చంద్రముఖి 2.. ఈ సినిమాను ఎప్పుడైతే అనౌన్స్ చేశారో.. అప్పటి నుంచి ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇక ఈ మూవీలో రాఘవ లారెన్స్ నటిస్తున్నాడని తెలియగానే మూవీపై బజ్ ఇంకాస్త పెరిగింది. దానికి కారణం లారెన్స్ గతంలో చేసిన థ్రిల్లర్ మూవీసే. అదీకాక చంద్రముఖిగా కంగనా నటించడం.. దాదాపు 18 సంవత్సరాల తర్వాత సీక్వెల్ రావడంతో సినిమాపై భారీ హైప్ క్రియేట్ అయ్యింది. అయితే తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చంద్రముఖి 2 ఆకట్టుకోలేకపోయింది. తొలిరోజు నుంచే మిక్స్ డ్ టాక్ రావడంతో.. వసూళ్లు పెద్దగా రాలేదు. కాగా.. మూవీ ఎలా ఉన్నాగానీ ప్రముఖ ఓటీటీ సంస్థ చంద్రముఖి 2 ఓటీటీ రైట్స్ ను భారీ ధరకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.
రాఘవ లారెన్స్, కంగనా రనౌత్ జంటగా నటించిన చిత్రం చంద్రముఖి 2. తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ అనుకున్నంత స్థాయిలో ప్రేక్షకులను అలరించలేకపోయింది. 2005లో సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన చంద్రముఖి సినిమాకు సీక్వెల్ గా వచ్చిన ఈ మూవీకి తొలిరోజు నుంచే మిశ్రమ స్పందన వచ్చింది. దీంతో కలెక్షన్లు కూడా పెద్దగా రాలేదు. అయినప్పటికీ ఈ మూవీ ఓటీటీ రైట్స్ ధర కళ్లు చెదిరే రేంజ్ లో ఉన్నాయి. చంద్రముఖి 2 స్ట్రీమింగ్ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ సంస్థ అయిన నెట్ ఫ్లిక్స్ దక్కించుకుంది. ఈ సినిమాను దాదాపు రూ. 8 కోట్లు పెట్టి కోనుగోలు చేసినట్లు సమాచారం. సినిమా రిలీజ్ అయిన నెలన్నర తర్వాత ఓటీటీలో స్ట్రీమింగ్ చేయాలని తొలుత భావించినా.. థియేటర్లలో ఈ చిత్రానికి ఆశించిన స్థాయిలో స్పందన రాకపోవడంతో.. ముందుగానే స్ట్రీమింగ్ చేయాలని భావిస్తున్నారట. దీంతో నవంబర్ మూడో వారంలో ఈ మూవీ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం. అయితే దీనిపై ఎలాంటి అధికారిక సమాచారం మాత్రం రాలేదు.