iDreamPost
android-app
ios-app

Noor Malabika Das: ఇండస్ట్రీలో విషాదం.. తన ఫ్లాట్ లో శవమై కనిపించిన నటి!

సినీ ఇండస్ట్రీలో తరచూ ఏదో ఒక బ్యాడ్ న్యూస్ వినిపిస్తోంది. ముఖ్యంగా కొందరు యువ నటీనటులు ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు అందరిని కలవర పెడుతున్నాయి. తాజాగా ఓ నటి..తన ప్లాట్ లో శవమై కనిపించింది.

సినీ ఇండస్ట్రీలో తరచూ ఏదో ఒక బ్యాడ్ న్యూస్ వినిపిస్తోంది. ముఖ్యంగా కొందరు యువ నటీనటులు ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు అందరిని కలవర పెడుతున్నాయి. తాజాగా ఓ నటి..తన ప్లాట్ లో శవమై కనిపించింది.

Noor Malabika Das: ఇండస్ట్రీలో విషాదం.. తన ఫ్లాట్ లో శవమై కనిపించిన నటి!

ఇటీవల కాలంలో ఇండస్ట్రీలో విషాదాలు చోటుచోసుకుంటున్నాయి. వివిధ కారణాలతో పలువురు సెలబ్రిటీలు మరణిస్తున్నారు. ఆత్మహత్య, గుండెపోటు, రోడ్డు ప్రమాదం వంటి కారణాలతో ప్రముఖులు మరణిస్తున్నరు. వారి మరణంతో కుటుంబ సభ్యులతో పాటు అభిమానులు విషాదంలో మునిగిపోతున్నారు. ఇది ఇలా ఉంటే.. ఇటీవల కాలంలో ఆర్టిస్ట్ లు వివిధ కారణాలతో ఆత్మహత్య చేసుకుంటున్నారు.  కొన్ని రోజుల క్రితం భోజ్ పూరి ఇండస్ట్రీకి చెందిన ఓ నటి సూసైడ్ చేసుకుంది. తాజాగా బాలీవుడ్ కు చెందిన ఓ నటి..తన ప్లాట్ లో శవమై కనిపించింది.

బాలీవుడ్ నటి నూర్ మాలాబికా దాస్(37) ముంబైలోని తన ఫ్లాట్ లో శవమైన కనిపించింది. ఆమె నివాసం ఉండే ప్లాట్ నుంచి దుర్వాసన వస్తుండటంతో చుట్టుపక్కల వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు నూర్ ఉండే ప్లాట్ ను ఓపెన్ చేశారు. ఆమె మృతదేహం కులిపోయిన స్థితిలో ఉండటానికి పోలీసులు గుర్తించారు. నూర్ మాలాబికా బాలీవుడ్ లో పలు వెబ్ సిరీస్ లో నటించింది. బాలీవుడ్ నటీ  కాజోల్ ప్రధాన పాత్రలో నటించిన ‘ది ట్రయల్’ లో నటించింది.  అంతేకాక ఈమె గతంలో ఖతార్ ఎయిర్ వేస్ లో ఎయిర్ హోస్టెస్ గా పని చేసింది. కాజోల్, నూర్  మాలాబికా దాస్ నటించిన లీగల్ డ్రామా చిత్రం ది ట్రయల్ 2023లో ఓటీటీలో విడుదలైంది. ఇది డిస్నీ హాట్ స్టార్ లో  స్ట్రీమింగ్ అవుతోంది.

గురువారంమహారాష్ట్రలోని ముంబై నగరంలోని ఖండ్‌వాలాలోని ఆమె ఫ్లాట్ నుండి ఆమె మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆమె ఫ్లాట్ నుండి దుర్వాసన రావడంతో ఆమె ఇరుగుపొరుగు వారు పోలీసులకు సమాచారం అందించారని వర్గాలు తెలిపాయి. ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే ఆమె ఆత్మహత్యపై సమగ్ర విచారణ జరిపించాలని ఆల్‌ ఇండియన్‌ సినీ వర్కర్స్‌ అసోసియేషన్‌ ఆ రాష్ట్ర సీఎం ఏక్‌నాథ్‌ షిండే, హోంమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌లను కోరింది. ఇలాంటి విషాదాలకు కారణం ఏమిటో కనిపెట్టడం రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమని పలువరు అభిప్రాయ పడ్డారు.

నూర్ మాలాబికా దాస్ అస్సాంకు చెందిన మహిళ. నటి కాకముందు, ఆమె ఖతార్ ఎయిర్‌వేస్‌లో ఎయిర్ హోస్టెస్‌గా పనిచేసింది. ఆ తరువాత సినిమాలపై ఉన్న ఆసక్తితో బాలీవుడ్ లోకి అడుగు పెట్టింది.  పలు వెబ్ సిరీస్ లో నటించింది. ‘సిస్కియాన్’, ‘వాల్కమాన్’, ‘తీఖీ చట్నీ’, ‘జఘన్య ఉపాయ’, ‘చరమ్‌సుఖ్’, ‘దేఖి అందేఖి’, ‘బ్యాక్‌రోడ్ హస్టేల్’ వంటి కొన్ని సినిమాలు, వెబ్ సిరీస్‌లలో ఆమె నటించింది. మొత్తంగా ఆమె మరణంతో ఇండస్ట్రీలో విషాదం అలుముకుంది. ఆమె మృతిపట్ల పలువురు సంతాపం వ్యక్తం చేశారు.

Actress malabika das passed away