iDreamPost
android-app
ios-app

Akhanda 2: వణికించే రేంజ్ లో అఖండ 2 ! అఘోరాకి పెద్ద టార్గెట్ పెట్టేశారు!

  • Published Jul 11, 2024 | 6:00 PM Updated Updated Jul 11, 2024 | 6:00 PM

ప్రస్తుతం తెలుగు సినిమాలన్నీ కూడా.. ఇప్పుడు జనరేషన్ మర్చిపోతున్న పురాణాలను గుర్తుచేస్తున్నాయని చెప్పి తీరాలి. ఇప్పుడు ఈ లిస్ట్ లోకి మరొక బ్లాక్ బస్టర్ సినిమా యాడ్ అవ్వబోతుంది. అదే బోయపాటి, బాలయ్య కాంబినేషన్ లో రాబోతున్న మూవీ అఖండ 2 మూవీ.

ప్రస్తుతం తెలుగు సినిమాలన్నీ కూడా.. ఇప్పుడు జనరేషన్ మర్చిపోతున్న పురాణాలను గుర్తుచేస్తున్నాయని చెప్పి తీరాలి. ఇప్పుడు ఈ లిస్ట్ లోకి మరొక బ్లాక్ బస్టర్ సినిమా యాడ్ అవ్వబోతుంది. అదే బోయపాటి, బాలయ్య కాంబినేషన్ లో రాబోతున్న మూవీ అఖండ 2 మూవీ.

  • Published Jul 11, 2024 | 6:00 PMUpdated Jul 11, 2024 | 6:00 PM
Akhanda 2: వణికించే రేంజ్ లో అఖండ 2 ! అఘోరాకి పెద్ద టార్గెట్ పెట్టేశారు!

నాగ్ అశ్విన్ పుణ్యమా అని ఇప్పుడు ఏ ఇద్దరి మధ్య డిస్కషన్ విన్నా కానీ.. అది మహాభారతం గురించే వినిపిస్తుంది. దాదాపు ఇప్పటి జనరేషన్ వాళ్లకు భారతీయ ఇతిహాసాల మీద అంత అవగాహన లేదు. కానీ ఇప్పుడు అలాంటి వారందరికీ కూడా పురాణాల గురించి తెలుసుకునేలా.. ప్రేరేపిస్తున్నారు సినీ దర్శకులు. ఒక సినిమా వలన ఇంత మంది మహాభారతం గురించి ఆలోచిస్తారని.. దాని గురించి తెలుసుకోవాలనే ఇంట్రెస్ట్ చూపిస్తారని ఎవరు ఊహించి ఉండరు. నిజానికి ఇలాంటి సినిమాల వలన.. ప్రేక్షకులు ఎంతో కొంత జ్ఞానం పొందగలుగుతున్నారని చెప్పి తీరాలి. దీనితో ప్రస్తుతం దర్శకులంతా కూడా ఇదే బాట పట్టారు. ఇప్పుడు ఈ లిస్ట్ లోకి బోయపాటి, బాలయ్య కాంబినేషన్ లో రాబోతున్న అఖండ 2 మూవీ కూడా యాడ్ అయింది. ఈ సినిమాపై అందరికి భారీ అంచనాలు నెలకొన్నాయి. దానికి సంబంధించిన విషయాలు చూసేద్దాం.

బోయపాటి కెరీర్ లో నే అతి పెద్ద హిట్ గా నిలిచిన సినిమా “అఖండ” . ఈ సినిమాలో బాలకృష్ణ డ్యూయల్ రోల్ లో నటించిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఆ రెండు క్యారెక్టర్స్ లో అఘోరా పాత్ర.. మొత్తం సినిమాకే హైలెట్ గా నిలిచింది. ఇక దానితో పాటు తమన్ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ కి థియేటర్స్ దద్దరిల్లిపోయాయి. ఆ సమయంలో మీడియా సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన ఈ సినిమా గురించే వార్తలు వినిపించాయి. ఇక ఆ తర్వాత ఇప్పుడు అఖండ మూవీకి సిక్వెల్ గా అఖండ2 రాబోతుంది. ఈ సినిమాపై అప్పుడే అందరికి భారీ అంచనాలు పెరిగిపోయాయి. అయితే అఖండ 2 లో ముఖ్యంగా అఘోర క్యారక్టర్ ని ఎలివేట్ చేయబోతున్నారనే టాక్ వినిపిస్తుంది. అసలు అఘోరాలు ఎవరు.. వారి వెనుక చరిత్ర ఏంటి.. అనే విషయాలపై ఎక్కువ దృష్టి పెట్టనున్నారట. అఘోరాలు ఎవరు ఏంటి అనే విషయం చాలా మందికి తెలియదు. కాబట్టి ఆ విషయాన్నీ అందరికి తెలియజేయడం కోసం.. ఆ క్యారక్టర్ నే బాగా టార్గెట్ చేశారనే టాక్ వినిపిస్తుంది. మొదటి పార్ట్ లో కాసేపు కనిపించిన అఘోర క్యారక్టర్ తోనే అందరికి పూనకాలు తెప్పించేశాడు దర్శకుడు. ఇక రెండవ పార్ట్ లో పూర్తిగా అఘోరాల మీదే దృషి పెట్టడం అంటే.. ఇక ఈ సిక్వెల్ అందరిని వణికించే రేంజ్ లో ఉంటుందని చెప్పడంలో ఏ మాత్రం సందేహం లేదు.

Akhanda2

అంతే కాకుండా ఈ మధ్య కాలంలో.. ఓ ఇంటర్వ్యూలో బోయపాటి అఖండ 2 మూవీ గురించి ప్రస్తావన వచ్చినప్పుడు.. ఈ సిక్వెల్ లో మీరు ఏం చూపించబోతున్నారని అడిగితే.. ఈ సిక్వెల్ లో సమాజానికి ఏది అవసరమో అదే చూపిస్తాను అంటూ చెప్పుకొచ్చారు. ఈ రకంగా చూసిన కానీ.. ఇప్పుడు సమాజానికి అవసరం అయ్యేవి ఎప్పుడో మర్చిపోయిన పురాణ ఇతిహాసాలే కాబట్టి.. ఖచ్చితంగా అఘోర పాత్ర ద్వారా ఎవరికీ తెలియని ఎన్నో నిజాలను తెలియజేస్తారని.. చెప్పొచ్చు. అప్పట్లో వచ్చిన రామాయణ మహాభారతలకు సంబంధించిన సినిమాలను.. ఎంత మంది శ్రద్దగా చూశారో తెలియదు కానీ.. ఈ మధ్య కాలంలో వస్తున్న హనుమాన్ , కల్కి లాంటి సినిమాలకైతే.. థియేటర్స్ అన్నీ దేవాలయాల్లా మారిపోతున్నాయి. ఇలాంటి సినిమాలకు రాబోయే రోజుల్లో మరింత క్రేజ్ పెరుగుతుందని చెప్పి తీరాలి. ఇక బోయపాటి ప్రేక్షకులను ఏ విధంగా పూనకాలు రప్పిస్తారో వేచి చూడాలి. మరి అఖండ 2 మూవీ అప్ డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetHoliganbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomCasibomgrandpashabetbetorspin girişgrandpashabetEscortes BelgiqueCasibomCasibomGrandpashabet Giriş