iDreamPost
android-app
ios-app

మిలియన్ వ్యూస్ తో దేవర ‘చుట్టమల్లే’ సాంగ్ సెన్సేషన్

  • Published Aug 12, 2024 | 12:11 PM Updated Updated Aug 12, 2024 | 12:11 PM

Devara 'chuttamalle' Song Update: థియేటర్ రిలీజ్ కు ముందే ఈ రకమైన సెన్సేషనల్ రికార్డ్స్ ఇప్పటివరకు ఏ సినిమాకు జరిగి ఉండదు. దేవర సినిమా పైన అందరికి భారీ అంచనాలు ఉన్నాయన్న సంగతి తెలిసిందే కానీ.. ఈ రకమైన అభిమానం ఉందని మాత్రం ఈ రికార్డు వ్యూస్ చూస్తేనే తెలుస్తుంది.

Devara 'chuttamalle' Song Update: థియేటర్ రిలీజ్ కు ముందే ఈ రకమైన సెన్సేషనల్ రికార్డ్స్ ఇప్పటివరకు ఏ సినిమాకు జరిగి ఉండదు. దేవర సినిమా పైన అందరికి భారీ అంచనాలు ఉన్నాయన్న సంగతి తెలిసిందే కానీ.. ఈ రకమైన అభిమానం ఉందని మాత్రం ఈ రికార్డు వ్యూస్ చూస్తేనే తెలుస్తుంది.

  • Published Aug 12, 2024 | 12:11 PMUpdated Aug 12, 2024 | 12:11 PM
మిలియన్ వ్యూస్ తో దేవర ‘చుట్టమల్లే’ సాంగ్ సెన్సేషన్

జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం నటిస్తున్న దేవర సినిమాపై.. అందరికి ఎలాంటి అంచనాలు నెలకొన్నాయన్న విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే దేవర సినిమా నుంచి రిలీజ్ అయినా ప్రతి అప్ డేట్ ప్రేక్షకులలో విపరీతమైన హైప్ క్రియేట్ చేస్తుంది. ఈ క్రమంలో దేవర నుంచి ఇప్పటివరకు వచ్చిన సాంగ్స్ రెండూ కూడా.. నెక్ట్ లెవెల్ క్రేజ్ ను సంపాదించుకున్నాయి. అంతే కాకుండా సాంగ్స్ రిలీజ్ అయినా కొన్ని గంటల్లోనే రికార్డ్స్ క్రియేట్ చేయడం విశేషం. ఆల్రెడీ దీనికి సంబంధించిన అప్ డేట్ చూసే ఉంటారు. ఇక ఇప్పుడు దేవర నుంచి వచ్చిన లేటెస్ట్ సాంగ్ ‘చుట్టమల్లే’.. గురించి మరొక ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

దేవర సినిమా నుంచి లాస్ట్ గా వచ్చిన అప్ డేట్ ఆ మూవీలోని.. ‘చుట్టమల్లే’ సాంగ్. స్లో గా సోషల్ మీడియాలో ఈ సాంగ్ అందరికి ఎక్కేస్తుంది. తారక్ నుంచి ఎలాంటి రొమాంటిక్ యాంగిల్ ను ప్రేక్షకులు ఆశిస్తున్నారో.. సరిగ్గా అలానే ఈ సాంగ్ ఉండడంతో.. అభిమానులను మరింత మెప్పించేసింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా.. అందరూ ఈ సాంగ్ కు సంబంధించిన హుక్ స్టెప్స్ తో రీల్స్ ను చేస్తూ ఉంటున్నారు. అవి కూడా బాగానే ట్రెండ్ అవుతున్నాయి. దీనితో ‘చుట్టమల్లే; సాంగ్ ఏకంగా 75 మిలియన్ రికార్డు వ్యూస్ ను క్రాస్ చేసింది. థియేటర్ రిలీజ్ కు ముందే సెన్సేషనల్ రికార్డ్స్ క్రియేట్ చేయడం.. దేవర కు మాత్రమే సాధ్యం అని.. సోషల్ మీడియాలో టాక్ నడుస్తుంది.

Devara

ఇక లేటెస్ట్ గా దేవర థర్డ్ సాంగ్ కు సంబంధించిన అప్ డేట్.. మరింత ఇంట్రెస్టింగ్ గా మారింది. అదేంటంటే.. దేవర నుంచి వచ్చే థర్డ్ సాంగ్ ‘ఆయుధ పూజ’ .. దేవర ‘ఫియర్ సాంగ్’ కంటే.. ఇంట్రెస్టింగ్ గా ఉంటుందని సమాచారం. పైగా ‘ఆయుధ పూజ’ సాంగ్ సినిమా మొత్తానికే హైలెట్ కానుందట. దీనితో ఈ సాంగ్ కు సంబంధించిన అప్ డేట్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్నారు ప్రేక్షకులు. ఇలా రోజు రోజుకు సినిమాపై మరిన్ని అంచనాలను క్రియేట్ చేస్తున్నారు. సెప్టెంబర్ 27న థియేటర్ లో దేవర ఎలాంటి హంగామా చేస్తుందో వేచి చూడాలి . మరి ‘చుట్టమల్లే’ సాంగ్ అప్ డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişmeritbetmeritbetcasibomCasibom girişcasibomJojobet GirişjojobetjojobetjojobetcasibomcasibomMadridbetMadridbetJojobet GirişcasibomHoliganbet GirişOnwin Girişdeneme bonusu veren sitelerCasibom Girişhttps://www.hoteltarobafoz.com.br/