iDreamPost
android-app
ios-app

నితిన్- వెంకీ ప్రాజెక్ట్‌కి క్రేజీ టైటిల్.. గట్టిగానే ప్లాన్ చేశారు!

  • Published Jan 25, 2024 | 6:12 PM Updated Updated Jan 25, 2024 | 6:12 PM

యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో నితిన్ నుండి వచ్చిన సినిమాలు ఆశించిన స్థాయిలో అంచనాలను అందుకోలేదు. దీంతో తనకు హిట్ ఇచ్చిన దర్శకుడితో మరోసారి జత కట్టాడు. ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి క్రేజీ అప్డేట్ ఒకటి వచ్చింది.

యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో నితిన్ నుండి వచ్చిన సినిమాలు ఆశించిన స్థాయిలో అంచనాలను అందుకోలేదు. దీంతో తనకు హిట్ ఇచ్చిన దర్శకుడితో మరోసారి జత కట్టాడు. ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి క్రేజీ అప్డేట్ ఒకటి వచ్చింది.

  • Published Jan 25, 2024 | 6:12 PMUpdated Jan 25, 2024 | 6:12 PM
నితిన్- వెంకీ ప్రాజెక్ట్‌కి క్రేజీ టైటిల్.. గట్టిగానే ప్లాన్ చేశారు!

యంగ్ అండ్ ఎనర్జిటికీ హీరోల లిస్ట్ తీస్తే.. హీరో నితిన్ ముందు వరుసలో ఉంటాడు. అయితే కొంత కాలంగా అతడి ఖాతాలో సరైన హిట్ పడలేదు. తాను నమ్మిన కథలకు ప్రేక్షకుల నుంచి ఊహించిన స్థాయిలో రెస్పాన్స్ అయితే రాలేదు. మాచర్ల నియోజకవర్గం, ఇటీవల విడుదలైన ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్ చిత్రాలే కాదూ అంతకముందు వచ్చిన చెక్, రంగ్ దే కూడా నితిన్‌ని ఒకింత నిరాశ పరిచాయి. అందుకే తన తర్వాతి ప్రాజెక్టు కోసం తనకు హిట్టునిచ్చిన డైరెక్టర్‌ని సెలక్ట్ చేసుకున్నాడు. ఈసారి మాత్రం గట్టిగానే కొట్టాలని ఫిక్స్ అయినట్లుగా కనిపిస్తోంది. ఎందుకంటే ఇప్పుడు ఆ సినిమా అప్టేట్ క్రేజీ ఉంది. ఈ సినిమాకు ఓ మాసీ టైటిల్ ఖరారు చేసినట్లు టాక్ వినిపిస్తోంది. అయితే తాజాగా ఓ పోస్టర్ విడుదల చేసింది చిత్ర యూనిట్.

నితిన్ సినిమా అంటే ఇండస్ట్రీలో మినిమం గ్యారెంటీ అనే ట్యాగ్ అయితే ఉంది. అలాగే టాలీవుడ్ టాప్ డైరెక్టర్లతో నటించిన ఏకైక కుర్ర హీరో కూడా బహుశా నితినే కావొచ్చు. అలాంటి హీరో ఇప్పుడు హిట్స్ లేక సతమతమౌవుతున్నారు. త్రివిక్రమ్ దర్శకుడిగా అ ఆ హిట్ తర్వాత మళ్లీ అతడి నుండి మెస్మరైజ్ చేసే మూవీ రాలేదు. మూడేళ్ల పాటు నాలుగు సినిమాలు చేసి అచ్చి రాలేదు. ఆ సమయంలో వెంకీ కుడుముల డైరెక్షన్‌లో నటించాడు ఈ టాలెంట్ యాక్టర్.  భీష్మతో మళ్లీ హిట్ బాట పట్టాడు. ఇదిగో ఆ తర్వాత చేసిన సినిమాల సంగతి మీకు తెలిసిందే. దీంతో మళ్లీ నాలుగేళ్ల గ్యాప్ తర్వాత తనకు హిట్ ఇచ్చిన ఇదే దర్శకుడితో మరో సినిమా చేస్తున్నాడు.

Nitin-Venky movie

ఇప్పుడు అదే భీష్మ డైరెక్టర్ తో సినిమా చేస్తున్నాడు నితిన్. తాజాగా ఈ మూవీకి సంబంధించి ఓ పిక్ రిలీజ్ చేసి.. జనవరి 26న గణతంత్ర దినోత్సవం నాడు మాస్క్ తీయబోతున్నాం అంటూ పోస్టర్‌లో పేర్కొంది చిత్ర యూనిట్. అందులో ఓ వ్యక్తి క్రిస్ మస్ తాత గెటప్‌లో బ్యాగ్ తగిలించుకుని అటు వైపు తిరిగి కనిపించాడు. ఇది రాబిన్ హుడ్ తరహా కథ అని తెలుస్తోంది. ఇప్పుడు అదే టైటిల్‌ను ఈ చిత్రానికి ఖరారు చేయబోతున్నాడట చిత్ర యూనిట్. రాబిన్ హుడ్ .. ఈ క్యారెక్టర్ గురించి చాలా మందికి తెలుసు. పెద్ద వాళ్ల దగ్గర దోచుకుని..పేదవాళ్లకు దోచుపెట్టే దొంగ. ఇప్పుడు ఆ పాత్రలో కనిపించబోతున్నాడట నితిన్. మరి రేపు ఉదయం 11.07 గంటల వరకు అప్ డేట్ కోసం వేచి చూడాల్సిందే. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ తెరకెక్కిస్తోంది. జీవి ప్రకాష్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఈ సారి నితిన్ హిట్ కొట్టడం ఖాయమంటారా..?

Jojobet GirişJojobetHoliganbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetjojobet girişbetcioJojobetJojobetJojobetjojobetgrandpashabet