iDreamPost
android-app
ios-app

లోకేశ్ కనగరాజ్ మేనేజర్​నంటూ స్కామ్.. బ్రహ్మాజీ ట్వీట్ వైరల్!

  • Author singhj Updated - 12:01 PM, Fri - 3 November 23
  • Author singhj Updated - 12:01 PM, Fri - 3 November 23
లోకేశ్ కనగరాజ్ మేనేజర్​నంటూ స్కామ్.. బ్రహ్మాజీ ట్వీట్ వైరల్!

ఫిల్మ్ ఇండస్ట్రీలో రకరకాల మోసాలు జరుగుతుంటాయి. వీటి గురించి మీడియాలో వార్తలు రావడం కూడా చూస్తూనే ఉంటాం. సినిమా ఆఫర్ల పేరుతో అమాయకుల నుంచి డబ్బులు దోచుకున్న ఘటనల గురించి వింటూనే ఉంటాం. మూవీస్​లో యాక్ట్ చేయాలనే ఇంట్రెస్ట్ ఉన్నవారు ఆ మోసగాళ్లకు ఇట్టే చిక్కుతుంటారు. తమ దగ్గర ఉన్నదంతా వాళ్లకు సమర్పించి.. చివరకు మోసపోతుంటారు. బడా సెలబ్రిటీలు కూడా వారి మేనేజర్ల చేతిలో మోసపోయిన ఘటనలు ఉన్నాయి. అలాంటిది సినిమాలపై ఆశతో వచ్చేవాళ్లు ఇంకెన్ని మోసాలకు గురవుతుంటారో చెప్పాల్సిన పనిలేదు. తాజాగా అలా జరుగుతున్న ఒక మోసంపై సీనియర్ నటుడు బ్రహ్మాజీ ట్వీట్ చేశారు.

యంగ్ యాక్టర్స్​ను టార్గెట్ చేసుకొని జరుగుతున్న కొత్తరకం స్కామ్​ మీద బ్రహ్మాజీ తాజాగా ట్వీట్లు చేశారు. స్టార్ డైరెక్టర్స్ దగ్గర పనిచేస్తున్నామంటూ పలువురు వ్యక్తులు.. యువ నటులకు మెసేజ్​లు, మెయిల్స్ పంపిస్తున్నారని ఆయన తెలిపారు. అంతేగాక వారి వద్ద నుంచి డబ్బులు కూడా వసూలు చేస్తున్నారని వెల్లడించారు. ఈ విషయంలో యువ నటీనటులు కాస్త జాగ్రత్తగా ఉండాలని బ్రహ్మాజీ సూచించారు. ఫిల్మ్ ఇండస్ట్రీలో జరుగుతున్న మోసాలపై ఆయన చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

‘డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్​కు తాను మేనేజర్​నని చెబుతూ నటరాజ్ అన్నాదొరై అనే వ్యక్తి పలువురు యువతీ యువకులకు మెసేజ్​లు, ఫోన్​కాల్స్ చేస్తున్నాడు. లోకేశ్ రూపొందించే నెక్ట్స్ సినిమాకు వారి ప్రొఫైల్ సెలెక్ట్ అయిందని.. డబ్బులు ఇస్తే ఆడిషన్​కు అవసరమైన కాస్ట్యూమ్స్ తాను రెంట్​కు తీసుకొస్తానని.. ఆడిషన్ పూర్తయ్యాక మనీ వాపస్ ఇచ్చేస్తానని అతడు నమ్మబలుకుతున్నాడు. అలాగే సత్యదేవ్ అనే మరో వ్యక్తి ఫోర్బ్స్ మ్యాగజైన్​లో తాను జర్నలిస్ట్​నని చెబుతూ డబ్బులు గుంజేందుకు ప్రయత్నిస్తున్నాడు. మూవీ ఇండస్ట్రీలోకి రావాలని కలలుగనే కొత్తతరం నటుల్ని లక్ష్యంగా చేసుకొని వీళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి’ అని బ్రహ్మాజీ ట్వీట్లు చేశారు.

ఇదీ చదవండి: బాలయ్యకి కూడా Jr.NTR అంటే భయామా? అల్లుడి కోసమే?

Jojobet GirişJojobetHoliganbetHoliganbetHoliganbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetbetwoon girişgrandpashabetEscortes BelgiqueGrandpashabetCasibomGrandpashabet Giriş