iDreamPost
android-app
ios-app

రాజమౌళి కంటే ముందు అనిల్ రావిపూడి? క్లారిటీ ఇదేనట!

  • Author ajaykrishna Updated - 09:03 AM, Thu - 28 September 23
  • Author ajaykrishna Updated - 09:03 AM, Thu - 28 September 23
రాజమౌళి కంటే ముందు అనిల్ రావిపూడి? క్లారిటీ ఇదేనట!

ఇండస్ట్రీ అన్నాక స్టార్ హీరోల సినిమాల విషయంలో ఎప్పటికప్పుడు ఏదొక న్యూస్ వినిపిస్తూనే ఉంటుంది. అది వాస్తవమా.. అవాస్తవమా.. అనేది తర్వాత మేకర్స్ క్లారిటీ ఇస్తుంటారు. అది వేరే విషయం. గత రెండు రోజులుగా ఇండస్ట్రీలో సూపర్ స్టార్ మహేష్ బాబుకు సంబంధించి కొన్ని వార్తలు తెగ చక్కర్లు కొడుతున్నాయి. అదికూడా మహేష్ 29వ సినిమా గురించి. అదేంటి మహేష్ బాబు 29వ సినిమా దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో కదా.. అని మీకు అనిపించవచ్చు. కానీ.. ఇప్పుడా సినిమా విషయంలో మార్పులు జరిగి.. రాజమౌళి స్థానంలో మరో సక్సెస్ ఫుల్ డైరెక్టర్ ఎంటర్ అవుతాడని అంటున్నారు.

ఆ వివరాల్లోకి వెళ్తే.. మహేష్ బాబు ప్రస్తుతం దర్శకుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో గుంటూరు కారం మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. అతడు, ఖలేజా సినిమాల తర్వాత వస్తున్న మూడో సినిమా కావడంతో.. ఈ సినిమా వీరి కాంబినేషన్ కి బిగ్గెస్ట్ హిట్ ఇస్తుందని అంచనా వేస్తున్నారు. ఈ సినిమాలో మహేష్ సరసన శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. కాగా.. వచ్చే ఏడాది సంక్రాంతికి గుంటూరు కారం రిలీజ్ కాబోతుంది. అయితే.. గుంటూరు కారం తర్వాత మహేష్ బాబు.. దర్శకుడు రాజమౌళితో తన ఫస్ట్ పాన్ వరల్డ్ మూవీ చేయబోతున్న విషయం విదితమే. ఆల్రెడీ వీరి కాంబినేషన్ పై అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది.

ప్రస్తుతం మహేష్ కోసం రాజమౌళి సినిమా స్క్రిప్ట్ వర్క్ జరుగుతుంది. వచ్చే ఏడాదిలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళబోతుందని తెలుస్తుంది. ఇలాంటి తరుణంలో మహేష్ బాబుతో రాజమౌళి కంటే ముందు వేరే దర్శకుడు ఓ సినిమా చేసేయడానికి రెడీ అవుతున్నట్లు వార్తలు వినిపించాయి. ఆ దర్శకుడు ఎవరో కాదు.. మహేష్ కి సరిలేరు నీకెవ్వరూ లాంటి సూపర్ హిట్ ఇచ్చిన అనిల్ రావిపూడి. ప్రెజెంట్ బాలయ్యతో భగవంత్ కేసరి రిలీజ్ కి రెడీ చేస్తున్నాడు. ఆ సినిమా తర్వాత మహేష్ తో చేస్తాడని.. ఆ గ్యాప్ లో రాజమౌళి స్క్రిప్ట్ వర్క్ పూర్తి అవుతుందని టాక్ నడిచింది. కానీ.. ఈ వార్తలలో ఎలాంటి నిజం లేదని ఇండస్ట్రీ వర్గాల సమాచారం. మహేష్ ముందుగా కమిట్ అయినట్లుగా రాజమౌళితోనే నెక్స్ట్ మూవీ ఉంటుందని చెబుతున్నారు. సో.. మహేష్ – రాజమౌళి కాంబో విషయంలో క్లారిటీ వచ్చినట్లే అని ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరి మహేష్, రాజమౌళి సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

Jojobet GirişjojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişjojobet giriş