Swetha
మాజీ ఎయిర్ హొస్టిస్ నూర్ మలాబికా దాస్ అనుమానాస్పద మృతి.. బాలీవుడ్ లో ప్రకంపనాలు సృష్టించింది. ఈ క్రమంలో ఈ కేస్ విషయంపై మరిన్ని విషయాలు బయటపడుతున్నాయి. దానికి సంబంధించిన విషయాలు తెలుసుకుందాం.
మాజీ ఎయిర్ హొస్టిస్ నూర్ మలాబికా దాస్ అనుమానాస్పద మృతి.. బాలీవుడ్ లో ప్రకంపనాలు సృష్టించింది. ఈ క్రమంలో ఈ కేస్ విషయంపై మరిన్ని విషయాలు బయటపడుతున్నాయి. దానికి సంబంధించిన విషయాలు తెలుసుకుందాం.
Swetha
నాలుగు రోజుల క్రితం.. ముంబైలోని ఓ అపార్ట్మెంట్ లో.. అనుమానాస్పదంగా శవమై కనిపించింది మాజీ ఎయిర్ హొస్టిస్ నూర్ మలాబికా దాస్.. ఇదే విషయం బాలీవుడ్ లో అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. ఆమెది హత్య ! లేక ఆత్మహత్య అనే విషయంలో ఇంకా దర్యాప్తు కొనసాగుతూనే ఉంది. ఇక ఆమె మరణం తర్వాత ఆల్ ఇండియా సినీ వర్కర్స్ అసోసియేషన్.. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌లను.. ఈ విషయమై క్షుణ్ణంగా దర్యాప్తు కొనసాగించాలని.. డిమాండ్ చేసింది. అయితే ఈ క్రమంలో మలాబికా దాస్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు బయటపడుతున్నాయి.
స్వతహాగా మలాబికా దాస్ అస్సాంకు చెందిన కుటుంబంలో జన్మించింది. ఆమె అనేక సంవత్సరాలు ఎయిర్ వేస్ లో స్టీవార్డెస్‌గా పనిచేసింది. ఆ తర్వాత నటిగా మారింది. ఈ క్రమంలో చాలా పెద్ద స్టార్ అవ్వాలని ఎన్నో కలలు కనింది. కానీ సినీ రంగంలో నెగ్గుగు రావడం అంటే అంత సులువైన పని కాదు. ఆమె భవిష్యత్తు కూడా ఇలానే ఆశించిన స్థాయిలో ఎదగలేదు. దీనితో ఆమె డిప్రెషన్ కు లోనైందని గతంలో కొన్ని కథనాలు కూడా వచ్చాయి. ఇక కొద్దీ రోజులకే ఆమె మరణ వార్త అందరిని కలవర పరిచింది. ఆమె మరణం వెనుక కారణం ఏంటో ఇంతవరకు ఎవరికీ అర్ధంకాకపోవడంతో.. అఖిల భారత సినీకార్మిక సంఘం ఈ విషయంమై ఆందోళన వ్యక్తం చేసింది.
సినీ నటుల ఆత్మహత్యల గురించి ఇప్పటివరకు ఎన్నో అంతుచిక్కని ప్రశ్నలు.. ఇప్పటికీ అలానే ఉన్నాయి. ఈ క్రమంలో మాలాబికా కూడా ఆత్మహత్యకు పాల్పడే అవకాశం లేకపోలేదని వార్తలు వినిపిస్తున్నాయి. దీనితో ఈ కేసును చాలా జాగ్రత్తగా పరిశీలించాలని.. ఆల్ ఇండియా సినీ వర్కర్స్ అసోసియేషన్ ఏకనాథ్ షిండే, దేవేంద్ర ఫడ్నవీస్‌లను కోరింది. ఇక ఆమె మృతదేహాన్నీ ఆమె సహోద్యోగులలో ఒకరు స్వాదీన పరుచుకుని.. ఓ ఎన్జీఓ ఆధ్వర్యంలో ఆదివారం అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఈ కేసు విషయమై ఇంకా పూర్తివివరాలు తెలియాల్సి ఉంది. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.