అవ్వడంపై తారక్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అలాగే తారక్ అభిమానులు కూడా మోక్షజ్ఞకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడమే కాకుండా.. సినిమా ఎంట్రీపై ఆల్ ది బెస్ట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఇంక మోక్షజ్ఞ మూవీ విషయానికి వస్తే.. ప్రశాంత్ వర్మ కాన్సెప్ట్- టేకింగ్ గురించి తెలుగు ప్రేక్షకులకే కాదు.. పాన్ ఇండియా లెవల్లో ఉన్న సినిమా అభిమానులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తాను అనుకున్నది అనుకున్నట్లు వెండితెర మీద చూపించేస్తాడు. అతని సినిమాటిక్ యూనివర్స్ లోకి మోక్షజ్ఞ ఎంట్రీ ఇస్తున్నాడు అంటే.. ఇది ఒక సినిమాతో ఆగేది కాదు. అలాగే ఈ మూవీకి సంబంధించి వాళ్లు రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ చూస్తే.. మోక్షజ్ఞ ఎంతో స్టైలిష్ లుక్స్ లో కనిపిస్తున్నాడు. అంటే ఒక స్టైలిష్ సూపర్ హీరో అనమాట. నందమూరి ఫ్యాన్స్ కి ఇంతకంటే ఏం కావాలి? మోక్షజ్ఞ ఎంట్రీకి ఇది అదిరిపోయే ప్రాజెక్ట్ అని ఒప్పుకోవాల్సిందే. మరి.. మోక్షజ్ఞ ఎంట్రీపై ఎన్టీఆర్ ఎమోషనల్ కావడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Prasanth Varma (@prasanthvarmaofficial)